ఫుడ్ ప్రాససింగ్ వెంఛర్స్‌కు ఎంటిఆర్ భారీ ఆఫర్
దేశంలో ఏ మూలకు వెళ్లినా ..గల్లీ నుంచి ఢిల్లీ దాకా ..ఏ కిరాణా కొట్టు ముందు వాలిపోయినా ..మనకు కనిపించేది ..ఆహార ఉత్పత్తుల విషయంలో ఎంటిఆర్ గుర్తు. ఇంతగా పాపులర్ అయిన ఈ ఇమేజ్..బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న కంపెనీది. ప్రతి కుటుంబంలో నిత్యం ..నిరంతరం వాడే వంట దినుసులను ఈ కంపెనీ సరసమైన ధరలకు నాణ్యమైన రీతిలో విక్రయిస్తోంది. దీని వ్యాపారం ఏటా కోట్లకు చేరుకుంది. దేశీయంగానే కాకుండా విదేశాల్లో ఎంటిఆర్ కంపెనీకి స్టోర్లున్నాయి. ఎగుమతి పరంగా డాలర్ల పంట పండుతోంది. ఆహార రంగంలో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఎక్కువగా మందులు లేని పంటలు, పప్పులు, దినుసులకే ఎక్కువగా ప్రయారిటీ ఇస్తున్నారు కొనుగోలుదారులు. దీనిని గమనించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సైతం ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు భారీ ఎత్తున ప్యాకేజీలు, రుణాలు, సబ్సిడీలు ప్రకటించాయి.
ఈ మేరకు ఆహార రంగంలో టాప్ రేంజ్‌లో కొనసాగుతున్న ఎంటిఆర్ కంపెనీ ..ఫుడ్ ప్రాసెసింగ్ వెంఛర్స్‌ను ప్రోత్సహించేందుకు గాను అంకుర సంస్థలు ఏర్పాటు చేసేందుకు ..50 కోట్ల రూపాయలను ప్రత్యేక నిధి కింద జమ చేసింది. ఈ మేరకు కంపెనీ యాజమాన్యం నూతన ఆవిష్కరణలతో వచ్చే వారికి తాము నిధులను కేటాయించనున్నట్లు తెలిపింది. ఎంటిఆర్ ఏర్పాటై 95 సంవత్సరాలు అవుతోంది. ప్యాకింగ్ ఫుడ్ ఐటమ్స్‌ను తయారు చేసి అమ్ముతోంది. ఆఫ్‌లైన్ లోనే కాకుండా ఆన్‌లైన్‌లో కూడా ఉత్పత్తులను విక్రయిస్తోంది ఎంటిఆర్. దోశ, ఇడ్లి మేకింగ్ ఐటమ్స్ కు విపరీతమైన గిరాకీ ఉంది. ఆహార రంగానికి ఎక్కడ లేనంత డిమాండ్ ఉంటుంది. ఈ మార్కెట్ లో హెచ్చు తగ్గులు అంటూ వుండవు. బంగారం, వెండి, ఆయిల్, డైమండ్స్ కు కస్టమర్లు ఎలా పడిచస్తారో ..ఫుడ్ ఐటమ్స్ కు కూడా ఇష్టపడతారు. ఇదే మార్కెట్ పరంగా ఉన్న రహస్యం. రుచి, శుచి, నాణ్యత ను పాటిస్తే ధర ఎంత ఉందన్న విషయాన్ని ఎవరూ పట్టించుకోరంటారు
ఎంఆర్‌టి యాజమాన్యం. 2017 ఆగస్టు నెలలో ఎంటిఆర్ ఫుడ్స్ కంపెనీకి పేరెంట్ కంపెనీగా ఉన్న ఓర్కలా గ్రూపు వెంఛర్ ఫండ్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ సంస్థ నార్వే దేశానికి చెందినది. ఎంటిఆర్‌తో కలిసి పనిచేస్తోంది. ఎంటిఆర్ సీడ్ ఫండ్ పేరుతో 2017 నుంచి 2018 వరకు ఏర్పాటైన ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్‌కు ఈ నిధుల నుండి డబ్బులు సాయం చేస్తుంది.
పిల్లల కోసం తయారు చేసే టిమియోస్ ఫుడ్ బ్రాండ్ ను బెంగళూరుకు చెందిన ఫర్మ్ రూట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ద్వారా సరఫరా చేస్తోంది. యాపిల్, ట్విగ్స్, క్యారట్, క్యూమిన్ స్టిక్స్, పినాట బెర్రీ బార్, టొమాటో అండ్ చైనీస్ రింగ్స్ ,తదితర ఫుడ్ ఐటమ్స్ లో టాప్ వన్‌గా నిలుస్తోంది. ఫార్చూన్ నెక్ట్స్ 500 కంపెనీలలో ఎంటిఆర్ ఫుడ్ కంపెనీ 26 శాతం నుంచి 49 శాతానికి పెరిగిందని పేర్కొంది.
ఈ కంపెనీల జాబితాలో ఫుడ్ కంపెనీల పరంగా చూస్తే ఎంటిఆర్ టాప్ వన్. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల కు సీడ్ ఫండింగ్ సపోర్ట్‌తో పాటు చెఫ్‌లు, బ్రాండింగ్, లీగల్ అసిస్టెన్స్, ట్రెజరీ, అకౌంటింగ్ సపోర్ట్ సర్వీసెస్ అందజేస్తుంది ఎంటిఆర్. దీని వల్ల టెక్నికల్ గా ఎలాంటి ఇబ్బందులు ఏర్పడవు. అవసరమైతే ట్రైనింగ్, మెంటార్‌షిప్, ఫ్రాంఛైజీల ఏర్పాటు కూడా ఈ కంపెనీనే చూసుకుంటుంది. దీంతో వ్యాపారం నిర్వహించడం తేలికైన పని. 1924లో మావల్లి టిఫిన్ రూం ( ఎంటిఆర్ ) పేరుతో యజ్ఞనారాయణ మారియా ను స్థాపించారు. ఎంటిఆర్ ఫుడ్స్ గా పాపులర్ అయింది. ఓర్కాలా విదేశీ కంపెనీ 80 మిలియన్లు అంటే 354 . 08 కోట్లకు కొనుగోలు చేసింది. జేపీ మోర్గాన్ 40 శాతానికి తీసుకుంది. ఇందులో ఎంటిఆర్ కు 40 శాతం వాటా దక్కనుంది. 2018లో 900 కోట్ల టర్నోవర్ సాధిస్తే 2019లో 1000 కోట్లకు చేరుకోబోతోందని ఎంటిఆర్ ఫుడ్స్ కంపెనీ సిఇఓ సంజయ్ శర్మ వెల్లడించారు. మొత్తం మీద ఎంటిఆర్ సాధించిన ఈ విజయం ఎందరికో స్ఫూర్తి కలిగిస్తుందనడంలో సందేహం లేదు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి