బీజేపీపై కాంగ్రెస్ ఫైర్ - పౌర సమాజానికి పూర్తి మద్దతు

ప్రజల ప్రాథమిక హక్కులకు భంగం కలిగించే రీతిలో కేంద్రంలో కొలువుతీరిన బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని జాతీయ కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో మండిపడింది. ప్రజాభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండానే ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ ఇబ్బందులకు గురిచేస్తోందంటూ ధ్వజమెత్తింది. పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌరుల జాబితా పేరుతో దేశ ప్రజల మధ్య మరింత విద్వేషాలు పెంచేలా చేస్తోందంటూ ఆరోపించింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా మెజారిటీ జనమంతా కుల, మతాలకు అతీతంగా బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నారని స్పష్టం చేసింది. తాజాగా బీజేపీ ఈ రెండింటినీ ఫోకస్ చేస్తూ ఎన్నికల ప్రచారం చేసినా, అధికారం కోల్పోయిందన్న విషయాన్నీ గుర్తించాలని హెచ్చరించింది.

ప్రతి చోటా నిరసనలు, ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. విద్యార్థులు, యువతీ యువకులు, ప్రజలతో పాటు రాజకీయ పక్షాలు, ప్రజాస్వామిక వాదులు, మేధావులు, ప్రజా సంఘాలు ముక్తకంఠంతో ఖండిస్తున్నాయి. ఇప్పటికే దేశ ఆర్థిక వ్యవస్థ గాడి తప్పింది. పాలన కూడా. దేశంలోని ప్రజలను మభ్య పెట్టేందుకే పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌరుల జాబితాలను తెరపైకి తీసుకు వచ్చిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. నిరుద్యోగిత పెరిగి పోయింది. పేదలు, సామాన్యులు బతికే పరిస్థితులు లేవు. వ్యాపార, వాణిజ్య రంగాలతో పాటు ప్రభుత్వ బ్యాంకులు పూర్తిగా కోలుకోలేని స్థితికి చేరుకున్నాయి. భారత రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగించే పొరసత్వ సవరణ చట్టాన్ని కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తోంది. జాతీయ పౌరుల జాబితా పేరుతో ఇప్పటి దాకా కలిసి మెలిసి ఉన్న ప్రజల మధ్య తిరిగి పొరపొచ్చాలు వచ్చేలా చేస్తోంది బీజేపీ. అందుకే పార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.

ఉప ఖండంలో తమ పార్టీ శాంతిని కోరుతోంది. దేశంలో తక్కువ జనాభా కలిగిన అల్పసంఖ్యాక వర్గాలకు కూడా బతికే హక్కు ఉందని పార్టీ నమ్ముతుంది. ఇక్కడ ప్రతి ఒక్కరికి బతికే అవకాశాన్ని రాజ్యాంగం కల్పించింది. దానినే మేం నమ్ముతున్నాం. ప్రతి సున్నితమైన అంశాలను సమస్యలుగా మార్చేందుకు బీజేపీ ప్రయత్నం చేస్తోంది. దీని ద్వారా బీజేపీ రాజకీయ లబ్ది పొందాలని చూస్తోంది. శాంతియుతంగా ఆందోళనలు చేపడుతున్న వారిని టార్గెట్ చేస్తోంది. ప్రధానంగా విద్యార్థులు, పౌర సమాజపు సంస్థలు, సంఘాలను ఇబ్బందులకు గురి చేస్తోంది. ఇప్పటికే పలువురు ఆందోళనల్లో మృతి చెందారు. అయినా కేంద్ర సర్కార్ పట్టించు కోవడం లేదు. పౌర సమాజం ఒక వైపు ఉన్నది. బీజేపీ మాత్రం ఏకాకిగా మిగిలి పోయింది. ఆ విషయం జార్ఖండ్ ఎన్నికల్లో ప్రజా తీర్పుతో స్పష్టమైంది.

దేశ మంతటా ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి. విద్యా పరంగా యూనివర్సిటీలు, ఐఐటీలు, ఎన్ ఐటీలు , ఐఐఎం లు, విద్య సంస్థలు నిరసనలతో అట్టుడుకుతున్నాయి. ప్రజా వ్యతిరేక విధానాలను బలవంతంగా బీజేపీ అమలు చేయాలనీ చూస్తోంది. దేశం అస్తవ్యస్తంగా మారి పోవడంతో అది దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది. బీజేపీ తన పరిపాలనా వైఫల్యాలను కప్పిపుచ్చు కోవాలని ఇలాంటి లేని పోనీ ఇస్స్యూస్ ను పైకి తీసుకు వస్తోందని ఆరోపించింది. గత 45 ఏళ్ళల్లో ఎన్నడూ లేని రీతిలో నిరుద్యోగం పెరిగి పోయింది. ఇక దేశ ఆర్థికాభివృద్ధిలో కీలక పాత్ర పోషించే గ్రామీణ అభివృద్ధి గత 40 ఏళ్లలో పూర్తిగా వెనక్కి వెళ్ళింది. ప్రజాస్వామ్య దేశంలో ప్రశ్నించే హక్కు ప్రజలకు ఉంటుంది. ప్రభుత్వం తీసుకునే తప్పుడు నిర్ణయాలను నిలదీయడం సహజం.

అందులో భాగంగానే ప్రస్తుతం దేశంలో ఆందోళనలు, నిరసనలు కొనసాగుతున్నాయి. దీనిని బీజేపీ గుర్తించడం లేదు. ప్రజల గొంతును నొక్కేయాలను అనుకుంటోంది. కేసులతో, బల ప్రయోగం చేయాలనీ చూస్తోంది. అంతిమంగా బీజేపీ తన నిర్ణయాలను వెనక్కి తీసుకునేంత దాకా ప్రజలు, పౌర సమాజం, స్టూడెంట్స్ చేస్తున్న ఆందోళనకు కాంగ్రెస్  మద్దతు తెలుపుతుంది. కుల, మతాల పేరుతో జనాన్ని విడదీయాలని చూసే కుట్రలను, ప్రయత్నాలను పార్టీ ఒప్పుకోదు. ప్రజల భావోద్వేగాలతో బీజేపీ ఆటాడుకుంటోందని, ఇక ఆ పార్టీ ఆటలు సాగబోవని స్పష్టం చేసింది. ప్రతి ఒక్కరికి నిరసన తెలిపే హక్కున్నా, శాంతియుతంగా సాగాలన్నదే పార్టీ కోరుతోంది. పౌరసత్వ సవరణ చట్టంలో మార్పులను జాతి యావత్తు ఒప్పు కోవడం లేదు. జాతీయ పౌరుల జాబితా పేరుతో ప్రజల మధ్య మరింత అంతరాలు పెరుగుతాయి. పేదలు, ఇతర వర్గాలు భయబ్రాంతులకు లోనవుతున్నారు. వారికీ భరోసా ఇస్తోంది తమ పార్టీ.

ప్రాథమిక హక్కుల పరిరక్షణకు పార్టీ కట్టుబడి ఉంది. రాజ్యాంగ స్ఫూర్తికి భంగం కలిగించేలా, తన హిందుత్వ ఎజెండాను అమలు చేసేందుకే బీజేపీ యత్నిస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది. రెండు కోట్ల మంది యువతకు ఉపాధి కల్పిస్తామన్న బీజేపీ అమలులో పూర్తిగా విఫలమైంది. సామాజిక, ఆర్థిక రంగాలు కుదేలయ్యాయి. నిరుద్యోగిత రేటు పెరిగింది. ఆర్థిక వృద్ధి రేటు 4.5 శాతానికి పడి పోయింది. దాదాపు 75 శాతానికి పైగా ప్రజలకు సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు అందడం లేదు. గ్రామీణ భారతం ఇబ్బందుల్లో కొట్టు మిట్టాడుతోంది. 1970 నుంచి ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు దేశం తిరోగమనం వైపు కొనసాగుతోంది. ఉత్పాదక రంగం వివక్షకు లోనైంది. వెనుకబాటుకు గురైంది. న్యాయం ముందు అందరూ సమానులే అని రాజ్యాంగం లోని ఆర్టికల్ 14 చెబుతోంది. బీజేపీ ప్రభుత్వంలో విభజించు పాలించు ప్లాన్ అమలవుతోంది. జాతి, కులం, మతం, పుట్టిన స్థలం కాదు. ఇక్కడ జన్మించిన వారంతా ఇక్కడి వారే.

దేశం రాజ్యాంగానికి లోబడి ఉంటుంది. పాలన అందులో భాగంగానే కొనసాగుతుంది. హిందుత్వ ఎజెండాను అమలు చేయాలనుకుంటే కుదరదు. ప్రతి ఒక్కరు సమానులే. అందరికీ సమన అవకాశాలు, హక్కులు ఉంటాయి. 2011 కంటే ముందు పాకిస్తాన్, బాంగ్లాదేశ్, ఆఫ్గనిస్తాన్ దేశాలకు చెందిన వారు 1084 మంది భారతీయ పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నారు. 30 వేల మందికి పైగా సిటిజన్షిప్ కోసం వేచి చూస్తున్నారు. వీరి గురించి భారతీయులు అభ్యంతరం చెప్పలేదు. 95 వేల మంది శ్రీలంక పౌరులు తమిళనాడులో తలదాచుకున్నారు. 1964 - 1974 లో అంతర్జాతీయ ఒప్పందం మేరకు 1964 - 2008 లో 4.61 భారతీయ సంతతికి చెందిన తమిళులకు ఇక్కడి సిటిజన్షిప్ ఇవ్వడం జరిగింది.

1962-78 మధ్యకాలంలో భారతీయ సంతతికి చెందిన రెండు లక్షలకు పైగా బర్మా నుండి పారి పోయారు. వ్యాపారాలు అక్కడ జాతీయం చేయ బడ్డాయి. బలవంతంగా లాక్కున్నారు. 2016 లో, హోం మంత్రిత్వ శాఖ ఏడు రాష్ట్రాల్లోని 16 జిల్లా కలెక్టర్లకు అధికారాలను అప్పగించింది. భారతదేశంలో నివసిస్తున్న పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ,బంగ్లాదేశ్ నుండి వచ్చిన ముస్లిమేతరులకు పౌరసత్వం ఇవ్వమని సూచించింది. ఈ మొత్తం ప్రక్రియను నమోదు చేసేందుకు 2018 లో నోటిఫికేషన్ జారీ చేసింది. ఇది ఇప్పటికే పూర్తయ్యింది. మతం పేరుతో దేశాన్ని విభజించాలనే ఉద్దేశం తోనే బీజేపీ పౌరసత్వ సవరణ చట్టాన్ని తీసుకు వచ్చింది. దీనిని కాంగ్రెస్ పార్టీ నిర్ద్వందంగా అడ్డుకుని తీరుతుంది. దీంతో ఈ సమయంలో ఇతర దేశాల నుంచి సిటిజన్స్ ఇండియాకు ఎలా వస్తారు. జాతీయ పౌరుల జాబితాపై బీజేపీకి క్లారిటీ లేదు.

ఈ రెండింటి మధ్యన సంబంధం లేదని చెప్పిన హోమ్ మంత్రి మాటలు సత్య దూరంగా ఉన్నాయి. బీజేపీ తన ఎన్నికల మేనిఫెస్టో లో ఎన్ ఆర్ సి గురించి ఉందని చెప్పారు. ఇది ప్రజాస్వామ్యానికి పూర్తిగా విరుద్ధం. భారతీయుడిగా నిరూపించు కోవాలంటే ఏం చేయాలో ప్రభుత్వమే చెప్పాలి. అంటే అర్థం కేవలం హిందువుగా ఉండాలా. అలా అని నిరూపుంచు కోవాలా. దీనికి ఏ పత్రాలు  సరి పోతాయి. పేదలు, సామాన్యులు, నిరాశ్రయులైన వాళ్ళు తాము భారతీయులమని ఎలా నిరూపించుకుంటారు. పొరసత్వం నిరూపించు కోలేని వాళ్ళను ఈ ప్రభుత్వం ఏం చేయబోతోంది. నిర్బంధ శిబిరాల్లో బందీగా చేస్తారా. ఇందు కోసమేనా మీకు అధికారాన్ని అప్పగించింది.

ప్రభుత్వం తన రాజకీయ ఎజెండాను జాతీయ ప్రయోజనాల ముందు పదే పదే పెట్టింది. యూపీలో మత సంఘటనలు జరిగాయి. 2014 లో 133 నుండి 2017 లో 195 కి అంటే 47 శాతం పెరిగాయి. 2019 లోక్ సభ ఎన్నికలలో బిజెపి గెలిచినప్పటి నుండి పరిస్థితి ఆందోళనకరంగా మారింది. పార్టీ ఇప్పుడు జాతీయ ఏకాభిప్రాయం సాధించడానికి కూడా ప్రయత్నించడం లేదు. బిజెపి ఎజెండా జాతీయ ఐక్యతను నాశనం చేస్తోంది. అందుకే బీజేపీ కుట్రలను, హిందుత్వ ఎజెండా అమలును కాంగ్రెస్ బట్ట బయలు చేస్తోంది. ఇందు కోసం ప్రజలు, పార్టీలు ముందుకు రావాల్సిన అవసరం ఉన్నది. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!