అడిగో ప్రోత్సాహం - జెట్‌కు పూర్వ వైభవం
ఇండియన్ ప్రైవేట్ ఎయిర్‌లైన్స్‌లలో విశిష్ట సేవలందిస్తూ తక్కువ కాలంలోనే ఎక్కువ ప్రాచుర్యం పొందిన జెట్ ఎయిర్ వేస్ అనుకోని రీతిలో సంక్షోభంలోకి కూరుకు పోయింది. దాదాపు 8 వేల 500 కోట్లకు పైగా ఒక్క స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెల్లించాల్సి ఉంది జెట్ ఎయిర్ వేస్ యాజమాన్యం. సంస్థ అప్పుల్లో కూరుకు పోయిందని, ఇక మూసి వేయడమే మేలంటూ యాజమాన్యం చల్లగా చెప్పింది. దీంతో వేలాది మంది సంస్థ ఉద్యోగులు రోడ్డెక్కారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే తమను ఆదుకోవాలని, తమకు న్యాయం చేయాలని కోరారు. ఎన్నికల సమయంలో ప్రస్తుత సర్కార్‌కు ఇది తలనొప్పిగా మారింది.
మరో వైపు ప్రభుత్వ సంస్థ ఎయిర్ ఇండియా కూడా సేమ్ టు సేమ్ రేపో మాపో లాకౌట్ ప్రకటించే అవకాశం ఉంది. సేవలలో ముందంజలో ఉన్న ఈ రెండు విమానాశ్రయాలు తీర్చలేని అప్పుల్లో కూరుకు పోయాయి. బయటకు రాలేక లబోదిబోమంటున్నాయి. జెట్ ఎయిర్ వేస్ ను టేకోవర్ చేసేందుకు పలు సంస్థలు ముందుకు వచ్చినా..ఏ ఒక్క సంస్థ ఇప్పటి వరకు ఇదమిద్దంగా పూర్తి నిర్ణయానికి రాలేక పోతున్నాయి. ఎస్‌బిఐ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ రజనీష్ కుమార్ దిద్దుబాటు చర్యలు ప్రారంభించారు. ఎట్టి పరిస్థితుల్లోను 50 రోజుల్లో జెట్ ఎయిర్ వేస్ విమానాలు ఎగిరేలా చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే దీనిని మూసి ఉంచారు. ఇటీవల ఎస్‌బీఐ అనూహ్యంగా బిడ్ కు ఆహ్వానించింది. కొన్ని అంతర్జాతీయ సంస్థలు జెట్ ఎయిర్ వేస్ ను స్వంతం చేసుకునేందుకు ఉత్సుకత కనబరిచాయి.
లండన్ అడిగో గ్రూప్‌నకు చెందిన అడిగ్రో ఏవియేషన్ జెట్ కు పూర్వ వైభవం తీసుకు వచ్చేందుకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. జెట్ ఎయిర్ వేస్ వాటాలు కొనేందుకు ఆసక్తి ఉన్నట్లు తెలిపింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కు చెందిన ఎథెహాద్ ఎయిర్ వేస్ సంస్థతో కలిసి తాము పనిచేసేందుకు రెడీగా ఉన్నామని స్పష్టం చేసింది. 25 ఏళ్ల వయసు కలిగిన జెట్ ఎయిర్ వేస్ సంస్థను కోలుకునేలా చేస్తామని అడిగ్రో గ్రూపు వ్యవస్థాపకుడు ..చైర్మన్ సంజయ్ విశ్వనాథన్ స్పష్టం చేశారు. 8000 నుంచి 9000 మంది ఉద్యోగులతో..70 ఎయిర్ క్రాఫ్ట్‌లతో ఆపరేషన్స్ మళ్లీ ప్రారంభించాలని కంపెనీ కోరుకుంటోంది.
అయితే సంస్థ తిరిగి గాడిలో పడాలంటే..ఉద్యోగులు, సిబ్బంది త్యాగం చేయాలని పిలుపునిచ్చింది. ఇతర ఉద్యోగులు కూడా పది శాతం వేతనాలను వదులు కోవాలన్నారు. ప్రాక్టికల్ హెయిర్‌కట్ ను మాత్రమే మేం కోరుతున్నాం..దానికి ప్రతిఫలంగా ఈక్విటీని ఇవ్వనున్నామని స్పష్టం చేశారు. ఎథిహాద్ మైనార్టీ వాటాలను కొనేందుకు మాత్రమే ముందుకు వచ్చింది. దీంతో మిగతా వాటాలను కొనుగోలు చేసేందుకు ఇతర సంస్థలతో చర్చలు జరుపుతోంది ఎస్‌బీఐ. జెట్ ను పునరుద్ధరించేందుకు అడిగ్రో ఏవియేషన్ కూడా బిడ్ వేసింది. దీనిని పునరుద్ధరించాలంటే 3 వేల నుంచి 6 వేల కోట్లు కావాలని విశ్వనాథన్ తెలిపారు. మొత్తం మీద జెట్ ఎయిర్ వేస్ కు పూర్వ వైభవం రానుంది. ఇది ఉద్యోగులకు, సిబ్బందికి ఉషారునిచ్చే వార్త.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి