కారుదే జోరు - విపక్షాలు బేజారు - మగోడు కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు, నూతన రాష్ట్ర పరిపాలనాదక్షుడు , గులాబీ బాస్ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మరోసారి వార్తలో నిలిచారు. ఇటు రాష్ట్రంలోను అటు దేశంలోను ఆయన పేరు మార్మోగుతోంది. తెలుగుదేశం పార్టీలో సుదర్ఘీమైన నాయకుడిగా ఆయన తన ప్రస్థానాన్ని కొనసాగించారు. ఆ తర్వాత చంద్రబాబుతో విభేదించి డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా చేశారు. వట్టి పోయిన తెలంగాణ విముక్తి కోసం టీఆర్ ఎస్ ను స్థాపించారు. ప్రొఫెసర్ దివంగత కొత్తపల్లి జయశంకర్ ఆచారి మార్గనిర్దేశనంలో ప్రపంచం నివ్వెర పోయేలా తెలంగాణ ఉద్యమాన్ని సంబండ కులాలు, కోట్లాది ప్రజల సహకారంతో పోరాటం చేశారు.
ఉద్యమానికి ఊపిరి పోశారు. చివరకు తానే ప్రాణం తీసుకునేందుకు నడుం బిగించారు. ఆయన ఒక్కడుగా మొదలై అడుగులు వేస్తే కోట్లాది అడుగులు లోకం దద్దరిల్లేలా కేంద్రం దిగివచ్చేలా చేసింది. ఎన్నో నిర్బంధాలు, అవమానాలు, కేసులు, ఆత్మహత్యలు, విద్యార్థులపై లాఠీఛార్జీలు, సకల జనుల సమ్మెలు ఇలా ప్రతి చోటా ప్రతి నోటా దేశమంతటా తెలంగాణ పేరు వినిపించేలా చేయడంలో కేసీఆర్ సక్సెస్ అయ్యారు. మొండితనానికి, పట్టుదలకు పెట్టింది పేరు కేసీఆర్. ఒక్కసారి డిసైడ్ అయ్యారంటే ఇక వెనుతిరిగి చూడటం ఆయన జీవిత చరిత్రలో లేనే లేదు. రాజకీయాల్లో ఎంటర్ అయ్యాక..ఇప్పటి వరకు విజయాలు సాధిస్తూనే ఉన్నారు. ఏ ఒక్కసారి ఓటమి పొందిన దాఖలాలు లేవు. కేంద్రంలో కార్మిక శాఖ మంత్రిగా, డిప్యూటీ స్పీకర్‌గా, మంత్రిగా , ముఖ్యమంత్రిగా పలు ఫార్మాట్‌లలో పనిచేశారు. తాను ముందుండి జనాన్ని, తన వారిని, తను నమ్ముకున్న వారిని, తాను నమ్మిన వారిని తనతో పాటే అడుగులు వేసేలా చేస్తున్నారు.
కేసీఆర్ అంటేనే అపర చాణుక్యుడు గుర్తుకు వస్తాడు. విస్తృతమైన సమాచారం ఆయన అమ్ముల పొదిలో అస్త్రాలుగా ఉపయోగ పడుతున్నాయి. ప్రత్యర్థులకు చుక్కలు చూపించడంలో కేసీఆర్ తర్వాతే ఎవ్వరైనా. అంతలా ఆయన పాపులర్ అయ్యారు. జాతీయ స్థాయి మీడియా జర్నలిస్టులు మొదట్లో ఆయనను తక్కువ అంచనా వేశారు. ఆ తర్వాత ఈ బక్కపల్చని వ్యక్తి ..ఓ వ్యవస్థగా మారారు. ఇపుడు రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయికి చెందిన మీడియా ఎక్స్‌పర్ట్స్ అంతా కేసీఆర్ తో మాట్లాడేందుకు, ఆయనతో ఇంటర్వ్యూలు తీసుకునేందుకు, ఆయనతో గడిపేందుకు ఇష్టపడుతున్నారు. ఒకరకంగా చెప్పాలంటే పోటీ పడుతున్నారు. అతి తక్కువ కాలంలోనే కేసీఆర్ జాతీయ స్థాయిలో విస్మరించలేని నాయకుడిగా ఎదిగారు.
తెలంగాణ అంటేనే ఒకప్పుడు కనీసం వార్తల్లో చోటు కల్పించాలంటే ఇష్టపడని ప్రింట్, మీడియా, సోషల్ మీడియాలలో తాజాగా కేసీఆర్ దెబ్బకు అబ్బా అంటున్నాయి. ఎనలేని ప్రాధాన్యత కల్పిస్తున్నాయి. ప్రాంతీయ పార్టీలతో భావసారూప్యత కలిగిన వ్యక్తులతో కలిసి కొత్తగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయనున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. దీంతో మీడియా అంతా కేసీఆర్ కోసం వేచి చూసే పరిస్థితిని కల్పించారు. తనను టార్గెట్ చేస్తూ ..ముప్పు తిప్పలు పెట్టేందుకు ప్రయత్నం చేసిన నారా చంద్రబాబు నాయుడుకు కేసీఆర్ చుక్కలు చూపించారు. మరో వైపు పరిపాలనా పరంగా ఎంతో అనుభవం గడించిన బాబును కోలుకోలేకుండా చేశారు. బాబు మోదీతో కటీఫ్ చెప్పాక..కేసీఆర్ మరింత దగ్గరయ్యారు. బాబును టార్గెట్ చేశారు.
తప్పక రిటర్న్ గిఫ్ట్ ఇస్తానంటూ కేసీఆర్ ఛాలెంజ్ విసిరారు. నిన్న ప్రకటించిన ఎగ్జిట్ పోల్స్‌లో కేసీఆర్ చెప్పిన జోస్యం నిజం కాబోతోంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కొంచెం ఇబ్బందులు ఎదుర్కొన్న కేసీఆర్ ఆ తర్వాత తనకు ఎదురే లేకుండా చేసుకున్నారు. రెండోసారి జరిగిన ఎన్నికల్లో థంపింగ్ మెజారిటీని తీసుకు వచ్చేలా చేశారు. ముందస్తుగానే అభ్యర్థులను ప్రకటించారు. విపక్షాలకు కంటి మీద కునుకే లేకుండా చేశారు.
తాజాగా జరిగిన 17వ సార్వత్రిక లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ అత్యధిక సీట్లను గెలవబోతోందని..17 స్థానాలకు గాను అన్నింటిని కైవసం చేసుకుంటామని కేసీఆర్ ప్రకటించారు.
ఆయన చెప్పినట్లుగానే ఎగ్జిట్ పోల్స్ సైతం కారు జోరు మీదుందని, దానిని అడ్డుకునే శక్తి ఏ పార్టీకి లేదంటూ అన్ని సర్వే సంస్థలు స్పష్టం చేశాయి. దీంతో కేసీఆర్ గ్రాఫ్ మరోసారి అమాంతం పెరిగి పోయింది. కనీసం 12 నుంచి గరిష్టంగా 16 స్థానాలు రావొచ్చంటూ అంచనా వేశాయి. చాణక్య, ఏబీపీ, పీడీపీ, లగడపాటి సర్వేలు టీఆర్ ఎస్ తన హవాను కొనసాగిస్తుందంటూ జోస్యం చెప్పాయి. జరిగిన ఎన్నికల్లో 16 లోక్‌సభ స్థానాలలో గులాబీ శ్రేణులు పోటీ చేస్తే..మరో స్థానాన్ని స్నేహ పూర్వక ఒప్పందం మేరకు ఎంఐఎంకు వదిలి వేశారు గులాబీ బాస్. చాలా మంది పొలిటికల్ లీడర్లు చెప్పడం వరకే పరిమితమై పోతారు. కానీ కేసీఆర్ చెప్పడమే కాదు చేసి చూపిస్తారు. అందుకే ఆయన ఒకే ఒక్కడు..దమ్మున్న మగాడు అనక తప్పదు కదూ..
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి