కంపెనీల మధ్య పోటీ..కస్టమర్స్ కు భలే గిరాకీ
టెలికాం కంపెనీల మధ్య నెలకొన్న పోటీ కస్టమర్స్ కు డేటా పరంగా బాగా వర్కవుట్ అయ్యేలా ఉంది. అయితే ఒక్కో కంపెనీ ఒక్కో రోజు బంపర్ ఆఫర్స్ ప్రకటిస్తూ ఎటూ తేల్చుకోకుండా చేసేస్తున్నాయి. ఇప్పటికే ప్రైవేట్ టెలికాం ఆపరేటర్స్ నుండి పోటీ తట్టుకునేందుకు భారత ప్రభుత్వ టెలికాం సంస్థ భారత్ సంచార నిగమ్ లిమిటెడ్ అంటే బిఎస్ఎన్ఎల్ సైతం తన వినియోగదారులకు అపరిమిత కాల్స్, డేటా అదనపు ప్రయోజనాలు కల్పిస్తోంది. దీంతో తాజాగా మరో దెబ్బ కొట్టే పనిలో పడ్డది జియో రిలయన్స్ కంపెనీ. దీంతో ప్రధాన పోటీదారుగా ఉన్న తన ప్రత్యర్థి కంపెనీ నుండి, తన కస్టమర్స్ తరలి పోకుండా ఉండేందుకు ఎయిర్‌టెల్ బంపర్ అఫర్ ప్రకటించింది.
ఏకంగా కొత్త ప్లాన్స్ విడుదల చేసింది. 100 ఎంబీపీఎస్ వేగంతో ఎయిర్‌టెల్ నుంచి కొత్త బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ ను లాంచ్ చేసింది. దీనిని వాడుకుంటే బోలెడు ప్రయోజనాలు కలగనున్నాయి. కేవలం 799 రూపాయలతో సరికొత్త బ్రాడ్ బ్యాండ్ ప్లాన్‌ను వెల్లడించింది. ‘ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ ఫైబర్’ పేరుతో ఇప్పుడు ఫైబర్ సేవలు అందిస్తున్న ఎయిర్‌టెల్ ఇక నుంచి అన్ని హోం బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లు ఈ గొడుకు కిందికే రానున్నట్టు తెలిపింది. తాజా ప్లాన్‌లో 100 ఎంబీపీఎస్ నుంచి 1జీబీ వేగంతో సేవలు లభిస్తాయి. అలాగే, మూడు నెలల పాటు నెట్ ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది.
12 నెలల పాటు అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్, జీ5 యాక్సిస్, ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ కంటెంట్ తదితర ఎయిర్‌టెల్ థ్యాంక్స్ ప్రయోజనాలు లభిస్తాయని తెలిపింది. ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ ఫైబర్ ప్లాన్లు చాలా వేగంగా ఉంటాయని, అధిక డేటా లభిస్తుందని, అవసరాన్ని బట్టి అప్‌గ్రేడ్ చేసుకునే సదుపాయం కూడా ఉందని భారతీ ఎయిర్‌టెల్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ శష్వత్ శర్మ పేర్కొన్నారు. మొత్తం మీద తన ప్రత్యర్థి జియోకు షాక్ ఇవ్వాలని ఇలా చేసింది ఎయిర్‌టెల్. ఏది ఏమైనా దిగ్గజ కంపెనీల మధ్య ఆధిపత్య పోరు ఒకింత లాభాన్ని ఇస్తునాడన్న మాట.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి