డాలర్లు కొల్లగొడుతున్న ఐడియాలు - స్టార్టప్‌ లలో మనమే టాప్

కలలు సాకారమవుతున్నాయి . అసాధ్యమనుకున్నవన్నీ సాధ్యమవుతున్నాయి . టెక్నాలజీ తెచ్చిన మార్పులు ..ప్రపంచీకరణ పుణ్యమా అంటూ లోకమంతటా లెక్కలేనన్ని అవకాశాలు లభిస్తున్నాయి . ప్రపంచ వ్యాప్తంగా ప్రారంభ మైన స్టార్టప్‌ లలో ఇండియా రెండో స్థానంలో నిలిచింది . ఇదో రికార్డ్ గా భావించాలి . ప్రతి ఒక్కరికి కలలు వస్తూనే ఉంటాయి ఎడతెరిపి లేకుండా . వీటిని సాకారం చేసుకోవాలంటే ..అవి ఆచరణ లోకి రావాలంటే ..ఓ ప్లాన్ ఉండాలి . ఎలా సమాజానికి అప్ప్లై చేయాలో తెలుసు కోవాలి . స్టార్ట్ చేస్తేనే సక్సెస్ వస్తుందనుకుంటే పప్పులో కాలు వేసినట్టే . దీనికి సాధన చేయాలి . మెంటార్స్ ను సంప్రదించాలి . అది ఎంత మేరకు వర్కవుట్ అవుతుందో తెలియ చెప్పాలి . ఐడియాకు ప్రాణం పోయాలంటే మార్కెట్ ను స్టడీ చేయాలి . ఇవ్వాళ ప్రపంచ మార్కెట్ ను శాశిస్తున్న అన్ని సామాజిక మాధ్యమాలన్ని ఒకప్పుడు చిన్న గదుల్లో రూపు దిద్దుకున్నవే. ఈ మధ్య భారత్ ఇలాంటి క్రియేటివిటీ కలిగిన కుర్రాళ్ళు ..అమ్మాయిలు దుమ్ము రేపుతున్నారు .

వీళ్ళు మరొకరి కింద పని చేసేందుకు ఒప్పుకోవడం లేదు . ఏదైనా సరే ..ఎంత కష్టం వచ్చినా సరే ఒంటరిగానే స్టార్ట్ అప్ ప్రారంభించేందుకే మొగ్గు చూపిస్తున్నారు . ఇందు కోసం భారత సర్కార్ మేక్ ఇన్ ఇండియా ..పేరుతో వినూత్నమైన కార్యక్రమాన్ని స్టార్ట్ చేసింది . ఇక తెలంగాణా ప్రభుత్వం ప్రత్యేకంగా టీ హబ్ ను ఏర్పాటు చేసింది . ఆయా రంగాలలో సక్సెస్ అయిన వాళ్ళతో అనుసంధానం చేస్తోంది . ఎవ్వరైనా సరే అది సమాజానికి ఉపయోగ పడితే చాలు .. ఆఫీస్ తో పాటు స్థలం కూడా ఇస్తున్నారు . అంతే కాకుండా ట్రైనింగ్ ..మెంటార్ షిప్ .. వసతుల కల్పన.. పెట్టుబడి ప్రోత్సాహం కూడ అందజేస్తోంది . దీంతో మెరికల్లాంటి యువత స్టార్ట్ అప్ లను స్టార్ట్ చేస్తున్నారు . ఇందులో కొన్ని ఫెయిల్ అయితే ఇంకొన్ని సక్సెస్ ఫుల్ గా నడుస్తున్నాయి . దేశంలో ఇప్పడు వీటిని ఎక్కువగా రూపొందిస్తున్నది అన్ని నగరాలకంటే హైదరాబాద్ ముందంజలో ఉంటోంది .

టెక్నాలజీ ..లాజిస్టిక్ ..ఆటో మొబైల్స్ ..ట్రావెల్ ..టూరిజం ..లాంటి వాటి ఆధారంగా వీటిని ప్లాం చేస్తున్నారు . అందరికంటే భిన్నంగా ఆలోచించగలిగితే చాలు ..ఎవ్వరి సహకారం ఉండాల్సిన పని లేదు . రుణాలు విరివిగా ఇచ్చేలా బ్యాంక్ లు ముందుకు వస్తున్నాయి . కొత్త ఆవిష్కరణలు చేసేందుకు యువత ముందుకు రావాలని దేశం కోరుతోంది . అలాంటి ఆలోచనల్లో రూపు దిద్దుకుని కోట్లు కొల్లగొట్టిన కంపెనీల్లో ఓలా..ఉబెర్ ..హలో కర్రీ . ఓయో . జొమాటో ..అభి బస్..ఇలాంటివి ఎన్నో . నీకైనా లేదా పది మందికైనా ఉపాధి చూపించ గలగాలి . అప్పుడే నీ ఐడియా వర్కవుట్ అయినట్టు . లేకపోతే ఫెయిల్ అయినట్టు . మనం రోజూ ఎన్నో చూస్తూ ఉంటాం . ఒక్కోసారి ఎవ్వరికీ రాని ఆలోచనలు మనకు వస్తాయి . అప్పుడే వాటిలో కొన్నిటిని ఎంపిక చేసుకోవాలి . మార్కెట్ లో అలాంటివి సాధ్యం అవుతాయో లేదో జాగ్రత్తగా గమనించాలి . వనరులు పొంగి చేసు కోవాలి . మన ఐడియా బాగుంది అనుకుంటే మార్కెట్ లో కోట్లు పెట్టేందుకు ఎందరో రెడీగా ఉన్నారు . కావాల్సిందల్లా మీ మీద మీకు నమ్మకం .

ఇటీవలి కాలంలో స్టార్టప్‌ల కార్యకలాపాలు ఎక్కువ అయ్యాయి. దాదాపుగా అన్ని రంగాల్లో స్టార్టప్‌ సేవలు విస్తరించాయి. రతన్‌ టాటా వంటి ప్రముఖులు సైతం స్టార్టప్‌ బిజినెస్‌లో పెట్టుబడులు పెట్టడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. దీన్ని బట్టి ఆధునిక వ్యాపార రంగంలో స్టార్టప్‌లు ఎంత ప్రాచుర్యం పొందాయో అవగాహన చేసుకోవవచ్చు.మన అవసరాలు, జీవితానుభవాలు, చుట్టూ జరుగుతున్న సంఘటనలు, చుట్టూ ఉన్న మనుషులు. ఇవే ఆలోచనలకు ప్రేరణగా నిలుస్తాయి. వీటిలో ఏదైనా ఒక అంశాన్ని గుర్తించి దాన్ని సాల్వ్‌ చేయడానికి మనం చేసే ప్రయత్నమే స్టార్టప్‌ ఏర్పాటుకు దారీ తీస్తుంది. సో ఇంకేదనుకు ఆలస్యం చేయడం ..మీకూ ఓ ఆలోచన ఉంటే మీరూ ట్రై చేయండి .వ్యాపారవేత్తలుగా మారండి .

కామెంట్‌లు