పోస్ట్‌లు

అక్టోబర్, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

 అంతటా ఆధారమే..లేదంటే భారమే

చిత్రం
కేంద్రంలో బిజెపి కొలువు తీరాకా ప్రజలకు కష్టాలు మొదలయ్యాయి. ప్రతి పనికి ఆధార్ కార్డును తప్పనిసరి చేశారు. అది లేకుంటే బతకలేమనే స్థితికి తీసుకు వచ్చారు మోడీ అండ్ అమిత్ చంద్ర షా. దీంతో బ్యాంకులు, పోస్ట్ ఆఫీసులు ఆధార్ నమోదును తమ భుజానికి ఎత్తుకున్నాయి. ఇదో ప్రహసనంగా మారింది. తాజాగా 30 మంది లేదా అంతకంటే ఎక్కువగా ఉన్నా సరే ఆధార్ కోసం వెయిట్ చేస్తే, ఈ విషయాన్ని పోస్టల్ అధికారులకు తెలియ పరిస్తే నేరుగా సిబ్బందిని మన ఇళ్ల వద్దకే పంపిస్తారు. ఇదో వినూత్న ప్రయత్నం. పోస్టల్ శాఖ ఇతర శాఖలతో పోటీ పడుతోంది. సరికొత్త సేవలతో ముందుకు వస్తోంది. ఉత్తరాలు, పోస్టు కార్డులు చేర వేస్తూ ప్రజలకు సేవలందిస్తున్న తపాలా శాఖ ఆధార్‌ సేవలూ అందిస్తోంది. ఆధార్‌ నమోదు, చేర్పులు, మార్పుల సేవలు అవసరమున్నట్లు సమాచారం అందిస్తే చాలు..డోర్‌ వద్దకు వచ్చి సేవలందించనుంది. రెండున్నరేళ్ల క్రితమే జాతీయ స్థాయిలో భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ తో ఒప్పందం కుదుర్చుకున్న పోస్టల్‌ శాఖ ఆధార్‌ అధీకృత కేంద్రాలను ఏర్పాటు చేసి సేవలు అందిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో సహా ప్రైవేటు సంస్థలూ తమ సేవలను ఆధార్‌తో అ...

ఉద్యోగుల్లో ఆనందం..జగన్ కు నీరాజనం

చిత్రం
తెలంగాణలో కంటే ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు ఆనంద డోలికల్లో మునిగి తేలుతున్నారు. భారీ మెజార్టీని కట్ట బెట్టిన ఆరాష్ట్ర జనానికి అడిగినవన్నీ చేసి పెడుతున్నారు ముఖ్యమంత్రి సందింటి జగన్ మోహన్ రెడ్డి. ఇప్పటికే ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసే పనిలో పడ్డారు. అంతే కాకుండా పాలనా పరమైన సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. రాష్ట్ర అభివృద్ధికి పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అంతే కాకుండా పాలనలో పారదర్శకత, అధికారుల్లో జవాబుదారీ తనం పెంచేలా చర్యలు చేపట్టారు. దీంతో పాటు ప్రజలు తమకు ఏవైనా ఇబ్బందులు ఉన్నా, సమస్యలు తలెత్తినా లేదా పరిష్కారం కాకా పోయినా వెంటనే తనకు నేరుగా ఫోన్ చేసే సౌకర్యాన్ని కల్పించారు. మరో వైపు తన తండ్రి ప్రవేశ పెట్టిన ప్రజా దర్బార్ ను ఏర్పాటు చేశారు జగన్. దీంతో అవినీతి అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యే దౌర్జన్యం చేస్తే వెంటనే కేసు నమోదు చేయమని ఆదేశించారు జగన్ మోహన్ రెడ్డి. దీంతో అటు నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రుల్లో దడ మొదలైంది. ఆయా శాఖలపై పట్టు బిగించిన సీఎం ..ప్రజా ప్రతినిధులను, ఉన్నతాధికారులను పరుగులు పెట్టిస్తున్నారు. ఎప్పటికప్పుడు స...

కార్మికుల వేదన..చిన జీయర్ దీవెన

చిత్రం
ఆయన జగమెరిగిన జగత్ గురువు. లక్షలాది మంది భక్తులను కలిగిన ఆధ్యాత్మిక వేత్త. ఆధునిక యుగంలో భక్తిని, శాంతిని ప్రవచిస్తూ సాగి పోతున్న యోగి. ఆయనను పామరులు, పండితులు కొలుస్తారు. కలియుగంలో చినజీయర్ స్వామీజీని ఇష్ట దైవంగా భావిస్తారు. ఆయన భక్తుల జాబితాలోకి తాజగా తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, యెడ్యూరప్ప, సందింటి జగన్ మోహన్ రెడ్డిలు కూడా చేరి పోయారు. ఇది కూడా ఓ సంచలనమే. కాగా గత 28 రోజులుగా తమ డిమాండ్లు పరిష్కారించాలని కోరుతూ తెలంగాణ ఆర్టీసీ కార్మికులు ఆందోళన చేస్తున్నారు. రాష్ట్ర హైకోర్టు చీవాట్లు పెట్టినా సీఎం పట్టించు కోవడం లేదు. ఇప్పటికే ఎలాంటి ప్రోగ్రెస్ కనిపించక పోవడంతో 16 మంది తట్టు కోలేక అసువులు బాసారు. అయినా సీఎం డోంట్ కేర్ అంటున్నారు. 49 వేల మంది సెల్ఫ్ డిస్మిస్ అయ్యారంటూ స్పష్టం చేశారు. కార్మికులు ఎన్ని రోజులు సమ్మె చేస్తారో చూస్తా, చర్చలు మాత్రం జరిపే ప్రసక్తి లేదన్నారు. ఇప్పటికే బస్సులు రాక లక్షలాది మంది ప్రజలు లబోదిబోమంటున్నారు. పలు ప్రమాదాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. సమ్మె వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని, తక్షణమే సమస్యను పరిష్కారించేలా ఆ...

బిగ్ ఛాన్స్ కొట్టేసిన భవానిశ్రీ

చిత్రం
ఎవరీ భవానిశ్రీ అనుకుంటున్నారా. ఇప్పుడు తమిళ్ సినీ రంగంలో సెన్సేషన్ సృష్టిస్తున్న నటి. పిన్న వయస్సులోనే టాప్ రేంజ్ లోకి వెళ్లేందుకు ఈ అమ్మడు రెడీ అవుతోంది. 25 ఏళ్ల వయసులోనే 25 చిత్రాలకు సంగీతాన్ని అందించి రికార్డు కెక్కిన సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్‌ కుమార్‌కు స్వయానా సోదరి. మ్యూజిక్ డైరెక్టర్ గా బిజీగా ఉంటూనే హీరోగా కూడా సక్సెస్ ఫుల్ గా రాణిస్తున్నాడు జీవి. ప్రస్తుతం అర డజనుకు పైగా చిత్రాల్లో నటిస్తున్నాడు. ఏ.ఆర్‌.రెహ్మాన్‌ మేనల్లుడు కూడా. అంతే కాదు జీవీ భార్య సైతం సైంధవి యువ గాయకురాలు. సో..వీరి ఇంట అందరూ ప్రతిభావంతులే. తాజాగా చెల్లెలు భవాని శ్రీ కూడా రంగ ప్రవేశం చేస్తోంది. ఈమె ఇప్పటికే రణసింగం అనే చిత్రంలో నటించడానికి ఎంపికయ్యారు. విజయ్‌ సేతుపతి, ఐశ్వర్య రాజేశ్‌ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో భవానీశ్రీ రెండవ హీరోయిన్‌గా నటిస్తున్నారు. నవ దర్శకుడు విరుమాండి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం నిర్మాణంలో ఉంది. కాగా తొలి చిత్రం తెరపైకి రాక ముందే భవానీశ్రీ మరో రెండు సూపర్‌ అవకాశాలు తలుపు తట్టాయన్నది తాజా న్యూస్‌. ఈ చిన్న దానికి ధనుష్‌కు జంటగా నటించే అవకాశంతో పాటు, మరో డైరెక్టర్ సుధ కొంగర చిత్రంల...

ధిక్కార స్వరం..వెంటాడుతున్న వివాదం

చిత్రం
 ఈ దేశంలో ప్రశ్నించడం అన్నది నేరంగా మారింది. మతం పేరుతో..కులం పేరుతో ప్రజలను మభ్య పెడుతున్నారు. స్వేచ్ఛగా నాలోని ఆలోచనలను, భావాలను, అభిప్రాయాలను వ్యక్తీకరించేందుకు భారత రాజ్యాంగం నాకు సర్వ హక్కులు కల్పించింది. నిలదీస్తే చంపేస్తారా. నిన్న గౌరీ లంకేశ్ ను చంపారు. రేపు నన్నూ చంపొచ్చు. అంటూ తన ధిక్కార స్వరాన్ని వినిపించిన ఆ ఒకే ఒక్క గొంతు ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ ది. మిగతా నటీనటులు డబ్బులు ఎలా వెనకేసు కోవాలో అని ప్రయత్నాలు చేస్తుంటే ప్రకాష్ మాత్రం స్వేచ్ఛ, న్యాయం కోసం పోరాటం చేస్తున్నారు. సమాజం కోసం సమస్యలపై నిలదీస్తున్నారు. ఇవ్వాళ ప్రశ్నించక పోతే రేపు బతకడం మరింత కష్టమవుతుందని ఈ నటుడు హెచ్చరిస్తున్నారు. దీంతో ఆయనను వివాదాలు వెంటాడుతున్నాయి. ఏకంగా ప్రకాష్ రాజ్ ను సినిమా రంగం నుండి బహిష్కరించాలనే దాకా వెళ్ళింది. ఈ మేరకు కర్ణాటక చలన చిత్ర వాణిజ్య మండలిలో ఫిర్యాదు నమోదైంది. హిందూ దేవుళ్లు, హిందువుల మనో భావాలు దెబ్బ తినేలా వ్యాఖ్యానించారని, ఆయనకు సినిమాల్లో అవకాశాలు ఇవ్వవద్దని అఖిల భారత హిందూ మహాసభా వేదిక ఫిర్యాదు చేసింది. రామాయణాన్ని అవమానిస్తున్నారని, హిందువుల మనోభావాలు దెబ్బ తినేల...

ఆ ఇద్దరిలో ఒక్కరికే ఛాన్స్

చిత్రం
తెలుగు బుల్లి తెరమీద రియాల్టీ షో సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. కొన్ని గంటల్లో దీనికి శుభం కార్డు పడబోతోంది. టైటిల్‌ గెలవడానికి ఇంటి సభ్యులు చేయాల్సిందంతా చేసేశారు. ఇప్పుడు అంతిమ తీర్పు ప్రజల చేతుల్లో ఉంది. అయితే వారి తీర్పును తమకు అనుకూలంగా మలుచు కునేందుకు హౌస్‌ మేట్స్‌తో పాటు ఇంటి సభ్యుల అభిమానులు తీవ్రంగా కష్ట పడుతున్నారు. వీరికి సపోర్ట్‌ చేస్తూ కొంత మంది సెలబ్రిటీలు సైతం ప్రచారం బాట పట్టారు. శ్రీముఖికి బుల్లితెర యాంకర్‌ రష్మీ మద్దతు తెలుపగా, రాహుల్‌కు పాప్‌ సింగర్‌ నోయెల్‌ ప్రచారం చేస్తున్నాడు. అలీ రెజాకు పటాస్‌ పంచ్‌ల యాంకర్‌ రవి తోడుగా నిలిచాడు. ఈ క్రమంలో గాయని గీతా మాధురి, నటి హరితేజ బిగ్‌బాస్‌ 3పై స్పందించారు. బిగ్‌ బాస్‌ హౌస్‌లో టాప్‌ 5కు చేరుకున్న ఇంటి సభ్యులందరికీ గీతా మాధురి ఆల్‌ ద బెస్ట్‌ తెలిపింది. అయితే శ్రీముఖి, రాహుల్‌ సిప్లిగంజ్‌లతో దిగిన ఫొటోను మాత్రమే పోస్టు చేసింది. కాగా ఇప్పుడు ఎవరికి ఓట్లు వేయాలనే దానిపై ఫ్యాన్స్ తలలు పట్టుకుంటున్నారు. దీంతో గీతా మాధురి ఫ్యాన్స్‌ రెండు టీంలుగా విడిపోయి రాహుల్‌, శ్రీముఖికి మద్దతు తెలుపుతూ ఓట్లు చీల్చుతున్నారు....

అమ్మ ఆరాటం..కొడుకు పోరాటం

చిత్రం
ఆడియన్స్ ను గత కొన్ని రోజులుగా అలరిస్తూ వస్తున్న రియాల్టీ షో బిగ్ బాస్ కొద్దీ గంటల్లో ముగియనుంది. ఫైనల్లో ఎవరు గెలుస్తారో ననే ఉత్కంఠ నెలకొంది. హౌజ్ లో అయిదుగురు పార్టిసిపెంట్స్ మాత్రమే మిగిలారు. వీరిలో రాహుల్ సిప్లిగంజ్ డైరెక్టు గా ఫైనల్ కు వెళ్లగా మిగతా వారు ఆఖరు పోరులో నిలిచేందుకు ప్రయత్నాలు స్టార్ట్ చేశారు. వీరి కోసం వారి వారి ఫ్యాన్స్ ఓ గ్రూప్ గా ఏర్పడి సోషల్ మీడియా వేదికగా తమ వారికి ఓటు వేయమని క్యాంపెయిన్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా సింగర్ రాహుల్ మదర్ కూడా రంగం లోకి దిగింది. ప్రధాన ఫైట్‌ మాత్రం రాహుల్‌, శ్రీముఖి మధ్యలోనే ఉంది. అభిమానులు తమ తమ ఫేవరెట్‌ కంటెస్టెంట్లకే ఓట్లు వేయండి అంటూ ప్రచారంతో  ఊపేస్తున్నారు. ఓవైపు శ్రీముఖి ‘రాములమ్మ కాంటెస్ట్‌’తో ప్రేక్షకులను తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేసింది. అది ప్రేక్షకులపై ఏపాటి ప్రభావం చూపిస్తుందో గ్రాండ్‌ ఫినాలే నాడు తేలనుంది. మరోపైపు రాహుల్‌ సిప్లిగంజ్‌ కోసం ప్రముఖ సింగర్‌ నోయెల్‌ గట్టి ప్రచారం చేస్తున్నారు. నోయల్ కు మద్దతుగా రాహుల్ తల్లి రంగంలోకి దిగింది. ఇంతకు ముందు బిగ్‌బాస్‌ హౌస్‌లోకి వచ్చిన రాహుల్‌ తల్లి ఇంటి సభ్యులతో పాటు ప...

నోట్ల రద్దు..ఇప్పుడు పసిడి వంతు

చిత్రం
నిన్నటి దాకా నోట్ల రద్దుతో జనాన్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేసి బతుకు దెరువు లేకుండా చేసిన మోడీ ఇప్పుడు దేశంలో దాచుకున్న బంగారంపై కన్ను పడింది. బంగారాన్ని భారీగా దాచుకున్న వారి కోసం ప్రభుత్వం త్వరలో ఓ స్కీమును తేనుంది. నల్ల బంగారాన్ని తెల్లగా మార్చు కునేందుకు ఒక అవకాశం కల్పించాలని ఆలోచిస్తోంది. ఈ ప్రత్యేక స్కీము ద్వారా బంగారపు నిల్వలకు చట్ట బద్దత కల్పించాలనేది ప్రభుత్వ టార్గెట్‌‌. ఈ స్కీము రూపకల్పనలో ఇప్పటికే ప్రధాన మంత్రి కార్యాలయం, ఆర్థిక మంత్రిత్వ శాఖల అధికారులు నిమగ్నమై ఉన్నట్లు సమాచారం. దాచు కున్న బంగారాన్ని బయట పెట్టి, దాని విలువ మీద పన్ను చెల్లిస్తే చాలు, ఆ బంగారం తెల్లదిగా మారి పోతుంది. వ్యక్తుల దగ్గర ఎంత పరిమితిలో బంగారం ఉండొచ్చనే అంశం మీద త్వరలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. పరిమితికి మించిన బంగారపు నిల్వలను వెల్లడించి, ఆ విలువకు పన్ను చెల్లిస్తే సరిపోతుందని అధికారులు చెబుతున్నారు. స్కీము కాల పరిమితి ముగిశాక, ఎవరి దగ్గరైనా ఎక్కువ బంగారం ఉన్నట్లు బయట పడితే భారీగా ఫైన్స్‌‌ వేస్తారు. తాజా స్కీము కింద ఎంత పన్ను రేటు ఉంటుందనేది ఇంకా తెలియలేదు. కానీ, స్వచ్ఛందంగా ప్రకటించే స్కీ...

గూగుల్ గుడ్ ఐడియా

చిత్రం
ప్రపంచాన్ని శాసిస్తున్న టెక్ దిగ్గజ కంపెనీ గూగుల్ గుడ్ ఐడియాస్ ఎక్కడ ఉన్నా ఎంకరేజ్ చేస్తుంది. న్యూ ఐడియాస్ ను ప్రోత్సహిస్తుంది. ఇందు కోసం ప్రతిఏటా ప్రపంచ వ్యాప్తంగా పోటీలు నిర్వహిస్తుంది. ఇందులో తమ ఆలోచనలు పంచు కోవచ్చు. అవి సమాజానికి, మానవ సమూహానికి ఉపయోగ పడేలా ఉండాలి. అంతే కాకుండా గూగుల్ సామాజిక బాధ్యత కింద పలు సేవా కార్యక్రమాలు చేపడుతోంది. పర్యావరణం కాపాడు కునేలా జనాన్ని జాగృతం చేసే పనిలో నిమగ్నమైంది. తాజగా గూగుల్ సరికొత్త ఐడియాకు శ్రీకారం చుట్టింది. ఇప్పుడు ప్రపంచాన్ని ఆయుధాలు, అణుబాంబులు కంటే ఎక్కువగా స్మార్ట్ ఫోన్స్, ఇంటర్నెట్ తీవ్ర ప్రభావం చూఫుతున్నాయి. దీంతో లైఫ్ లో ప్రశాంతత కరువవుతోంది. టెక్నాలజీ అందుబాటులోకి వచ్చినా దీని వల్ల మేలు కంటే ఎక్కువగా కీడే జరుగుతోంది. ఇందు కోసం ఓ ఐడియాను ఇంప్లిమెంట్ చేసింది. అదేమిటంటే ఆ ఫోన్​ నుంచి ఫోన్లు చేసుకోలేం. మెసేజ్​లు పంపించుకోలేం. వాట్సాప్​లో చాటింగ్​ చెయ్యలేం. ముచ్చట పడి ఓ సెల్ఫీ తీసుకోలేం. అదే గూగుల్​ తీసుకొస్తున్న కొత్త  పేపర్​ ఫోన్​ .ఆ మధ్య గూగుల్​ పిక్సెల్​ 4 ఫోన్​ను రిలీజ్​ చేసింది. దానిని విడుదల చేసిన కొద్ది రోజులకే ఈ పేపర్​ ...

రియల్ బిగ్ బాస్ ఎవ్వరో

చిత్రం
తెలుగు బుల్లి తెరమీద ఇప్పుడు సీరియల్స్ హవా నడుస్తోంది. అంతకంటే ఎక్కువగా రియాల్టీ షో లు కూడా టీఆర్ఫీ రేటింగ్ లో చోటు దక్కించుకుంటున్నాయి. తాజాగా స్టార్ మా టీవీ బిగ్ బాస్ ప్రారంభించిన కొద్దీ రోజుల్లోనే పాపులర్ షో గా పేరు తెచ్చుకుంది. ఇప్పటికే వంద రోజులు పూర్తయ్యాయి. శివ జ్యోతి ఎలిమినేట్ కావడంతో బాబా భాస్కర్, రాహుల్, శ్రీ ముఖి, వరుణ్, అలీ రెజా మాత్రమే మిగిలారు. బిగ్ బాస్ ఫైనల్ లో అంతిమ విజేత ఎవరో కొన్ని గంటల్లో తేలి పోనుంది. వీరిలో చివరకు టాప్‌‌‌‌‌‌‌‌–3లో నిలిచిన వారి లోంచి ఒకరిని విన్నర్ గా ఎంపిక చేస్తారు. ఫైనల్‌‌‌‌‌‌‌‌ విజేత కోసం ఆడియెన్స్‌‌‌‌‌‌‌‌కు ఓటింగ్‌‌‌‌‌‌‌‌ అందుబాటులో ఉంది. అయిదుగురి లోంచి ఎవరు టైటిల్‌‌‌‌‌‌‌‌ గెలుస్తారని ఆడియెన్స్‌‌‌‌‌‌‌‌ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. హోస్ట్‌‌‌‌‌‌‌‌గా నాగార్జున ఈ షోను సక్సెస్‌‌‌‌‌‌‌‌ ఫుల్‌‌‌‌‌‌‌‌గా నడిపిస్తున్నాడు. కంటెస్టెంట్లు కూడా ఆడియెన్స్‌‌‌‌‌‌‌‌ను బాగానే ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైన్‌‌‌‌‌‌‌‌ చేశారు. మధ్యలో కొన్ని ఎపిసోడ్లు అంతగా ఆకట్టుకోక పోయినా, ఓవరాల్‌‌‌‌‌‌‌‌గా ఆడియెన్స్‌‌‌‌‌‌‌‌ను ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైన్‌‌‌‌‌‌‌‌ చేసింది ఈ షో. క...

ఆదిత్య అదుర్స్..పాలిటిక్స్ చీర్స్

చిత్రం
మరాఠా రాజకీయాల్లో నవ శకం ఆరంభమైంది. మహారాష్ట్ర లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఓ యువ కెరటం రాకెట్ లా దూసుకు వచ్చింది. అతడు ఎవరో కాదు కొన్ని దశాబ్డల పాటు భారత దేశ పాలిటిక్స్ ను శాసించిన మహా నేత బాల థాక్రే మనుమడు ఆదిత్య థాక్రే. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు. శివ సేన చీఫ్ గా తన తండ్రి ఉద్దవ్ థాక్రే ఉండనే ఉన్నాడు. ఏకంగా మనోడు సీఎం పదవి రేసులో నిలిచాడు. ఏ మాత్రం బీజీపీ గనుక ఒప్పుకుని వుంటే అత్యంత పిన్న వయసులో మరాఠాకు దిశా నిర్దేశం చేసే వాడు. శివ సేన యువ సేన చీఫ్ గా ఉన్నాడు. వర్లీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ముంబయిలో హిస్టరీ తో డిగ్రీ చేశాడు. న్యాయ విద్య పూర్తి చేశాడు. 13 జూన్ 1990 లో పుట్టారు. ఆదిత్యకు అన్నీ తాత పోలికలే అబ్బాయి. పుస్తకాలు బాగా చదువుతాడు. అంతే కాకుండా పోయెమ్స్ రాస్తాడు. గేయ రచయిత కూడా. మంచి వక్త. ప్రజలకు ఏది కావాలో ఆదిత్యకు బాగా తెలుసు. తాను రాసిన కవితలతో మై థాట్స్ ఇన్ వైట్ అండ్ బ్లాక్ పేరుతో ఓ పుస్తకాన్ని రాశాడు. ఇది 2007 మార్కెట్ లోకి వచ్చింది. ఇదే సంవత్సరంలో గీత రచయితగా మారాడు ఆదిత్య థాక్రే. ప్రైవేట్ ఆల్బమ్ కూడా రిలీజ్ చేశాడు. ...

కంపెనీల మధ్య పోటీ..కస్టమర్స్ కు భలే గిరాకీ

చిత్రం
టెలికాం కంపెనీల మధ్య నెలకొన్న పోటీ కస్టమర్స్ కు డేటా పరంగా బాగా వర్కవుట్ అయ్యేలా ఉంది. అయితే ఒక్కో కంపెనీ ఒక్కో రోజు బంపర్ ఆఫర్స్ ప్రకటిస్తూ ఎటూ తేల్చుకోకుండా చేసేస్తున్నాయి. ఇప్పటికే ప్రైవేట్ టెలికాం ఆపరేటర్స్ నుండి పోటీ తట్టుకునేందుకు భారత ప్రభుత్వ టెలికాం సంస్థ భారత్ సంచార నిగమ్ లిమిటెడ్ అంటే బిఎస్ఎన్ఎల్ సైతం తన వినియోగదారులకు అపరిమిత కాల్స్, డేటా అదనపు ప్రయోజనాలు కల్పిస్తోంది. దీంతో తాజాగా మరో దెబ్బ కొట్టే పనిలో పడ్డది జియో రిలయన్స్ కంపెనీ. దీంతో ప్రధాన పోటీదారుగా ఉన్న తన ప్రత్యర్థి కంపెనీ నుండి, తన కస్టమర్స్ తరలి పోకుండా ఉండేందుకు ఎయిర్‌టెల్ బంపర్ అఫర్ ప్రకటించింది. ఏకంగా కొత్త ప్లాన్స్ విడుదల చేసింది. 100 ఎంబీపీఎస్ వేగంతో ఎయిర్‌టెల్ నుంచి కొత్త బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ ను లాంచ్ చేసింది. దీనిని వాడుకుంటే బోలెడు ప్రయోజనాలు కలగనున్నాయి. కేవలం 799  రూపాయలతో సరికొత్త బ్రాడ్‌ బ్యాండ్ ప్లాన్‌ను వెల్లడించింది. ‘ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ ఫైబర్’ పేరుతో ఇప్పుడు ఫైబర్ సేవలు అందిస్తున్న ఎయిర్‌టెల్ ఇక నుంచి అన్ని హోం బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లు ఈ గొడుకు కిందికే రానున్నట్టు తెలిపింది. తాజా ప్ల...

దేశమంతటా ఇక విమానాలు

చిత్రం
కేంద్రం లోని బీజేపీ ప్రభుత్వం రోజుకో కొత్త నిర్ణయం తీసుకుంటోంది. ఓ వైపు భారత ఆర్థిక రంగంపై పూర్తి పట్టు కలిగిన మోదీ కార్పొరేట్ కంపెనీలు, వ్యాపారులకు అనుకూలంగా డిసిషన్స్ తీసుకుంటూ ఝలక్ ఇస్తున్నారు. ఓ వైపు మోదీ పట్ల నమ్మకం తో వున్న జనం మాత్రం నానా ఇబ్బందులు పడుతున్నారు. కోలుకోలేని స్థితికి చేరుకున్నారు. తాజాగా ఆభరణాలు, ఆయిల్ పై పడిన సర్కార్ ఇక దేశమంతటా ఎయిర్ పోర్ట్స్ ఏర్పాటు చేయాలని  నిర్ణయం తీసుకుంది. వచ్చే ఐదు ఏళ్ళల్లో మరో 100 విమానాశ్రయాలు ఏర్పాటు చేయాలని, ఆ దిశగా ప్రయత్నాలు స్టార్ట్ చేసింది. అంతే కాకుండా 1,000 కొత్త మార్గాలకు విమాన సేవలను ప్రారంభించాలని భావిస్తోంది. 2025కల్లా దేశంలో అవసరమయ్యే మౌలిక వసతులపై చర్చించేందుకు గత వారంలో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. అందులో ఈ ప్రతిపాదన వచ్చినట్లు సమాచారం. విమానాల లీజుకు ఫైనాన్స్‌ సమకూర్చే వ్యాపార ప్రారంభానికి సంబంధించీ చర్చ జరిగినట్లు తెలిసింది. ఆరేళ్ల కనిష్ఠానికి జారుకున్న జీడీపీ వృద్ధికి ఊతమివ్వడంతో పాటు 2025  నాటికి ఆర్థిక వ్యవస్థను 5 లక్షల కోట్ల డాలర్ల స్థాయికి చేర్చేందుకు మౌలిక ప్రాజెక్టులను రెట్టింపు చేయాలని మోదీ సర్కార...

పార్టీ భవితవ్యం మీదే..తేడా వస్తే వేటే

చిత్రం
ప్రజలు అఖండ మెజార్టీతో గెలిపించారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేలా అపూర్వమైన విజయాన్ని అందించారు. వారికి అన్ని సౌకర్యాలు కల్పిచాల్సిన బాధ్యత మనందరి పై ఉంది. అంతే కాదు పార్టీ ని మరింత బలోపేతం చేయాల్సిన బాధ్యత ఇంచార్జ్ మంత్రులదే. అలా అని పట్టించుకోక పోతే మాత్రం చర్యలు తప్పవు. ఎమ్మెల్యేలతో పేచీలు, ఇగోలు పక్కన పెట్టాల్సిందే. గ్రామ స్థాయి నుండి నగర స్థాయి దాకా బల పడేలా చేయాల్సింది మీరే అని ఏపీ ముఖ్యమంత్రి సందింటి జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. మిమ్మల్ని పూర్తిగా నమ్మాను. బాధ్యతలు అప్పగిస్తే వాటిని నెరవేర్చక పోతే ఎలాగని నిలదీశారు. పార్టీని బలోపేతం చేయడానికి సాధించిన విజయాలనూ పరిగణనలోకి తీసుకుంటా. ఆరు నెలల పని తీరు ఆధారంగా చేసుకుని చూస్తా. బాగా లేకపోతే పునరాలోచించాల్సి వస్తుంది. పార్టీకి ఎమ్మెల్యేలే బలమని తేల్చి చెప్పారు. జిల్లాల్లో ఎమ్మెల్యేలు, మంత్రుల మధ్య గొడవల వల్ల పార్టీకి నష్టం వాటిల్లుతుంది. ఎమ్మెల్యేలు బలంగా ఉంటేనే.. పార్టీ బలంగా ఉంటుంది. ఎమ్మెల్యేలు, మంత్రుల మధ్య సమన్వయం పెంచే బాధ్యత ఇన్‌చార్జి మంత్రులదే. ప్రతి నెలలో రెండు నుంచి నాలుగు రోజుల పాటు జిల్లాల్లో బస చేయాల్సింద...

జీఓ సంచలనం..టీటీడీలో కలకలం

చిత్రం
ఏపీలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరింత దుందుడుకుగా వ్యవహరిస్తున్నారు. పాలనా పరమైన సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ఓ వైపు తన అనుయాయులకు ప్రధానమైన పదవులు అప్పగిస్తున్నారు. దీనిపై విపక్షాలు మండి పడుతున్నా డోంట్ కేర్ అంటున్నారు. ఆచరణలో జగన్ తన తాత రాజా రెడ్డిని గుర్తుకు తెస్తున్నారు. ఒక్క రోజులోనే పలు జీఓలు జారీ చేసి జనాన్ని మెస్మరైజ్ చేస్తుండగా, ఆయా శాఖల్లో పని చేస్తున్న ఉద్యోగులు, సిబ్బందిలో గుబులు రేగుతోంది. తాజాగా వైసీపీ ప్రభుత్వం జారీ చేసిన జిఓ ప్రకంపనలు సృష్టిస్తోంది. జీవో నంబర్ 2323 తిరుమల తిరుపతి దేవస్థానంలో షేక్ చేస్తోంది. ఈ ఏడాది మార్చి 31లోపు రిటైర్ అయి ఇంకా విధుల్లో కొనసాగుతున్న అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులను తొలగించాలని తాజా జీవోలో ప్రభుత్వం ఆదేశించింది. ఈ నేపథ్యంలో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అప్రమత్తమయ్యారు. అలాంటి ఉద్యోగులందరినీ గుర్తించి నివేదిక సమర్పించాలని అన్ని విభాగాల అధికారులను ఆదేశించారు. వివరాలు అందిన వెంటనే ఆ అరవై మందిని తొలగించేందుకు రెడీ అయ్యారు. ఇప్పటికే రిటైర్ అయిన వారిలో టీటీడీ రిటైర్డ్ సూపరిడెంట్ డాలర్ శేషాద్రిపై కూడా పూర్తి స్థాయిలో వేటు పడనున్న...

ప్రయాణీకులకు పసందైన భోజనం

చిత్రం
నిత్యం ప్రయాణం చేయాలనుకునే ట్రావెలర్స్ కు తీపి కబురు అందించింది రైల్వే శాఖ. రుచికరమైన భోజనం అందించాలని ప్లాన్ చేస్తోంది. కూర్చునే సీట్ల వద్దకే లంచ్, టిఫిన్స్, టీ, కాఫీ, ఇతర పానీయాలు, తినుబండారాలు అందజేయనుంది ఐఆర్‌సీటీసీ. ట్రైన్ జర్నీలో అమ్మకానికి వచ్చే రుచులు ఆస్వాదించాలని ఉన్నా వాటి నాణ్యత బాగుండదని తినేందుకు, ఆర్డర్ ఇవ్వడానికి జంకుతారు. బయట మార్కెట్, హోటల్స్, రెస్టారెంట్స్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ కంటే ధరలు ఎక్కువగా ఉంటున్నాయి. దీంతో రైల్వే శాఖ అనుసరిస్తున్న తీరు పట్ల కొంత ఏవగింపు కూడా ఉంది. దీనిపై దేశ వ్యాప్తంగా భారీ ఎత్తున ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో ఐఆర్‌సీటీసీ రంగంలోకి దిగింది. ఆరోగ్య వంతమైన, రుచికరమైన, పరిశుభ్రమైన వాతావరణంలో తయారు చేసిన వంటకాలు అందించాలని రైల్వే శాఖ చర్యలను చేపట్టింది. ఆ క్రమంలోనే పలు ఈ-క్యాటరింగ్‌ కంపెనీలు ఐఆర్‌సీటీసీతో ఒప్పందం చేసుకుని మరీ జైన్‌ ఫుడ్‌ సహా పలు రకాల క్యుసిన్‌లను అందించడానికి ప్రయత్నిస్తున్నాయి. పీఎన్‌ఆర్‌ నెంబర్‌ ఎంటర్‌ చేస్తే చాలు సీటు దగ్గరకే ఫుడ్‌ డెలివరీ చేస్తోంది. ప్రతి చోటా డిస్కౌంట్‌ రాజ్య మేలుతున్న వేళ, ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ ...

తలైవా తళుక్కు మనేనా..ఐడియా వర్కవుటయ్యేనా

చిత్రం
పాన్ ఇండియాలో దిగ్గజ దర్శకులు ఎక్కువగా సినిమాలు తీయాలనుకునే ఒకే ఒక్క హీరో రజనీకాంత్. కోట్లాది అభిమానులను సంపాదించుకున్న ఈ అరుదైన, అద్భుతమైన నటుడి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే అతడి స్థాయి దేశ సరిహద్దులు దాటి..ఇంటర్నేషనల్ ను తాకింది. తమిళ నాడులో ఆయన పేరు చెబితే చాలు జనం పూనకం తో ఊగి పోతారు. ఏ ముహూర్తాన దర్శకుడు బాలచందర్ గైక్వాడ్ పేరును రజనీకాంత్ అని పేరు మార్చాడో, ఇక అప్పటి నుంచి కొన్నేళ్లుగా సినిమా ఇండస్ట్రీని షేక్ చేస్తూ వస్తున్నాడు. అతడు మాట్లాడితే, నటిస్తే చాలు కోట్లు వసూలవుతాయి. ఆయనకు ఉన్నంత క్రేజ్ ఏ నటుడికీ లేదు. డిఫ్ఫరెంట్ కాన్సెప్ట్స్ తో తీసే డైరెక్టర్స్ అంటే తలైవాకు ఇష్టం. అందుకే తనకన్నా వయసులో చిన్న వాళ్ళైనా సరే సినిమాలు చేస్తూ వస్తున్నాడు ఈ అగ్ర నటుడు. రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలని ఆయన ఫ్యాన్స్ వత్తిడి చేస్తున్నారు. వయసు రీత్యా చూసుకున్నా అయన ఇంకా నవ యవ్వనుడిగా అగుపిస్తున్నారు. తన కూతురు వయసున్న వాళ్ల తో ధీటుగా పోటీపడి డ్యాన్సులు చేస్తున్నారు. బీజేపీ ఆయనతో ఇప్పటికే టచ్ లో ఉంది. కానీ తలైవా ఇప్పటి దాకా నోరు మెదప లేదు. తాజాగా పాన్ డైరెక్టర్ మురుగదాస్ తో దర్బార్ ...

సారూ..తగ్గితే తప్పేంటి..?

చిత్రం
తెలంగాణాలో రెండవ సారి కొలువు తీరిన సీఎం కేసీఆర్ తన మాట తప్పా ఎవ్వరి మాటా వినడం లేదు. వినిపించు కోవడం లేదు. సుదీర్ఘమైన రాజకీయ అనుభవం కలిగిన కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు కు ఘనమైన చరిత్ర ఉన్నది. ప్రత్యేక రాష్ట్ర సాధకుడిగా, ఉద్యమ నాయకుడిగా, పాలకుడిగా, పరిపాలనా దక్షుడిగా కేసీఆర్ పేరు తెచ్చుకున్నారు. మేధావిగా, అపర చాణ్యుక్యుడిగా వినుతి కెక్కారు. బహు భాషా కోవిదుడిగా పేరొందారు. తాను ఏది చెబితే అదే చట్టమని, అదే శాసనమని నమ్ముతున్నారు. ఆ దిశగా పాలన సాగిస్తున్నారు. తాను తప్పా ఇంకెవ్వరూ మాట్లాడ కూడదని షరతు విధించారు. దీంతో తెలంగాణాలో ఇప్పుడు మాట్లాడటం అన్నది నేరంగా మారింది. ప్రజలపై నిర్బంధం కొనసాగుతున్నది. నిఘా మరింతగా పెరిగింది. గత 60 ఏళ్ళ కాలంలో ఉమ్మడి రాష్ట్రంలో లేని విధంగా పాలన సాగుతోంది. ఎమ్మెల్యేలు గెలిచినా వాళ్ళు పైకి మాట్లాడలేని పరిస్థితి నెలకొన్నది. ఉద్యమ సమయంలో అన్ని వర్గాలను కేసీఆర్ కదిలించారు. అందరినీ ఒకే తాటి పైకి తీసుకు వచ్చారు. అదే క్రమంలో ఆర్టీసీకి చెందిన కార్మికులు పెద్ద ఎత్తున ప్రత్యేక రాష్ట్ర సాధనలో భాగమయ్యారు. కీలక పాత్ర పోషించారు. సారుకు అండగా నిలబడ్డారు. ప్రజా...

ఫస్ట్ ప్రయారిటీ టాలెంట్ కే

చిత్రం
తెలుగు సినిమా రంగంలో టాప్ రేంజ్ డైరెక్టర్స్ లలో ఒకడిగా కొనసాగుతున్న పూరి జగన్నాథ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన ఎక్కడుంటే అక్కడ నవ్వులు పూస్తాయి. ఆలోచనలకు రెక్కలు వస్తాయి. సృజనాత్మకత వెళ్లి విరుస్తుంది. పూరి జగన్నాథ్ అంటేనే అంతులేని ఎనర్జీ కి కేరాఫ్. న్యూ టాలెంట్ ఎక్కడ ఉంటే అక్కడ వాలి పోతాడు. ఎలాంటి భేషజాలకు తావివ్వకుండా క్రియేటివిటీకి పెద్ద పీట వేయడం పూరికి అలవాటు. పుస్తకాలు బాగా చదువుతాడు. తన ఇల్లే తన లోగిలి. ప్రపంచాన్ని ప్రభావితం చేసిన తత్వవేత్తలను ఇప్పటికే చదివాడు. అందరి కంటే జగన్నాథ్ కు ఫిలాసఫర్ నీషే అంటే అభిమానం. ఆయనతో పాటు ఓషో కూడా. ఉన్నది ఒక్కటే జిందగీ అని నమ్మే పూరి ఏది మాట్లాడినా సంచలనమే. ఎందుకంటే పైసా జేబులో లేక పోయినా సరే ఎలా బతకాలో నేర్చు కోవాలంటే..జగన్నాథ్ తో ఐదు నిమిషాలు సంభాషిస్తే చాలు మనలో కోల్పోయిన ఎనర్జీ తిరిగి వస్తుంది. అంతులేని కాన్ఫిడెన్స్ కలుగుతుంది. ఆయనలో తాను గొప్ప డైరెక్టర్ అన్న ఫీలింగ్ ఉండదు. జస్ట్ ఓ సాధారణమైన వ్యక్తిగా మనకు అగు పిస్తాడు. ఇంట్లో మనం ఎలా మాట్లాడుకుంటామో అలాగే మాట్లాడతాడు. ఇగో ను పక్కన పెడితే చాలు ఇక సమస్యలు అంటూ ఉండవంటాడు...

పోరాటం ఆగదు..విజయం తప్పదు

చిత్రం
తమ న్యాయపరమైన డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె 27 రోజులకు చేరుకుంది. ఇప్పటి దాకా 16 మంది కార్మికులు మృతి చెందారు. ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన రాలేదు. హైకోర్టు సమ్మె పై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పు పట్టింది. ఒక మెట్టు దిగితే తప్పేమిటని ప్రశ్నించింది. ఓ వైపు కార్మికులు చని పోతున్నారు, మరో వైపు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు అయినా ఎలాంటి చర్యలు తీసు కోవడం లేదు. ఇంతకూ రాష్ట్రంలో ప్రభుతం అనేది ఉందా అని అడ్వొకేట్ జనరల్ ను నిలదీసింది. ఇంత జరుగుతున్నా నిమ్మకు నీరెత్తినట్లు ప్రవర్తించడం మంచి పద్ధతి కాదు. మీరేమో ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవంటున్నారు. మరి హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో మీ సీఎం 100 కోట్ల వరాలు ప్రకటించారు. మరి వాటికి డబ్బులు ఎలా వస్తాయో చెప్పండని కోరింది. దీనికి ఏజీ వద్ద నుంచి సమాధానం రాలేదు. అదనపు ఏజీ అవసరం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏజీ ఏం చేస్తున్నారు. ప్రభుత్వం నిద్ర పోయిందా..ఈ రోజు వరకు పూర్తి స్థాయిలో మేనేజింగ్ డైరెక్టర్ ను ఎందుకు నియమించి లేదు. కార్మికులు తమ ఇబ్బందుల గురించి ఎవ్వరితో చెప్పు కోవాలో మీరే చెప్పండి. ఓ వైపు ప్రజల్ల...

తొలగని ప్రతిష్టంభన..తప్పని నిరీక్షణ

చిత్రం
మహారాష్ట్రలో రాజకీయాలు మరింత వేడెక్కిస్తున్నాయి. బీజేపీ, శివసేన పార్టీలు ఎవరికి వారే ఎమునా తీరే అన్న రీతిలో వ్యవహరిస్తూ ఉండడంతో ప్రభుత్వం ఏర్పాటులో ఆలశ్యం అవుతోంది. ఇరు పక్షాలు మెట్టు దిగడం లేదు. సీఎం కుర్చీ కోసం పట్టు వీడడం లేదు. దీంతో ట్రబుల్ షూటర్, హోమ్ శాఖా మంత్రి అమిత్ చంద్ర షా రంగంలోకి దిగారు. ముఖ్యమంత్రి పదవి ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదులుకోబోమని తేల్చి చెప్పారు. దీంతో కథ మళ్ళీ మొదటికి వచ్చింది. అంతా సర్దుకుంటుందని, త్వరలోనే ఇరు పార్టీలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామని ఫడ్నవీస్ చెప్పారు. అంతకు ముందు శాసన సభా పక్ష నాయకుడిగా దేవేంద్ర ఫడ్నవీస్‌ మరోసారి ఎన్నికయ్యారు. పరిశీలకులుగా వచ్చిన కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్, పార్టీ ఉపాధ్యక్షుడు అవినాష్‌ రాయ్‌ ఖన్నాల సమక్షంలో అసెంబ్లీకి కొత్తగా ఎన్నికైన 105 మంది ఎమ్మెల్యేలు తమ నాయకుడిగా ఫడ్నవీస్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తనపై నమ్మకం ఉంచిన ఎమ్మెల్యేలకు ఫడ్నవీస్‌ కృతజ్ఞతలు తెలిపారు. శివసేన అధినేత ఉద్ధవ్‌కు ధన్యవాదాలు తెలిపారు. అయితే మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ సంక్షోభం నేపథ్యంలో వచ్చిన ప్రత్యామ్నాయాలన్నింటినీ దేవేంద్ర ఫడ్నవీ...

రాహుల్ రహస్యం..ముద్దు మురిపెం

చిత్రం
తెలుగు బుల్లి తెరమీద సెన్సేషన్ క్రియేట్ చేస్తూ, రేటింగ్ లో టాప్ రేంజ్ లో కొనసాగుతూ, జనాన్ని మెస్మరైజ్ చేస్తూ సాగి పోతున్న బిగ్ బాస్ రియాల్టీ షోకు త్వరలో శుభం కార్డు పడనుంది. దేశ వ్యాప్తంగా స్టార్ టీవీ బిగ్ బాస్ ప్రోగ్రాం ను ఇదివరకే స్టార్ట్ చేసి పాపులర్ అయ్యింది. ఇదే సమయంలో స్టార్ టీవీ తెలుగులో వినోద రంగంలో ఉన్న మా టీవీని భారీ ప్యాకేజీకి కొనుగోలు చేసింది. కొత్త ప్రోగ్రామ్స్ కు శ్రీకారం చుట్టింది. ఇదే సమయంలో నార్త్ లో దుమ్ము రేపిన బిగ్ బాస్ రియాల్టీ షో ను తెలుగు, తమిళ్, మలయాళం లలో కూడా లాంచ్ చేసింది. మొదటి ఎపిసోడ్ ను ప్రముఖ నటుడు ఎన్ఠీఆర్ హోస్ట్ చేయగా, రెండో ఎపిసోడ్ ను నటుడు నాని ప్రెజెంట్ చేశాడు. ముచ్చటగా మూడో రియాల్టీ షో ను ప్రముఖ నటుడు నాగార్జున తో నడిపిస్తున్నారు. ఒక్క సారిగా ఈ ప్రోగ్రాం టాప్ రేటింగ్ లో కొనసాగింది. ఇప్పటికే 100 రోజులు పూర్తి చేసుకుంది. పార్టిసిపెంట్స్ అయిదుగురు మాత్రమే మిగిలారు. ఇప్పటికే సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ఫైనల్ కు చేరుకోగా మిగతా వారు ఫైనల్ కోసం తంటాలు పడుతున్నారు. ఇదే సమయంలో పాల్గొన్న వారిలో ఒక్కొక్కరి గురించి వీడియో టెలికాస్ట్ చేశారు బిగ్ బాస్. ఈ సందర్...

కన్నా నా ప్రాణం కంటే నువ్వే మిన్న

చిత్రం
బంధం బలీయ మైనది. దానిని తెంచు కోవాలని అనుకున్నా, దానిని వదిలి ఉండలేం. ఎక్కడికీ వెళ్లలేం. ఇది అనాది నుంచి వస్తున్నదే. ప్రపంచంలో తల్లి తర్వాతే ఎవ్వరైనా. ఎందుకంటే నవ మాసాలు మోసి, కొత్త ప్రాణానికి జీవం పొసే అమ్మ అంటే ఎవరికి ఇష్టం ఉండదు కనుక. ఈ లోకంలో తల్లీ బిడ్డల మధ్య జన్మ జన్మల బంధం దాగి ఉంటుంది. దీనిని చెరపాలని చూసినా అది నిలబడదు. అందుకే కన్నవారు పిల్లల పట్ల అంతులేని వాత్సల్యం తో ఉంటారు. అంత కంటే ఎక్కువగా ప్రేమను కలిగి ఉండడం మామూలే. ప్రపంచంలో ఎంతో ఎత్తుకు ఎదిగినా, లేదా ఉన్నత స్థానం అధిరోహించినా, రికార్డులు బ్రేక్ చేసినా, లోకం విస్తు పోయేలా చరిత్ర సృష్టించినా చివరకు బిడ్డ దగ్గర తల్లులే. దీనిని నిజం చేస్తూ ఓ పోస్టు చేసింది ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా. ఆమె ప్రముఖ పాకిస్తాన్ కు చెందిన క్రికెటర్ ను పెళ్లి చేసుకుంది. వీరికి గత ఏడాది ఓ బాబు పుట్టాడు. పుట్టి ఏడాది గడిచింది. ఈ సందర్బంగా గ్రాండ్ గా బర్త్ డే సెలబ్రేషన్స్ నిర్వహించారు. తన కొడుకుతో దిగిన అప్పటి ఫోటోను సానియా పెట్టారు. నా ప్రాణం ఉన్నంత వరకూ నీ వెన్నంటే ఉంటా అంటూ మీర్జా తన కుమారుడికి పుట్టిన రోజు శుభాకాంక్...

దిగ్గజ కంపెనీలకు షావోమి ఝలక్

చిత్రం
నిన్నటి దాకా స్మార్ట్ మొబైల్స్ తయారీలో వరల్డ్ మార్కెట్ లో టాప్ రేంజ్ లో కొనసాగిన యాపిల్, శాంసంగ్, తదితర దిగ్గజ కంపెనీలకు షావో మీ కోలుకోలేని రీతిలో ఝలక్ ఇస్తోంది. దిమ్మ తిరిగేలా ఇప్పటికే 10 మిలియన్లకు పైగా చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్స్ తయారీ సంస్థ షావో మీ అమ్మకాల్లో రికార్డులను బ్రేక్ చేస్తోంది. దీని దెబ్బకు ఇతర కంపెనీల ఫోన్స్ వెనక్కి తగ్గాయి. తాజాగా భారీ షాక్ ఇచ్చేందుకు రెడీ అవుతోంది రెడ్ మీ. నాణ్యమైన రీతిలో కెమెరా ఉండేలా, ఇతర మొబైల్స్ లో లేని సౌకర్యాలు, సదుపాయాలను కల్పించేలా డిజైన్స్ కలర్ ఫుల్ గా ఉండేలా, మొబైల్ ప్రేమికులను ఆకట్టుకునేలా తయారు చేసే పనిలో పెద్దది. ఇదే విషయాన్ని వెల్లడించింది. దీంతో ఇప్పటికే అమ్మకాలు వెనక్కి తగ్గి పునరాలోచనలో పడ్డ దిగ్గజ కంపెనీలు మరోసారి షావో మీ ఎలాంటి ఫోన్ తీసుకు వస్తుందోనని ఆరా తీసే పనిలో పడ్డాయి. ఇదే సమయంలో 5 జీ నెట్ వర్క్ రాబోతోంది. ఇప్పుడున్న 4 జీ మొబైల్స్ పని చేయక పోవచ్చు. ఇదే గనుక జరిగితే ఇప్పుడు కోట్లాది మంది వాడుతున్న స్మార్ట్ ఫోన్స్ ను పాడేయాల్సిందే. ఇది కూడా ఓ రకంగా మొబైల్ తయారీ కంపెనీలకు మళ్ళీ కొత్త ఫోన్స్ తయారు చేయాల్సిందే. ఇదిలా...

కార్మికుల సమరం..అంతిమ విజయం

చిత్రం
బాధలు తట్టుకుని..బంధనాలు తెంచుకుని..నిఘాను దాటుకుని ఆర్టీసీ కార్మికులు తలపెట్టిన సకల జనుల సమర భేరి సక్సెస్ అయ్యింది. వేలాది మంది కార్మికులు హైదరాబాద్ కు తరలి వచ్చారు. వీరికి మద్దతుగా అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్ధి సంఘాలతో పాటు కవులు, కళాకారులు, మేధావులు, సబ్బండ వర్గాలు తరలి వచ్చారు. ఈ సభ మరో పోరాటాన్ని తలపింప చేసింది. ఈ సందర్బంగా ఆర్టీసీ కార్మికుల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో సకల జన భేరి మోగింది. ప్రభుత్వ విధానాలను సభా వేదికగా నేతలు ఎండ గట్టారు. ఆర్టీసీని అంత మొందించేందుకు ప్రభుత్వం చేస్తున్న కుట్రలను ప్రజలకు పూస గుచ్చినట్లు వివరించారు. ఆర్టీసీ నష్టాలపై ప్రభుత్వం చేస్తున్న అసత్య ప్రచారాలను తిప్పి కొట్టారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా అంతిమ విజయం ఆర్టీసీ కార్మికులదే అని ఆర్టీసీ జేఏసీ నేత అశ్వత్థామరెడ్డి అన్నారు. సమ్మెతో ఎన్ని ఇబ్బందులు ఎదురవుతున్నా గమ్యాన్ని చేరాల్సిందే నని కార్మికులకు పిలుపునిచ్చారు. ఆనాడు  తెలంగాణ కోసం కుల మతాలకు అతీతంగా ఉద్యమం చేశారని గుర్తు చేశారు. తమను సీఎం కేసీఆర్ బెదిరించారని, భయపెట్టా...

