బుట్టబొమ్మ..ముద్దు గుమ్మ

మాటల మాంత్రికుడు, డైనమిక్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్..రైజింగ్ స్టార్ అల్లు అర్జున్..అందాల ముద్దుగుమ్మ పూజా హెగ్డే తో తీస్తున్న సినిమా షూటింగ్ పూర్తి కావొచ్చింది. ఇప్పటికే సినిమాకు సంబంధించి పోస్టర్స్, ట్రైలర్స్ విడుదల చేశింది చిత్ర యూనిట్. ఇక మూవీకి చెందిన పాటలు యూట్యూబ్ లో సెన్సేషనల్ క్రియేట్ చేశాయి. తాజాగా రామజోగయ్య శాస్త్రి రాసిన బుట్టబొమ్మ పాటను లక్షలాది మంది వీక్షించారు. ఈ పాట కూడా రికార్డ్ క్రియేట్ చేసే దిశగా సాగుతోంది. ఇదిలా ఉండగా ఇప్పటికే టాలీవుడ్ లో టాప్ రేంజ్ లో కొనసాగుతోంది హీరోయిన్ పూజా హెగ్డే. వరుస సక్సెస్ లతో దూసుకుపోతూ ప్రస్తుతం క్రేజీ హీరోయిన్‌గా మారి పోయారు ఈ ముద్దుగుమ్మ. అల..వైకుంఠపురములో చిత్రంలో ఈ బుట్టబొమ్మ ప్రత్యేక ఆకర్షణగా ఉండేలా డైరెక్టర్ తీర్చి దిద్దినట్లు సమాచారం. తాజాగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్స్ పనులు జరుపుకుంటోంది. అయితే బుట్టబొమ్మ సాంగ్‌తో పూజా హెగ్డే షూటింగ్‌కు ప్యాకప్ చెప్పేసింది. అయితే ఈ పాట షూట్‌కు సంబంధించిన ఓ వీడియోను పోస్ట్ చేస్తూ ఇది ఎవరికీ చెప్పకండి అంటూ సరదాగా కామెంట్ చేసింది. ప్రస్తుతం ఈ వీ...