యాడ్స్ గురూ..కోట్లే కోట్లు బాస్..!

ఐడియాలు ఎన్నో..కానీ వ‌ర్క‌వుట్ అయితే ..కోట్లు వెనకేసు కోవ‌చ్చు. ఇదంతా ఆయా ఛాన‌ల్స్, రేడియోలు, మీడియా, ప్ర‌చుర‌ణ రంగంలో నిరంత‌రం మ‌న‌ల్ని ప్ర‌భావితం చేసేవి ప్ర‌క‌ట‌న‌లే. కొన్ని జింగిల్స్ కూడా ప్రాముఖ్యం వ‌హిస్తాయి. జ‌స్ట్..అర సెకండ్ నుంచి 2 నిమిషాల వ్య‌వ‌ధిలో వ‌చ్చి పోయే ఈ యాడ్స్ సృష్టించే సునామీ అంతా ఇంతా కాదు. లెక్క‌లేనంత ..లెక్కించ‌లేనంత‌. కోట్ల‌ను దాటి డాల‌ర్ల‌ను కొల్ల‌గొడుతున్నాయి మ‌న యాడ్స్. ఏ టీవీ ఆన్ చేసినా..ఏ యూట్యూబ్, నెట్ ఫ్లిక్స్, హాట్ స్టార్‌ల‌ను ట‌చ్ చేస్తే చాలు ..వంద‌లాది యాడ్స్ వ‌స్తూనే వుంటాయి. ప్ర‌తి సినిమాకు ముందు ట్రైల‌ర్ ఎలాంటిదో..ప్ర‌తి ప్రొడ‌క్ట్ కు మార్కెట్ కావాలంటే అర్థ‌వంతమైన ..ఆలోచ‌న‌ల‌ను రేకెత్తించి..కొనుగోలుదారుల మ‌న‌సు దోచుకునేలా ..హ‌త్తుకునేలా త‌యారు చేయాలంటే ..గంట‌ల త‌ర‌బ‌డి చెబితే వినే ప‌రిస్థితుల్లో లేరు జ‌నం. ఏ వ్యాపారానికైనా ..ఏ వ‌స్తువుకైనా ..ఏ కంపెనీకైనా..క‌స్ట‌మ‌ర్లే కీల‌కం..వారే దేవుళ్లు. ఆయా దేశాల్లోని ప్ర‌భుత్వాలు కూడా తాము చేసిన అభివృద్ధిని ప్ర‌క‌ట‌న‌ల ద్వారా తెలియ చేస్తుంటారు. ఇపుడు రేడియోలు కూడా విరివిగా ఉండ‌డంతో యాడ్స్ గంప గుత్త‌గా వ‌చ్చి ప‌డుతున్నాయి. మ‌న‌ల్ని క‌ట్టి ప‌డేస్తున్నాయి.

మీకు గుర్తుందో లేదో కానీ..ఐడియా కంపెనీ త‌యారు చేసిన‌..ఒక్క ఐడియో మీ జీవితాన్ని మార్చేస్తుంద‌న్న యాడ్ ఇప్ప‌టికీ ఎప్ప‌టికీ గుర్తుండి పోతుంది. క‌మాన్ ఇండియా స్లోగ‌న్ ..అప్ప‌ట్లో భార‌త్ ను ష‌క్ చేసింది. క్రికెట‌ర్స్, సెల‌బ్రెటీలు, మోస్ట్ పాపుల‌ర్ ప‌ర్స‌నాలిటీస్, చిల్ట్ర‌న్స్ ఇందులో భాగ‌స్వాముల‌య్యారు. మ‌రికొంద‌రు ఈ యాడ్స్‌ల‌లో న‌టించి ..యాక్ట‌ర్లుగా , ప్ర‌యోక్త‌లుగా రాణించారు. కోట్లు సంపాదించే స్థాయికి చేరుకున్నారు. ఆయా కంపెనీల‌న్నీ సెల‌బ్రెటీల‌నే ఎక్కువ‌గా ఎంచుకుంటాయి. ఎందుకంటే వారికి ఉన్నంత ఫాలోయింగ్ ఇంకెవ్వ‌రికీ ఉండ‌దు. కొన్ని వాణిజ్య ప్ర‌క‌ట‌న‌లు క్రియేటివిటీకి అద్దం ప‌డితే మ‌రికొన్ని గుండెల్ని పిండేసేలా సోష‌ల్ మెస్సేజ్ ఇస్తున్నాయి. వాటిలో ఈ మ‌ధ్య ఇండియాలో మ‌రింత పాపుల‌ర్‌గా నిలిచిన యాడ్స్ ఏవో చూస్తే..ఆశ్చ‌ర్యం వేయ‌క మాన‌దు.

