దేశమంతటా ఇక విమానాలు
కేంద్రం లోని బీజేపీ ప్రభుత్వం రోజుకో కొత్త నిర్ణయం తీసుకుంటోంది. ఓ వైపు భారత ఆర్థిక రంగంపై పూర్తి పట్టు కలిగిన మోదీ కార్పొరేట్ కంపెనీలు, వ్యాపారులకు అనుకూలంగా డిసిషన్స్ తీసుకుంటూ ఝలక్ ఇస్తున్నారు. ఓ వైపు మోదీ పట్ల నమ్మకం తో వున్న జనం మాత్రం నానా ఇబ్బందులు పడుతున్నారు. కోలుకోలేని స్థితికి చేరుకున్నారు. తాజాగా ఆభరణాలు, ఆయిల్ పై పడిన సర్కార్ ఇక దేశమంతటా ఎయిర్ పోర్ట్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. వచ్చే ఐదు ఏళ్ళల్లో మరో 100 విమానాశ్రయాలు ఏర్పాటు చేయాలని, ఆ దిశగా ప్రయత్నాలు స్టార్ట్ చేసింది.
అంతే కాకుండా 1,000 కొత్త మార్గాలకు విమాన సేవలను ప్రారంభించాలని భావిస్తోంది. 2025కల్లా దేశంలో అవసరమయ్యే మౌలిక వసతులపై చర్చించేందుకు గత వారంలో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. అందులో ఈ ప్రతిపాదన వచ్చినట్లు సమాచారం. విమానాల లీజుకు ఫైనాన్స్ సమకూర్చే వ్యాపార ప్రారంభానికి సంబంధించీ చర్చ జరిగినట్లు తెలిసింది. ఆరేళ్ల కనిష్ఠానికి జారుకున్న జీడీపీ వృద్ధికి ఊతమివ్వడంతో పాటు 2025 నాటికి ఆర్థిక వ్యవస్థను 5 లక్షల కోట్ల డాలర్ల స్థాయికి చేర్చేందుకు మౌలిక ప్రాజెక్టులను రెట్టింపు చేయాలని మోదీ సర్కారు భావిస్తోంది.
వచ్చే ఐదేళ్లలో ఎయిర్‌పోర్టుల నిర్మాణానికి కేంద్రం లక్ష కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. వింటర్ సీజన్ లో భారత్‌కు విదేశీ విమాన సంస్థలు మరింత పెరుగుతాయని పౌర విమానయాన శాఖ డైరెక్టర్ జనరల్ భావిస్తోంది. గత ఏడాది ఇదే వింటర్‌లో ఈ సంస్థలు భారత్‌లోని వివిధ నగరాల నుంచి వారానికి సగటున 2,262 విమాన సర్వీసులు నడిపాయి. ఈ సంవత్సరం ఇది 3.05 శాతం పెరిగి 2,331కు చేరుతుందని అంచనా వేసింది. మొత్తం మీద ఎక్కడ పడితే అక్కడ విమానాలు ఎక్కవచ్చు అన్నమాట.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి