మిస్ట‌ర్ కూల్‌కు 38 ఏళ్లు - ధోనీ ఇలాగే వ‌ర్ధిల్లు..!

ప్ర‌పంచ క్రికెట్ చ‌రిత్ర‌లో మిస్ట‌ర్ కూల్ క్రికెట‌ర్‌గా పేరు సంపాదించుకున్న ఇండియ‌న్ క్రికెట‌ర్ , మాజీ భార‌త క్రికెట్ జ‌ట్టు ర‌థ‌సార‌థి మ‌హేంద్ర సింగ్ ధోనీకి ఇపుడు 38 ఏళ్లు నిండాయి. భార‌త్‌కు క‌పిల్‌దేవ్ సారథ్యం త‌ర్వాత ధోనీ నేతృత్వంలో ఇండియాకు ప్ర‌పంచ క‌ప్ ద‌క్కింది. ఆయ‌న ఇప్పుడు మ‌రో ప్ర‌పంచ క‌ప్ టోర్నీలో ఆడుతున్నాడు. ఇదే ఆఖ‌రు టోర్నీ కావ‌చ్చు త‌న కెరీర్‌లో. అటు బ్యాటింగ్ లో ఇటు కీపింగ్‌లో త‌న‌కంటూ ఓ బ్రాండ్ ఇమేజ్‌ను స్వంతం చేసుకున్న ఈ ఆట‌గాడు ఎప్పుడూ సంయ‌మ‌నం కోల్పోలేదు. కూల్‌గా, ప్ర‌శాంతంగా ఎలాంటి వ‌త్తిళ్ల‌లోనైనా స‌రే జ‌ట్టును విజ‌య తీరాలకు చేర్చ‌డంలో ధోనీని మించిన నాయ‌కుడు లేడు..ఆట‌గాళ్లు ద‌రిదాపుల్లో లేరంటే అతిశ‌యోక్తి కాదేమో. 1981 జూలై 7న ఒక‌ప్ప‌టి బీహార్ రాష్ట్రం..ఇపుడు ఝార్ఖండ్ స్టేట్‌లో ఉన్న రాంచీలో జ‌న్మించారు. ఆయ‌న‌కు మిస్ట‌ర్ కూల్‌గా, మ‌హిగా, తాలా పేర్లున్నాయి. ఎడ‌మ చేతి బ్యాట్స్ మెన్ గా  స‌క్సెస్ అయ్యారు. అలాగే కీప‌ర్‌గా కూడా రాణించారు.

2005 డిసెంబ‌ర్ 2న శ్రీ‌లంక‌తో టెస్ట్ మ్యాచ్ ఆరంగ్రేటం చేశాడు. 2004 డిసెంబ‌ర్ 23న బంగ్లాతో జ‌రిగిన వ‌న్డే మ్యాచ్‌లో ఎంట‌ర్ అయ్యాడు. టి20 సౌతాఫ్రికాతో 2006లో ఆడాడు. చెన్నై సూప‌ర్ కింగ్స్ జ‌ట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు. 90 టెస్టుల్లో 4 వేల 876 ప‌రుగులు చేయ‌గా, 348 వ‌న్డేల్లో 10 వేల 723 ప‌రుగులు చేస్తే, టి 20లో 98 మ్యాచ్‌లు ఆడి 1617 ప‌రుగులు సాధించాడు. టెస్టుల్లో 38.09 శాతంగా ఉంటే వ‌న్డేల్లో 50.58 శాతం, టి 20లో 37.60 శాతం గా ఉంది. టాప్ స్కోర్ ప‌రంగా చూస్తే టెస్టుల్లో 224 ప‌రుగులు ఉండ‌గా , వ‌న్డేల్లో 183 ప‌రుగులు చేసి నాటౌట్‌గా ఉన్నాడు. ఒకే ఒక వికెట్ తీసుకున్నాడు. ఇక టెస్టుల ప‌రంగా చూస్తే 256 క్యాచ్‌లు ప‌ట్టుకోగా, 38 స్టంపింగ్‌లు చేశాడు. వ‌న్డే మ్యాచ్‌ల ప‌రంగా చూస్తే 317 క్యాచ్‌లు ప‌ట్ట‌గా 122 స్టంపింగ్ చేశాడు. టి 20లో 57 క్యాచ్‌లు తీసుకోగా 34 స్టంపింగ్స్ ఉన్నాయి. 2007 నుంచి 2016 దాకా అంటే 9 ఏళ్ల పాటు ఇండియా వ‌న్డే జ‌ట్టుకు ప్రాతినిథ్యం వ‌హించాడు.  టెస్ట్ క్రికెట్ ప‌రంగా చూస్తే 2008 నుంచి 2014 దాకా ఆరేళ్ల పాటు సేవ‌లందించాడు. ఎం.ఎస్. ధోనీ సార‌థ్యంలో 2007 ఐసీసీ వ‌ర‌ల్డ్ క్రికెట్ కప్‌ను చేజిక్కించుకుంది ఇండియా.

వ‌ర‌ల్డ్ ట్వంటీ 20తో పాటు 2010 నుంచి 2016 దాకా జ‌రిగిన ఆసియా క‌ప్‌ల‌ను, 2011లో ఐసీసీ వ‌ర‌ల్డ్ క‌ప్, 2013 ఐసీసీ ఛాంపియ‌న్స్ ట్రోఫీని సాధించి పెట్టాడు ధోనీ. 10 వేల‌కు పైగా ప‌రుగులు చేసిన ఆట‌గాడిగా వ‌న్డేల్లో రికార్డు తిర‌గ రాశాడు. అన్ని ఫార్మాట్‌ల‌లో బెస్ట్ వికెట్ కీప‌ర్స్ ల‌లో ధోనీయే నెంబ‌ర్ వ‌న్ ఆట‌గాడుగా పేరొందాడు. త‌న ఆట‌తీరుతో కెప్టెన్‌గా, క్రికెట‌ర్‌గా ఎన్నో అవార్డులు, పుర‌స్కారాలు పొందాడు ఈ మాజీ కెప్టెన్. ఐసీసీ ప్లేయ‌ర్ ఆఫ్ ద అవార్డును 2008లో, 2009లో ద‌క్కించుకున్నాడు. 2007లో భార‌త ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌క‌మైన రాజీవ్ ఖేల్ ర‌త్న అవార్డును బ‌హూక‌రించింది. ధోనీకి ఆర్మీ అంటే ఎన‌లేని అభిమానం. ప‌ద్మ‌శ్రీ పుర‌స్కారం పొందారు. 2009లో ప‌ద్మ భూష‌న్ అత్యున్న‌త అవార్డును పొందారు. ఐసీసీ వ‌ర‌ల్డ్ టెస్ట్ 11 జ‌ట్టుకు 2009, 2010, 2013లో అంత‌ర్జాతీయ జ‌ట్టుకు కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించారు. ఐసీసీ వ‌ర‌ల్డ్ ఓడిఐ 11 టీమ్స్ జ‌ట్టులో 8 సార్లు ఎంపికై చ‌రిత్ర సృష్టించారు ధోనీ. టైం మ్యాగ‌జైన్ ప్ర‌పంచంలో శ‌క్తివంత‌మైన ఆట‌గాళ్లు, వ్య‌క్తుల్లో ధోనీని ఒక‌డిగా చేర్చింది. ఇండియా సిమెంట్స్ సిమెంట్ కంపెనీకి వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. 2012లో స్పోర్ట్స్ ప్రో కంపెనీ ..మోస్ట్ మార్కెట‌బుల్ అథ్లెట్ ఇన్ ద వ‌ర‌ల్డ్ ..జాబితాలో ధోనీకి ఆరో ప్లేస్ ఇచ్చింది. ఇండియాకు ఎన్నో విజ‌యాలు అందించిన ఈ క్రికెట్ యోధుడు ఎప్ప‌టికీ గుర్తుండి పోతాడు. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!