బంగారు కొండ ..మన దేవరకొండ - మోస్ట్ డిజైరబుల్ మెన్
తెలంగాణ వెలిగి పోతోంది. నియాన్ లైట్ల మధ్యన చార్మినార్ మెరిసి పోతోంది. వజ్రాలు, వైఢూర్యాలు అమ్మిన భాగ్యనగరం తనను తాను గొప్పనైన నగరంగా భాసిల్లుతోంది. త్యాగాలకు, బలిదానాలకు , పోరాటాలకు , ఉద్యమాలకు , ఐటీ హబ్‌కు కేరాఫ్‌గా మారిన హైదరాబాద్ తన బ్రాండ్‌ను అంతకంతకూ పెంచుకుంటూ పోతోంది. నిన్నటి దాకా తెలుగు సినిమా కొందరి చేతుల్లోనే..ఇపుడు అది అందరిది. టాలెంట్ ఎక్కడుంటే అక్కడికి పరుగులు తీస్తోంది పరిశ్రమ. కేవలం కొన్ని సినిమాల్లోనే నటించి..తన డిఫరెంట్ మేనరిజంతో ఆకట్టుకుంటూ ..తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును..బ్రాండ్ ను స్వంతం చేసుకున్న ఘనత ఒక్క విజయ్ దేవరకొండకే దక్కింది.
ఇపుడు తెలంగాణ అతడిని చూసి గర్వపడుతున్నది. ఒకే ఒక్క సినిమా అతడిలోని ప్రతిభను..హీరోయిజాన్ని ప్రదర్శించేలా చేసింది. అర్జున్ రెడ్డి సినిమా తెలుగు సినిమా ఇండస్ట్రీని షేక్ చేసింది. విజయ్ దేవరకొండ కాస్తా అర్జున్ రెడ్డిగా మారి పోయాడు.
అంతలా యూత్ తో కనెక్ట్ అయ్యాడు. అతడి రేంజ్ అగ్ర హీరోల సరసన చేరింది. ఇటీవల మహేష్ బాబు తన మహర్షి సినిమా రిలీజ్ ఫంక్షన్ కు ప్రత్యేకంగా ఆహ్వానించాడు. అంటే అర్థం అతడి రేంజ్ పెరిగినట్టే. పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి తో పాటు పరుశురాం తక్కువ బడ్జెట్‌తో తీసిన గీత గోవిందం సినిమా బ్లాక్ బ్లస్టర్ గా నిలిచింది. మహేష్ సినిమాకంటే ఎక్కువ వసూళ్లను రాబట్టింది. దీంతో సినిమా రంగం ఒక్కసారిగా విజయ్ దేవరకొండ వైపు చూసేలా చేసింది.
ఇండియాలో మోస్ట్ డిజైరబుల్ మెన్స్ ఎవరనే దానిపై సర్వే చేపట్టింది టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూపు. ఇంకేం 50 మందిని ఎంపిక చేస్తే ..అందులో మనోడు ఏకంగా నాలుగో స్థానంలో నిలిచాడు. విజయ్ దేవరకొండ తర్వాత ఇండియన్ క్రికెట్ కెప్టెన్ విరాట్ కొహ్లి నిలిచాడు. అంటే అతడి రేంజ్ 100 కోట్ల స్టామినాకు చేరుకుందన్నమాట. విజయ్ దరిదాపుల్లో మిగతా హీరోలు లేకుండా పోయారు. లిస్టు వచ్చాక విజయ్ రేంజ్ ..గ్రాఫ్ మరింత పెరిగింది.
టైమ్స్ మొత్తం 50 మందిని మాత్రమే సెలక్ట్ చేసింది. వేలాది మందిని పరిగణలోకి తీసుకుంది. ఆన్‌లైన్‌లో సర్వే ..ఒపినియన్ పోల్ నిర్వహించింది ఈ సంస్థ. 2018 సంవత్సరానికి గాను ప్రకటించిన జాబితా వివరాలోకి వెళితే ఇలా ఉన్నాయి.
బాలీవుడ్‌లో మోస్ట్ మెమోరబుల్ యాక్టర్‌గా పేరొందిన విక్కీ కుషాల్ కు మొదటి స్థానం లభించింది. రెండో స్థానంలో ప్రథమేష్ మౌలాంగ్‌కర్ ఉండగా, మూడో స్థానంలో రణ్‌బీర్ సింగ్ నిలిచారు. ఇక నాలుగో స్థానంలో తెలంగాణకు చెందిన యంగ్ అండ్ డైనమిక్ హీరో విజయ్ దేవరకొండ ఉన్నారు. అయిదో స్థానంలో ఇండియన్ క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లి ఉండగా, దుల్కర్ సల్మాన్ 9వ స్థానంలో , 12వ ప్లేస్ లో ప్రభాస్ సరి పెట్టుకున్నారు. 14వ స్థానంలో యాష్ ఉంటే, 19వ స్థానంలో రాణా దగ్గుబాటి నిలిచారు. 29వ స్థానంలో పృథ్విరాజ్ సుకుమారం ఉండగా, 33వ స్థానంలో హర్షవర్దన్ రాణే , 38వ ప్లేస్‌లో నివిన్ పాలే, 43వ ప్లేస్ లో రజనీ అల్లుడు ధనుష్ , 14వ ప్లేస్‌లో మహేష్ బాబు ఉన్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి