బిగ్ ఛాన్స్ కొట్టేసిన భవానిశ్రీ


ఎవరీ భవానిశ్రీ అనుకుంటున్నారా. ఇప్పుడు తమిళ్ సినీ రంగంలో సెన్సేషన్ సృష్టిస్తున్న నటి. పిన్న వయస్సులోనే టాప్ రేంజ్ లోకి వెళ్లేందుకు ఈ అమ్మడు రెడీ అవుతోంది. 25 ఏళ్ల వయసులోనే 25 చిత్రాలకు సంగీతాన్ని అందించి రికార్డు కెక్కిన సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్‌ కుమార్‌కు స్వయానా సోదరి. మ్యూజిక్ డైరెక్టర్ గా బిజీగా ఉంటూనే హీరోగా కూడా సక్సెస్ ఫుల్ గా రాణిస్తున్నాడు జీవి. ప్రస్తుతం అర డజనుకు పైగా చిత్రాల్లో నటిస్తున్నాడు. ఏ.ఆర్‌.రెహ్మాన్‌ మేనల్లుడు కూడా. అంతే కాదు జీవీ భార్య సైతం సైంధవి యువ గాయకురాలు. సో..వీరి ఇంట అందరూ ప్రతిభావంతులే.

తాజాగా చెల్లెలు భవాని శ్రీ కూడా రంగ ప్రవేశం చేస్తోంది. ఈమె ఇప్పటికే రణసింగం అనే చిత్రంలో నటించడానికి ఎంపికయ్యారు. విజయ్‌ సేతుపతి, ఐశ్వర్య రాజేశ్‌ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో భవానీశ్రీ రెండవ హీరోయిన్‌గా నటిస్తున్నారు. నవ దర్శకుడు విరుమాండి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం నిర్మాణంలో ఉంది. కాగా తొలి చిత్రం తెరపైకి రాక ముందే భవానీశ్రీ మరో రెండు సూపర్‌ అవకాశాలు తలుపు తట్టాయన్నది తాజా న్యూస్‌. ఈ చిన్న దానికి ధనుష్‌కు జంటగా నటించే అవకాశంతో పాటు, మరో డైరెక్టర్ సుధ కొంగర చిత్రంలోనూ నటించే లక్కీ ఛాన్స్‌ కొట్టేసినట్లు తాజా సమాచారం.

ధనుష్‌ త్వరలో పరియేరుం పెరుమాళ్‌ చిత్రం ఫేమ్‌ మారి సెల్వరాజ్‌ దర్శకత్వంలో నటించడానికి రెడీ అవుతున్నారు. దీన్ని కలైపులి ఎస్‌.థాను భారీ ఎత్తున నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీనికి కర్ణన్‌ అనే టైటిల్‌ను నిర్ణయించినట్టు ప్రచారంలో ఉంది. ఇందులో నటి భవానీశ్రీ ఒక ముఖ్య పాత్రలో నటించనున్నట్లు తెలిసింది. ఇకపోతే సుధ కొంగర దర్శకత్వంలో కథానాయకిగా నటించే అవకాశాన్ని దక్కించుకున్నట్లు తెలిసింది. మొత్తం మీద జీవీ.ప్రకాశ్‌ కుమార్‌ కుటుంబం నుంచి హీరోయిన్‌ తయారైందన్న మాట.  

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!