ఆదిత్య అదుర్స్..పాలిటిక్స్ చీర్స్

మరాఠా రాజకీయాల్లో నవ శకం ఆరంభమైంది. మహారాష్ట్ర లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఓ యువ కెరటం రాకెట్ లా దూసుకు వచ్చింది. అతడు ఎవరో కాదు కొన్ని దశాబ్డల పాటు భారత దేశ పాలిటిక్స్ ను శాసించిన మహా నేత బాల థాక్రే మనుమడు ఆదిత్య థాక్రే. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు. శివ సేన చీఫ్ గా తన తండ్రి ఉద్దవ్ థాక్రే ఉండనే ఉన్నాడు. ఏకంగా మనోడు సీఎం పదవి రేసులో నిలిచాడు. ఏ మాత్రం బీజీపీ గనుక ఒప్పుకుని వుంటే అత్యంత పిన్న వయసులో మరాఠాకు దిశా నిర్దేశం చేసే వాడు. శివ సేన యువ సేన చీఫ్ గా ఉన్నాడు. వర్లీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ముంబయిలో హిస్టరీ తో డిగ్రీ చేశాడు.

న్యాయ విద్య పూర్తి చేశాడు. 13 జూన్ 1990 లో పుట్టారు. ఆదిత్యకు అన్నీ తాత పోలికలే అబ్బాయి. పుస్తకాలు బాగా చదువుతాడు. అంతే కాకుండా పోయెమ్స్ రాస్తాడు. గేయ రచయిత కూడా. మంచి వక్త. ప్రజలకు ఏది కావాలో ఆదిత్యకు బాగా తెలుసు. తాను రాసిన కవితలతో మై థాట్స్ ఇన్ వైట్ అండ్ బ్లాక్ పేరుతో ఓ పుస్తకాన్ని రాశాడు. ఇది 2007 మార్కెట్ లోకి వచ్చింది. ఇదే సంవత్సరంలో గీత రచయితగా మారాడు ఆదిత్య థాక్రే. ప్రైవేట్ ఆల్బమ్ కూడా రిలీజ్ చేశాడు. కాగా శివ సేన పార్టీకి స్వంతంగా సామ్నా పేరుతో పత్రిక ఉంది.

ఇందులో అన్నింటికీ సంబంధించిన అంశాల వార్తలు, స్టోరీస్ ప్రచురిస్తారు. ఆల్బమ్ లో ఎనిమిది పాటలు ఉన్నాయి. 2010 లో ముంబై యూనివర్సిటీ రీడింగ్ లిస్ట్ లో ఆదిత్య రాసిన పుస్తకం చోటు చేసుకుంది. 2010  లో యువసేన చీఫ్ గా ఎన్నికయ్యాడు. 2017 లో ముంబై డిస్ట్రిక్ట్ ఫుట్ బాల్ అసోసియేషన్ కు జరిగిన ఎన్నికల్లో ఆదిత్య థాక్రే ప్రెసిడెంట్ గా గెలిచాడు. 2018 లో శివ సేన నాయకుడిగా ప్రమోషన్ వచ్చింది. ప్రస్తుతం శివ సేన రాజకీయాలన్నీ ఆదిత్య కనుసన్నలలోనే నడుస్తున్నాయి. మొత్తం మీద మరాఠా పాలిటిక్స్ లో ఈ యువ కెరటం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!