దాదాపు 25 యాడ్స్ కు పైగా క్రియేటివిటికీ అద్దం ప‌ట్టాయి. అవేవంటే, ఇరుకైన గ‌దిలో , గాలి దూరని సందులో ఓ మ‌నిషి ప‌డుకుని ఉంటే..వెలుతురు రావ‌డాన్ని అద్భుతంగా చిత్రీక‌రించిన కంపెనీ టైడ్. ఆ యాడ్ నెంబ‌ర్ వ‌న్ గా నిలిచింది. దీనినే ఎక్కువ‌గా వీక్షించారు. భార‌తీయ సంస్కృతిని, నాగ‌రిక‌త‌ను ప‌రిర‌క్షించ‌డంలో తాము ముందుంటామ‌ని, అందుకోసం త‌మ వాహ‌నాల్లో ప్ర‌యాణిస్తే ఆ జ‌ర్నీ తీరే వేరంటూ నిస్సాన్ కంపెనీ త‌న కొత్త కారును ఇంట్ర‌డ్యూస్ చేస్తూ తీసిన నిస్సాన్ మిక్రా యాడ్ రెండో స్థానంలో నిలిచింది. మూడో స్థానంలో రాజ‌స్థాన్ స్టేట్ టూరిజం డెవ‌ల‌ప్ చేసిన యాడ్ నిలిచింది. జానే క్యా దిఖ్ జాయే అన్న ట్యాగ్ లైన్ తో యాడ్ ఆక‌ట్టుకుంది. నాలుగో స్థానంలో ఇఫ్ దే కేన్ , వై కాంట్ యూ యాడ్ ఉండ‌గా , ఐదో స్థానంలో బెర్జ‌ర్ పెయింట్స్ కంపెనీ యాడ్ చోటు ద‌క్కించుకుంది. ఆకాశానికి సైతం మా రంగులు చేరుతాయ‌న్న యాడ్ ఎంద‌రినో ఆక‌ట్టుకుంది. ఆరో ప్లేస్‌లో ఓ అమ్మాయి ప‌డిన ఆవేద‌న‌ను క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్టుగా చూపించింది.

డ్రైవింగ్ చేస్తున్న‌ప్పుడు మాట్లాడ‌కండి అన్న‌ది యాడ్ ఉద్ధేశం. ఇక ఏడో స్థానంలో ఫెవికోల్ కంపెనీ త‌యారు చేసిన యాడ్స్ ఇండియాను షేక్ చేశాయి. ఎడారిలో ..లారీలో ప‌ట్ట‌లేనంత జ‌నం..అంద‌రూ ఒక‌రినొక‌రు క‌లిసి ఉండేలా త‌యారు చేశారు.. ఈ యాడ్‌ను. బెస్ట్ క్రియేటివిటీకి అద్దం ప‌ట్టింది. 8వ ప్లేస్‌లో ఐ మీన్ దె రియ‌ల్లీ స్టిక్ అరౌండ్ యాడ్ ఉండ‌గా, 9వ స్థానంలో జాబ్స్ క్రియేష‌న్స్ లో నెంబ‌ర్ వ‌న్ స్థానంలో ఉన్న నౌక‌రీ .కామ్ కంపెనీ యాడ్ నిలిచింది. ఇలా మ‌రికొన్ని కంపెనీలు త‌మ యాడ్స్ తో ఆక‌ట్టుకుంటూ వ్యాపారాన్ని విస్త‌రించేలా చేస్తున్నాయి. తాజాగా ఫోన్ పే యాడ్ దుమ్ము రేపుతోంది. డ‌బ్బులు సంపాదించాలంటే చాలా క‌ష్ట‌ప‌డాలి అంటాడు తండ్రి...కొడుకుతో..చాలా ఈజీ అంటాడు కొడుకు..అదెలాగా అంటే..ఫోన్ పే ఉందిగా..ట‌చ్ చేయి..లాగిన్ కా..డౌన్లోడ్ చేసుకో..డ‌బ్బులు సంపాదించు..ఇదే యాడ్ ఉద్దేశం. సో..కోట్లు కావాలంటే..యాడ్ క్రియేట్ చేయాల్సిన ప‌నిలేదు..కావాల్సింద‌ల్లా అదిరిపోయే ఐడియా వుంటే చాలు.

కామెంట్‌లు