కార్మికుల వేదన..చిన జీయర్ దీవెన


ఆయన జగమెరిగిన జగత్ గురువు. లక్షలాది మంది భక్తులను కలిగిన ఆధ్యాత్మిక వేత్త. ఆధునిక యుగంలో భక్తిని, శాంతిని ప్రవచిస్తూ సాగి పోతున్న యోగి. ఆయనను పామరులు, పండితులు కొలుస్తారు. కలియుగంలో చినజీయర్ స్వామీజీని ఇష్ట దైవంగా భావిస్తారు. ఆయన భక్తుల జాబితాలోకి తాజగా తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, యెడ్యూరప్ప, సందింటి జగన్ మోహన్ రెడ్డిలు కూడా చేరి పోయారు. ఇది కూడా ఓ సంచలనమే. కాగా గత 28 రోజులుగా తమ డిమాండ్లు పరిష్కారించాలని కోరుతూ తెలంగాణ ఆర్టీసీ కార్మికులు ఆందోళన చేస్తున్నారు.

రాష్ట్ర హైకోర్టు చీవాట్లు పెట్టినా సీఎం పట్టించు కోవడం లేదు. ఇప్పటికే ఎలాంటి ప్రోగ్రెస్ కనిపించక పోవడంతో 16 మంది తట్టు కోలేక అసువులు బాసారు. అయినా సీఎం డోంట్ కేర్ అంటున్నారు. 49 వేల మంది సెల్ఫ్ డిస్మిస్ అయ్యారంటూ స్పష్టం చేశారు. కార్మికులు ఎన్ని రోజులు సమ్మె చేస్తారో చూస్తా, చర్చలు మాత్రం జరిపే ప్రసక్తి లేదన్నారు. ఇప్పటికే బస్సులు రాక లక్షలాది మంది ప్రజలు లబోదిబోమంటున్నారు. పలు ప్రమాదాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. సమ్మె వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని, తక్షణమే సమస్యను పరిష్కారించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం కింద పిటిషన్స్ దాఖలయ్యాయి.

దీనిపై న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రభుత్వ అలసత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే కార్మికులకు వేతనాలు ఇవ్వాలని ఆర్టీసీ ఎండీని ఆదేశించింది. అయినా ఫలితం లేక పోయింది. ఇదే సమయంలో ఇక సీఎం కేసీఆర్ ప్రాణప్రదంగా గౌరవించే శ్రీ శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామీజీని ఆర్టీసీ కార్మికులు కలిశారు. ఆయన దీవెనలు పొందారు. సీఎం కరుణించేలా చూడాలని కోరారు. స్వామి అందుకు ఒకే చెప్పారు. చివరకు సమ్మె స్వామి వద్దకు చేరింది. ఇక ఏం జరుగుతుందో వేచి చూడాలి. 

కామెంట్‌లు