ఆ ఇద్దరిలో ఒక్కరికే ఛాన్స్

తెలుగు బుల్లి తెరమీద రియాల్టీ షో సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. కొన్ని గంటల్లో దీనికి శుభం కార్డు పడబోతోంది. టైటిల్‌ గెలవడానికి ఇంటి సభ్యులు చేయాల్సిందంతా చేసేశారు. ఇప్పుడు అంతిమ తీర్పు ప్రజల చేతుల్లో ఉంది. అయితే వారి తీర్పును తమకు అనుకూలంగా మలుచు కునేందుకు హౌస్‌ మేట్స్‌తో పాటు ఇంటి సభ్యుల అభిమానులు తీవ్రంగా కష్ట పడుతున్నారు. వీరికి సపోర్ట్‌ చేస్తూ కొంత మంది సెలబ్రిటీలు సైతం ప్రచారం బాట పట్టారు. శ్రీముఖికి బుల్లితెర యాంకర్‌ రష్మీ మద్దతు తెలుపగా, రాహుల్‌కు పాప్‌ సింగర్‌ నోయెల్‌ ప్రచారం చేస్తున్నాడు.

అలీ రెజాకు పటాస్‌ పంచ్‌ల యాంకర్‌ రవి తోడుగా నిలిచాడు. ఈ క్రమంలో గాయని గీతా మాధురి, నటి హరితేజ బిగ్‌బాస్‌ 3పై స్పందించారు. బిగ్‌ బాస్‌ హౌస్‌లో టాప్‌ 5కు చేరుకున్న ఇంటి సభ్యులందరికీ గీతా మాధురి ఆల్‌ ద బెస్ట్‌ తెలిపింది. అయితే శ్రీముఖి, రాహుల్‌ సిప్లిగంజ్‌లతో దిగిన ఫొటోను మాత్రమే పోస్టు చేసింది. కాగా ఇప్పుడు ఎవరికి ఓట్లు వేయాలనే దానిపై ఫ్యాన్స్ తలలు పట్టుకుంటున్నారు. దీంతో గీతా మాధురి ఫ్యాన్స్‌ రెండు టీంలుగా విడిపోయి రాహుల్‌, శ్రీముఖికి మద్దతు తెలుపుతూ ఓట్లు చీల్చుతున్నారు.

గత సీజన్‌లో రన్నరప్‌గా నిలిచిన గీతా మాధురి బిగ్‌ బాస్‌ ఐ లోగో తో పచ్చ బొట్టు వేయించుకుంది. ఈ సీజన్‌లో శ్రీముఖి ‘బిగ్‌బాస్‌ కన్ను’ను పచ్చబొట్టు వేయించు కోవటంతో ఆమె కూడా రన్నరప్‌గా నిలుస్తుందని కొంతమంది నెటిజన్లు జోస్యం చెబుతున్నారు. మరి శ్రీముఖి టైటిల్‌ సాధిస్తుందా, లేక రాహుల్ సిప్లిగంజ్ ఎగరేసుకు పోతాడా అన్నది చూడాలి. అయితే మొదటి సీజన్‌లో టాప్‌ 3లో చోటు దక్కించుకున్న హరితేజ.. తన ఫేవరెట్‌ కంటెస్టెంట్లు శ్రీముఖి, రాహుల్‌ అని చెప్తూ.. ఆ ఇద్దరికీ టైటిల్‌ గెలిచే సత్తా ఉందంటూ కామెంట్ చేయడం విశేషం. మొత్తం మీద వీరిద్దరిలో ఒక్కరికే దక్కనుంది అదృష్టం.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!