ఏపీలో సైకిల్ జోరు ..టీఎస్‌లో గులాబీ పరుగు - లగడపాటి జోష్యం
ఎన్నికల సర్వేల ఫలితాలలో కాస్తంత నమ్మకాన్ని కలిగి వున్న మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అంచనాలు తెలంగాణలో ఇటీవల జరిగిన తాజా ఎన్నికల్లో అంచనాలు తప్పాయి. దీంతో ఆయన తన విశ్వసనీయతను కోల్పోయారు. తర్వాత మాట మార్చారు. మరోసారి దేశ వ్యాప్తంగా జరిగిన లోక్ సభ ఎన్నికలతో పాటు తెలంగాణ, ఏపీలలో ఏ పార్టీకి ఎంపీ సీట్లు వస్తాయో అంచనా వేశారు. అంతేకాక జాతీయ స్థాయి ఛానల్స్ వైసీపీ అధికారంలోకి వస్తుందని అంచనా వేస్తే..ఒక్క లగడపాటి సర్వే మాత్రం సైకిల్ జోరు మీదుందని తేల్చి చెప్పారు. జగన్ వైసీపీ పార్టీకి 70 నుంచి 72 సీట్లకే పరిమితమై పోతుందని పేర్కొన్నారు.
తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామి సాక్షిగా లగడపాటి తన అంచనాలను ..ముందస్తు ఫలితాలను వెల్లడించారు. ఇక తెలంగాణలో ఎంపీ సీట్లలో 13 నుంచి 14 వస్తాయని తెలిపారు. ఈ ఎన్నికల్లో ఏపీ ఓటర్లు సైకిల్ , తెలంగాణ ఓటర్లు కారు ఎక్కారని స్పష్టం చేశారు. అంకెలతో కూడిన ఎగ్జిట్ పోల్స్‌ను ప్రకటించారు. ఈసారి త్రిముఖ పోరు జరిగినా ప్రజలు ఒకే వైపు మొగ్గారని తెలిపారు. తెలుగుదేశం పార్టీకి 100 స్థానాలకు పది అటో ఇటో స్థానాలు వస్తాయని పేర్కొన్నారు. ఏపీలో వైకాపా గట్టి పోటీ ఇచ్చిందని ..కానీ పవర్ లోకి రాదన్నారు. జనసేన, ఇతరులకు మూడు సీట్లకంటే ఎక్కువ రావన్నారు.
కేవలం రెండు పార్టీల మధ్య ఓట్ల శాతం రెండు శాతం కంటే మించదన్నారు. టీడీపీకి 43 శాతం వుంటే..వైసీపీకి 41 శాతం ఉంటుందని అంచనా వేశారు. లోక్‌సభ విషయానికి వస్తే టీడీపీకి 15 సీట్లు..వైకాపాకు 10 వచ్చే అవకాశం ఉందన్నారు. జనసేన గెలవడం కష్టమని తేల్చి పారేశారు. కేంద్రంలో ఏ పార్టీ పవర్‌లోకి వస్తుందనే విషయానికి వస్తే..ఈసారి హంగ్ ఏర్పడే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. మెజార్టీ పరంగా చూస్తే దగ్గరగా వచ్చి ఎన్డీయే ఆగిపోతుందన్నారు. సెంటర్‌లో వచ్చే ప్రభుత్వంపైనే ఏపీ భవిష్యత్ ఆధారపడి ఉందన్నారు.
ఆయా కూటములలోని పార్టీలకు మధ్య మెజారిటీ ఎంత ఉంటుందనేది కొద్ది గంటలు ఆగితే తేలుతుందన్నారు. కోట్లాది ప్రజలు ఏ సర్కార్ అధికారంలోకి వస్తుందనేది ఎంతో ఉత్కంఠతతో ఎదురు చూస్తున్నారు. తమ సంస్థ జనవరి నుంచి ఎన్నికల కంటే ముందు, ఆ తర్వాత నెలనెలా రాష్ట్రంలో పరిస్థితులపై అధ్యయనం చేసిందన్నారు. ఏ పార్టీతో తమకు సంబంధం లేదన్నారు. తెలంగాణలో 14 సీట్లు , ఎంఐఎంకు ఒక సీటు కచ్చితంగా రావడం ఖాయమని జోస్యం చెప్పారు. ఏపీలో తిరిగి చంద్రబాబు పవర్‌లోకి వస్తారన్నారు. మొదటి స్థానంలో టీడీపీ, రెండో స్థానంలో వైసీపీ, మూడో స్థానంలో జనసేన ఉంటుందన్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి