రియల్ బిగ్ బాస్ ఎవ్వరో

తెలుగు బుల్లి తెరమీద ఇప్పుడు సీరియల్స్ హవా నడుస్తోంది. అంతకంటే ఎక్కువగా రియాల్టీ షో లు కూడా టీఆర్ఫీ రేటింగ్ లో చోటు దక్కించుకుంటున్నాయి. తాజాగా స్టార్ మా టీవీ బిగ్ బాస్ ప్రారంభించిన కొద్దీ రోజుల్లోనే పాపులర్ షో గా పేరు తెచ్చుకుంది. ఇప్పటికే వంద రోజులు పూర్తయ్యాయి. శివ జ్యోతి ఎలిమినేట్ కావడంతో బాబా భాస్కర్, రాహుల్, శ్రీ ముఖి, వరుణ్, అలీ రెజా మాత్రమే మిగిలారు. బిగ్ బాస్ ఫైనల్ లో అంతిమ విజేత ఎవరో కొన్ని గంటల్లోతేలి పోనుంది. వీరిలో చివరకు టాప్‌‌‌‌‌‌‌‌–3లో నిలిచిన వారి లోంచి ఒకరిని విన్నర్ గా ఎంపిక చేస్తారు. ఫైనల్‌‌‌‌‌‌‌‌ విజేత కోసం ఆడియెన్స్‌‌‌‌‌‌‌‌కు ఓటింగ్‌‌‌‌‌‌‌‌ అందుబాటులో ఉంది. అయిదుగురి లోంచి ఎవరు టైటిల్‌‌‌‌‌‌‌‌ గెలుస్తారని ఆడియెన్స్‌‌‌‌‌‌‌‌ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

హోస్ట్‌‌‌‌‌‌‌‌గా నాగార్జున ఈ షోను సక్సెస్‌‌‌‌‌‌‌‌ ఫుల్‌‌‌‌‌‌‌‌గా నడిపిస్తున్నాడు. కంటెస్టెంట్లు కూడా ఆడియెన్స్‌‌‌‌‌‌‌‌ను బాగానే ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైన్‌‌‌‌‌‌‌‌ చేశారు. మధ్యలో కొన్ని ఎపిసోడ్లు అంతగా ఆకట్టుకోక పోయినా, ఓవరాల్‌‌‌‌‌‌‌‌గా ఆడియెన్స్‌‌‌‌‌‌‌‌ను ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైన్‌‌‌‌‌‌‌‌ చేసింది ఈ షో. కంటెస్టెంట్లకు మద్దతుగా సోషల్‌‌‌‌‌‌‌‌ మీడియాలో ఫ్యాన్స్‌‌‌‌‌‌‌‌ విపరీతంగా ప్రచారం చేస్తున్నారు. ఒకరి ఫ్యాన్స్‌‌‌‌‌‌‌‌ మరొక కంటెస్టెంట్‌‌‌‌‌‌‌‌కు వ్యతిరేకంగా ట్రోల్స్‌‌‌‌‌‌‌‌ కూడా చేస్తూ, వాళ్ల ఇమేజ్‌‌‌‌‌‌‌‌ను తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం ఫ్యాన్‌‌‌‌‌‌‌‌ వార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నడుస్తోంది. గతంలో ‘కౌశల్‌‌‌‌‌‌‌‌ ఆర్మీ’ లాగే ఈ సారి కూడా అందరికీ ఆర్మీ లు ఏర్పడ్డాయి. సినిమా హాళ్లలో యాడ్స్‌‌‌‌‌‌‌‌తో, హోర్డింగ్స్‌‌‌‌‌‌‌‌తో తమ ఫేవరెట్‌‌‌‌‌‌‌‌ కంటెస్టెంట్‌‌‌‌‌‌‌‌కు ఓటేయమని ప్రచారం చేస్తున్నాయి. బుల్లితెరపై టాప్‌‌‌‌‌‌‌‌ యాంకర్లలో ఒకరిగా శ్రీముఖి కొనసాగుతోంది.

పటాస్‌‌‌‌‌‌‌‌ షో ద్వారా యూత్‌‌‌‌‌‌‌‌కు బాగా దగ్గరైంది. ‘హ్యాపీడేస్‌‌‌‌‌‌‌‌’ సినిమాతో పరిచయమైన వరుణ్​ సందేశ్‌‌‌‌‌‌‌‌ సినిమాల్లో హీరోగా చేసి మంచి పేరు తెచ్చుకున్నాడు. సినిమాలు చేయక పోయినా ఈ షో ద్వారా ఆడియెన్స్‌‌‌‌‌‌‌‌కు మళ్లీ దగ్గరయ్యాడు. పాటగాడిగా రాహుల్‌‌‌‌‌‌‌‌ సిప్లిగంజ్‌‌‌‌‌‌‌‌ పేరు తెచ్చుకున్నాడు. హౌజ్‌‌‌‌‌‌‌‌లో రోజు రోజుకు ఇమేజ్‌‌‌‌‌‌‌‌ పెంచుకుంటూ పోయాడు. డ్యాన్స్‌‌‌‌‌‌‌‌ మాస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయిన బాబా భాస్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హౌజ్‌‌‌‌‌‌‌‌లో ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా పేరు తెచ్చుకున్నాడు. మోడల్‌‌‌‌‌‌‌‌ కమ్‌‌‌‌‌‌‌‌ యాక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయిన అలీ రెజా ముందు నుంచి స్ట్రాంగ్‌‌‌‌‌‌‌‌ కంటెస్టెంట్‌‌‌‌‌‌‌‌ గానే ఉన్నాడు. మొత్తం మీద ముగింపు సమావేశానికి గెస్ట్ గా చిరంజీవి రానున్నట్లు సమాచారం.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!