మారిన స్వరం..కాషాయ జపం

చిత్రం
రాజకీయాల్లో శాశ్వత శత్రువులు..శాశ్వత మిత్రులు ఉండరన్న వాస్తవం కన్నడ నాట వాస్తవ రూపం దాల్చేలా కనిపిస్తోంది. నిన్నటి దాకా అధికారం లో ఉన్న జేడీఎస్ అధినేత కుమార స్వామి ఉన్నట్టుండి స్వరం మార్చడం సంచలనం రేపింది. నిన్నటి దాకా జాతీయ కాంగ్రెస్ పార్టీతో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. ఇదే సమయంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సోనియా, రాహుల్ గాంధీతో పాటు చంద్రబాబు తో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు కూడా. విశ్వాస పరీక్షలో కుమార తన సీఎం పదవిని పోగొట్టుకున్నారు. తాజాగా కుమార స్వామి కాషాయానికి అనుకూలంగా కొత్త పల్లవి అందుకున్నారు. మొన్నటి వరకు కాంగ్రెస్‌తో  చెట్టా పట్టా లేసుకుని తిరిగిన ఆయన బీజేపీ పార్టీకి అనుకూలంగా గళం సవరించు కున్నారు. రాష్ట్రంలో యడియూరప్ప నేతృత్వంలోని బీజేపీ సర్కార్‌ కూలి పోయే అవకాశమే లేదని, ఒక వేళ అలాంటి పరిస్థితే వస్తే బీజేపీకి తమ పార్టీ మద్దతు ఇస్తుందని కుమారస్వామి వ్యాఖ్యానించడం చర్చ నీయాంశంగా మారింది. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్‌ సీనియర్లు డీకే శివకుమార్, పరమేశ్వర్‌ వంటి వారిపై ఐటీ, ఈడీ దాడులు జరుగుతుండడం, తన ఎమ్మెల్యేలను కాపాడు కోవడం కోసం కుమారస్వామి ఈ ఎత్తుగడను...

అమెరికా దెబ్బ..టెకీలు అబ్బా

చిత్రం
ప్రపంచాన్ని శాసిస్తున్న అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ తన వంకర బుద్దిని మార్చు కోవడం లేదు. ఓ వైపు ఇండియాకు స్నేహ హస్తం చాస్తూనే మరో వైపు మన ఇండియన్స్ పై దెబ్బ కొట్టే పనికి శ్రీకారం చుట్టాడు. నిన్నటి దాకా చిలుక పలుకులు పలికిన ప్రెసిడెంట్ మళ్ళీ మాట మార్చాడు. ఏకంగా టెకీలకు కోలుకోలేని షాకిచ్చింది. తాజాగా యూఎస్‌ ఇమ్మిగ్రేషన్‌ అండ్‌ సిటిజన్‌ పాలసీ ప్రకారం హెచ్‌-1బీ దరఖాస్తులు 2015 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2019లో భారీగా తగ్గాయి. ఇండియాకు సంబంధించిన దరఖాస్తులు ఎక్కువగా ఉన్నాయి. వీటిలో 70 శాతం తిరస్కరణకు గురవడం గమనార్హం. ఇందులో కొత్త ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వారివే ఎక్కువగా ఉన్నాయి. ఐటీ కంపెనీలకు ప్రభుత్వం విధిస్తున్న ఆంక్షలు కూడా ఇందుకు ప్రధాన కారణమని నిపుణులు పేర్కొంటున్నారు. టెక్‌ దిగ్గజం కాగ్నిజెంట్‌ కంపెనీకి చెందిన 60  శాతం దరఖాస్తులు ఎక్కువగా చెల్లుబాటు కాలేదు. ఈ కంపెనీ తో పాటు విప్రో, ఇన్ఫోసిస్‌ కంపెనీలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. 2018లో భారత్‌కు చెందిన ఆరు ప్రధానమైన సంస్థలలో 2,145 మందికి మాత్రమే హెచ్‌-1బీ వీసాలు వచ్చాయి. అమెరికాకు చెందిన అమెజాన్‌ సంస్థలో పనిచేసే ...

విడిచి ఉండలేం..బాధను తట్టుకోలేం

చిత్రం
నిన్ను విడిచి ఉండలేం. నువ్వు లేకుండా మేం ఆడలేం. నీతో గడిపిన జ్ఞాపకాలు మమ్మల్ని ఉండనీయడం లేదంటూ తోటి సహచరులు ఆవేదన చెందుతున్నారు. లోలోపట కుమిలి పోతున్నారు. ఇదంతా బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు ఆటగాళ్ల బాధ ఇది. ఎందుకంటే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) బంగ్లా దేశ్ ఆల్ రౌండర్, క్రికెట్ స్టార్ షకీబ్ అల్ హసన్ పై రెండు సంవత్సరాల పాటు నిషేధం విధించింది. ఈ నిర్ణయాన్ని హసన్ తోటి క్రికెటర్లు జీర్ణించు కోలేక పోతున్నారు. తట్టు కోలేక కన్నీటి పర్యంత మవుతున్నారు. హసన్ లేకుండా క్రికెట్ ఎలా ఆడాలంటూ భావోద్వేగానికి లోనవుతున్నారు. హసన్ తో తమకున్న అనుబంధాన్ని సీనియర్ బ్యాట్స్ మెన్ రహీం, వెటరన్ బౌలర్ మోర్తజా గుర్తు చేసుకున్నారు. ఇదే విషయాన్నీ సోషల్ మీడియా వేదికగా క్రికెట్ అభిమానులతో పంచుకున్నారు. ఇదిలా ఉండగా తమ తోటి ఆటగాడు ఛాంపియన్ లా హసన్ తిరిగి వస్తాడని, తమ జట్టులో తిరిగి ఆడతాడని ఆశాభావం వ్యక్తం చేశారు. ఒక అడుగు ముందుకు వేసి తమ బంధాన్ని షేర్ చేసుకున్నారు. సమ వయస్కులమైన మేమిద్దరం 18 ఏళ్ల పాటు కలిసి క్రికెట్‌ ఆడాం. మైదానంలో నువ్వు లేకుండా క్రికెట్‌ ఆడాలన్న ఆలోచన ఎంతో బాధగా ఉంది. త్వరలోనే న...

అవార్డు వద్దన్న అమ్మాయి

చిత్రం
ఎవరికైనా 35 లక్షల రూపాయలు వస్తున్నాయంటే చాలు తీసుకునేందుకు రెడీగా ఉంటారు. కానీ స్వీడిష్ కంట్రీకి చెందిన యువ కెరటం గ్రెటా థంబర్గ్‌ మాత్రం తనకు డబ్బులు, అవార్డు వద్దని చెప్పేసింది. పర్యావరణ పరిరక్షణ కోసం గత కొన్నేళ్లుగా కృషి చేస్తోంది. ఈ ఏడాది పర్యావరణ అవార్డు విజేతగా స్వీడన్‌, నార్వే ఆమె పేరును ప్రకటించాయి. గ్రెటాకు అవార్డుతో పాటు 35 లక్షల రూపాయలు బహుమతిగా అందుతాయి. గ్రెటా మాత్రం ఈ ప్రతిష్టాత్మక అవార్డును తిరస్కరించారు. తనకు అవార్డులు అక్కర్లేదని, వాతావరణ మార్పుపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకుంటే చాలు అని స్పష్టం చేశారు. ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తున్న గ్రెటా పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలనీ పిలుపునిచ్చారు. రాజకీయ నాయకులు, ప్రజల సహకారం మనకిప్పుడు కావాలని కోరారు. సైన్స్‌ చెబుతున్న వాస్తవాలు వారు గ్రహించాలి అన్నారు. ఇక తనకు అవార్డు ప్రకటించిన సందర్భంగా గ్రెటా మాట్లాడారు. పర్యావరణం విషయంలో స్వీడన్‌, నార్వే, ఫిన్లాండ్‌, ఐస్‌లాండ్‌, డెన్మార్క్‌ దేశాలు వ్యవహరిస్తున్న తీరును విమర్శించారు. చాలా అందమైన మాటలు చెబుతారు. అయితే కర్భన ఉద్గారాల విషయానికి వచ్చే సరికి మా...