ఆర్థిక రంగం అస్తవ్యస్తం
భారత దేశ ఆర్థిక వ్యవస్థ ఇపుడు నడిసంద్రంలో కొట్టుమిట్టాడుతోంది. కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచ మార్కెట్‌ను తీవ్ర ప్రభావం చూపిస్తోంది. చైనాలో స్టార్ట్ అయిన ఈ వైరస్ వల్ల అనేక దేశాలు అల్లాడి పోతున్నాయి. నష్ట నివారణ చర్యలు చేపట్టినా కంట్రోల్ కాక పోవడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో లాక్ డౌన్ చేస్తున్నాయి. దీంతో ఉత్పత్తి, పారిశ్రామిక రంగాలన్నీ క్లోజ్ కావడంతో ప్రపంచ మానవాళి మనుగడకు మరింత ప్రమాదం ఏర్పడింది. ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రపంచాన్ని ఒంటి చేత్తో శాసిస్తున్న అగ్రరాజ్యం అమెరికా సైతం కరోనా వైరస్‌ను కట్టడి చేయలేక పోతోంది. నష్ట నివారణ చర్యలు తీసుకోవాల్సిన ప్రెసిడెంట్ ట్రంప్ దీని పట్ల కొంత ఉదాసీన వైఖరిని అవలంభిస్తూ వచ్చారు. ఇది మరింత పెను ప్రమాదంగా పరిణమించింది. దీంతో ఆలస్యంగా మేల్కొన్న ప్రెసిడెంట్ అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. కరోనా కంట్రోల్ చేసేందుకు ట్రిలియన్ డాలర్లను ప్రకటించారు.
అంతకు ముందు ట్రంప్ చైనాను టార్గెట్ చేశారు. చైనా వల్లనే ఈ కరోనా మహమ్మారి దాపురించిందంటూ కారాలు మిరియాలు నూరారు. దీనికి తానేమీ తక్కువ తినలేదంటూ చైనా ఘాటుగా యుఎస్‌కు కౌంటర్ ఇచ్చింది. తమ జోలికి వస్తే ఊరుకునే ప్రసక్తి లేదంటూ హెచ్చరించింది. దీంతో డ్రాగన్, అమెరికాల దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థితికి చేరుకుంది. ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకున్నారు. నీ వల్లనే ఈ వైరస్ మాలో వ్యాపించిందంటూ తీవ్ర ఆరోపణలు చేశారు ట్రంప్. దీనిపై స్పందించిన చైనా ప్రెసిడెంట్ జింగ్ పిన్ తమ దేశంలో కరోనా వచ్చిన మాట వాస్తవమేనని ఒప్పుకుంటూనే, దానిని సక్సెస్ ఫుల్ గా కంట్రోల్ చేయగలిగామని స్పష్టం చేశారు. ముందు జాగ్రత్త చర్యలు చేపట్టడం వల్లనే ఇపుడు దేశం ప్రశాంతంగా ఉంటోందన్నారు. పూర్తిగా లాకౌ డౌన్ ప్రకటించడంతో పాటు ఏ ఒక్కరు బయటకు రాకుండా ఆదేశాలు జారీ చేయడం వల్ల కరోనాను రాకుండా అడ్డుకోగలిగామని వెల్లడించారు. నిరాధారమైన ఆరోపణలు చేయడం మానుకోవాలని అమెరికా ప్రెసిడెంట్ కు సూచించారు జింగ్ పిన్.
మరో వైపు ప్రపంచంలోని రెండు అగ్ర రాజ్యాలు చైనా, అమెరికాలు ఒకరిపై మరొకరు యుద్ధం చేసుకునే స్థాయికి చేరుకున్నాయి. ఈ క్రమంలో ప్రపంచ మార్కెట్ పై తీవ్ర ప్రభావం పడింది. కరోనా వైరస్ రాకెట్ కంటే శరవేగంగా విస్తరిస్తూ పోవడంతో దేశాలన్నీ బెంబేలెత్తి పోతున్నాయి. ఏం చేయాలో పాలుపోక తల్లడిల్లుతున్నాయి. ఈ వైరస్ వల్ల పెను ప్రమాదం పొంచి వుందని ముందే పసిగట్టిన దేశాలన్నీ నష్ట నివారణ చర్యలు చేపట్టాయి. ఇందులో భాగంగా ఎలాంటి వైద్య పరికరాలు, మందులు లేకపోవడంతో లాక్ డౌన్ ప్రకటించాయి. ఇంతకంటే మరో మార్గం లేదంటూ స్పష్టం చేశాయి. ఈ అసౌకర్యానికి తామంతా చింతిస్తున్నామని, ప్రస్తుతం ఏ ఒక్కరు ఆకలితో ఉండకుండా ఉండేందుకు కఠిన చర్యలు తప్పడం లేదంటూ పేర్కొన్నాయి. ఇందులో భాగంగానే భారత ప్రధాని మోదీ సైతం 21 రోజుల పాటు ఇండియాలో షట్ డౌన్ ప్రకటించారు. ఏ ఒక్కరు బయటకు రావద్దంటూ విన్నవించారు. మొత్తం మీద కరోనా ప్రభావం దెబ్బకు దేశ ఆర్థిక వ్యవస్థ కుప్ప కూలే ప్రమాదం పొంచి ఉందంటూ ఆర్థికరంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీని వల్ల కోట్లాది మంది అసంఘటిత కార్మికులు రోడ్డుపాలయ్యే ప్రమాదం పొంచి ఉంది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి