పిట్ట కొంచెం కూత ఘనం - వారెవ్వా ట్విట్టర్
చిట్టి సందేశాలను క్షణాల్లో అందించే సామాజిక మాధ్యమాలలో ట్విట్టర్ టాప్ పొజిషన్ లో ఉంది . పిట్ట చిన్నదైనా కూత ఘనంగా వినిపిస్తోంది . కోట్లాది మంది ఇందులో భాగమై పోయారు . కోట్లాది రూపాయల వ్యాపారం జరుగుతోంది . పాలకులు ..వ్యాపారులు ..సెలబ్రెటీలు ..ఆటగాళ్లు ..టెక్కీలు ..ఇలా ప్రతి ఒక్కరు ట్విట్టర్ లో ట్వీట్స్ పెడుతూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు . ఇంతలా తక్కువ సమయంలో జనాదరణ పొందింది . అమెరికాకు చెందిన కంప్యూటర్ ప్రోగ్రామర్ , ఇంటర్నెట్ ఆంట్రప్రెన్యూర్ గా ఉన్న జాక్ డార్సీ కో ఫౌండర్ గా సీయీవోగా ట్విట్టర్ సంస్థకు ఉన్నారు .
అంతే కాకుండా మొబైల్ పేమెంట్స్ కంపెనీ అయిన స్క్వేర్ ను స్థాపించారు . డోర్సీ సెయింట్ లూయిస్ లో 1976 లో పుట్టారు . యెవ్వాన కాలంలో మోడల్ గా పని చేశారు . 14 ఏళ్ళ వయసులో డిస్పాచింగ్ సెక్షన్ లో పని చేశారు . న్యూ యార్క్ యూనివర్సిటీ లో చదివారు . అదే సమయంలో ఒక పరీక్ష తప్పారు . ఈ కొద్దీ కాలంలో ఆయన మెదడులో పుట్టిందే అది ట్విట్టర్ . ప్రోగ్రామర్ గా పని చేసుకుంటూనే దీనిని డెవలప్ చేశాడు . 2000 లో పని చేస్తున్న కాలంలో ఏఓఎల్ ఇన్ స్టెంట్ మెసెంజర్ ఆకట్టుకుంది . డార్సీ ..బిజ్ స్టోన్ కలిసి మొదటి సారిగా టెక్స్ట్ మెస్సేజ్ సెండ్ చేయడం లో సక్సెస్ అయ్యారు .
ఏవం విలియమ్స్ ఈ ఐడియా నచ్చి కొంత ఇన్వెస్ట్ చేశారు . విలియమ్స్ , స్టోన్ , గ్లాస్ కో ఫౌండర్స్ గా ఆబివియస్ కార్పొరేషన్ తో పాటు ట్విట్టర్ కు ప్రాణం పోశారు . డార్సీ సీయీవోగా ట్విట్టర్ స్టార్ట్ అయ్యింది . 2008 లో మరింత పాపులర్ గా మారింది . ఇంటర్నెట్ లో అత్యంత జనాదరణ పొందింది . కోట్లాది డబ్బులు ప్రకటలు రూపేణా అందుతున్నాయి . దీనిని ఢీకొట్టేందుకు ఎన్నో వచ్చాయి . కానీ ట్విట్టర్ తనకు పోటీ అంటూ లేకుండా చేసుకుంటోంది . కోట్లాది మంది ట్విట్టర్లో భాగమవుతున్నారు . సమస్యలపై ..సంధిస్తున్నారు . మెరుగైన ప్రపంచం కోసం ట్విట్టర్ వేదికగా మారుతోంది . మంచిదే కదూ..
ఎంత ఎత్తులో ఉన్నా ఈ సీయివో మాత్రం వెరీ వెరీ సింపుల్ . అడుగుల్లో ..మాటల్లో ..చేతల్లో ఏదో గమ్మత్తు దాగి ఉంటుంది . డార్సీ కళ్ళు మాట్లాడతాయి . అంతగా ఆయన ఈ ప్రపంచాన్ని చదివారు . అందుకే ప్రతి మనిషికి ఏదో చెప్పాలన్న కోరిక . తపన అధికంగా ఉంటుంది . ఒకప్పుడు సమాచారం పావురాల ద్వారా చేరేది . ఇప్పుడు ఆ సిస్టం మారి పోయింది . కేవలం నిమిషాల లోపే లోకానికి చేరి పోతోంది . ఓ వైపు వాట్స్ అప్ ఇంకో వైపు ట్విట్టర్ పోటా పోటీగా బరిలో ఉన్నాయి . దేనికదే సాటి . ఇంకో దానితో పోల్చలేం . ఒక్కరా ఇద్దరా కోట్లాది జనం ఇందులో లీనమై ..జీవితాన్ని మరింత సుందరమయం చేసుకుంటున్నారు . ఇందులో చేరడం అంటే గొప్ప కాదు ..అదో సామాజిక హోదాకు కొండ గుర్తు .డాలర్ల పంట పండుతోంది . డార్సీకి లెక్కించ లేనంతగా సంపద ..ఆదాయం సమకూరుతోంది .
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి