ఎగ్జిట్ పోల్స్‌లో మోదీకే ప్రయారిటీ
అంచనాలు తారు మారు కాబోతున్నాయి. దేశ వ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలతో పాటు నాలుగు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యాయి. దీంతో ఇండియాలో న్యూస్ ఛానల్స్, సర్వే సంస్థలు ప్రీ పోల్ సర్వేల ఫలితాలు ప్రకటించాయి. కొన్ని ఛానల్స్ హంగ్ దిశగా సూచిస్తే..చాలా వరకు ఛానల్స్ బీజేపీకి ఎడ్జ్ ఉంటుందని పేర్కొన్నాయి. ఏడు దశల్లో జరిగిన పోలింగ్‌లో ప్రజా తీర్పు ఈ వీఎంలలో నిక్షిప్తమైంది. ఇక ఫలితాలు వెల్లడించేందుకు కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ప్రసిద్ధ సర్వే సంస్థలు ప్రజా నాడిపై తమ తమ అంచనాలతో కూడిన సర్వేలను బయట పెట్టాయి.
తమిళనాడులోని వేలూరు లోక్‌సభ స్థానం మినహా 541 స్థానాలతో పాటు ఏపీ, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాలలో అసెంబ్లీ ఫలితాలు రానున్నాయి. ఏపీలో గతంలో చంద్రబాబు మోదీతో జత కట్టారు. ఆ తర్వాత తాజాగా జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిసి ప్రయాణం చేశారు. కమలానికి కటీఫ్ చెప్పారు. రాహుల్ గాంధీతో కరచాలనం చేశారు. మోదీకి వ్యతిరకంగా బీజేపీయేతర పార్టీలను ఒకే వేదికపైకి తీసుకు వచ్చేందుకు ప్రయత్నించారు. కర్ణాటకలో మాజీ ప్రధాని దేవెగౌడ, తమిళనాడులో స్టాలిన్, పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ, ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్, శరద్ పవార్, ఫారూఖ్ అబ్దుల్లా, బీఎస్‌పీ అధినేత్రి మాయావతి, అఖిలేష్ యాదవ్, ములాయంలను స్వతహాగా కలిసి ఒప్పించారు.
ఆ దిశగా ఒక వేదికను ఏర్పాటు చేశారు. ఇక సర్వే సంస్థలు, న్యూస్ ఛానల్స్ వెల్లడించిన ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. టైమ్స్ నౌ ఛానల్ ప్రకారం బీజేపీకి 306 సీట్లు, కాంగ్రెస్ పార్టీకి 132 సీట్లు, ఇతరులు 104 సీట్లు రానున్నాయి. ఏబీపీ న్యూస్
కేవలం 188 స్థానాలకే ప్రకటించారు. 108 బీజేపీకి, 24 కాంగ్రెస్‌కు, ఇతరులకు 56 సీట్లు వస్తాయని తెలిపారు. న్యూస్ నేషన్ సర్వే ప్రకారం 282 సీట్లు ఎన్డీఏకు యుపీఏకు 126 సీట్లు, ఇతరులకు 138 సీట్లు వస్తాయని పేర్కొంది. విడిపీఏ అంచనా ప్రకారం 333 సీట్లు బీజేపీ మిత్రపక్షాలకు , 115 సీట్లు యుపిఏకు, ఇతరులు 94 సీట్లు వస్తాయని తెలిపింది.
రిపబ్లిక్ టివి - జన్ కీ బాత్ సర్వే లో 315 ఎన్డీఏకు ..124 సీట్లు యుపీఏకు 113 సీట్లు ఇతరులకు వస్తాయని వెల్లడించింది. మరో వైపు రిపబ్లిక్ టీవీ - సి - ఓటర్ ప్రకారం 287 సీట్లు బీజేపీకి, 128 కాంగ్రెస్‌కు 127 ఇతరులకు సీట్లు వస్తాయని తెలిపింది. ఎన్డీటీవీ ఛానల్ అంచనా వరకు చూస్తే 302 ఎన్డీయేకు 127 యుపిఏకు 133 సీట్లు ఇతరులు గెలుస్తారని వెల్లడించింది. టైమ్స్ ఆఫ్ ఇండియా అయితే 306 ఎన్డీయే, 152 యుపిఏ, 84 ఇతరులు విజయం సాధిస్తారని వెల్లడించింది. ఇండియా టీవి 208 స్థానాలకే ఫలితాలు ఇచ్చింది. సర్వేలు అధిక శాతం వైసీపీ వైపు మొగ్గితే మరికొన్ని మాత్రం టీడీపీ వైపు ఎడ్జ్ ఉన్నట్లు పేర్కొన్నాయి.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి