అమ్మ ఆరాటం..కొడుకు పోరాటం


ఆడియన్స్ ను గత కొన్ని రోజులుగా అలరిస్తూ వస్తున్న రియాల్టీ షో బిగ్ బాస్ కొద్దీ గంటల్లో ముగియనుంది. ఫైనల్లో ఎవరు గెలుస్తారో ననే ఉత్కంఠ నెలకొంది. హౌజ్ లో అయిదుగురు పార్టిసిపెంట్స్ మాత్రమే మిగిలారు. వీరిలో రాహుల్ సిప్లిగంజ్ డైరెక్టు గా ఫైనల్ కు వెళ్లగా మిగతా వారు ఆఖరు పోరులో నిలిచేందుకు ప్రయత్నాలు స్టార్ట్ చేశారు. వీరి కోసం వారి వారి ఫ్యాన్స్ ఓ గ్రూప్ గా ఏర్పడి సోషల్ మీడియా వేదికగా తమ వారికి ఓటు వేయమని క్యాంపెయిన్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా సింగర్ రాహుల్ మదర్ కూడా రంగం లోకి దిగింది. ప్రధాన ఫైట్‌ మాత్రం రాహుల్‌, శ్రీముఖి మధ్యలోనే ఉంది.

అభిమానులు తమ తమ ఫేవరెట్‌ కంటెస్టెంట్లకే ఓట్లు వేయండి అంటూ ప్రచారంతో  ఊపేస్తున్నారు. ఓవైపు శ్రీముఖి ‘రాములమ్మ కాంటెస్ట్‌’తో ప్రేక్షకులను తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేసింది. అది ప్రేక్షకులపై ఏపాటి ప్రభావం చూపిస్తుందో గ్రాండ్‌ ఫినాలే నాడు తేలనుంది. మరోపైపు రాహుల్‌ సిప్లిగంజ్‌ కోసం ప్రముఖ సింగర్‌ నోయెల్‌ గట్టి ప్రచారం చేస్తున్నారు. నోయల్ కు మద్దతుగా రాహుల్ తల్లి రంగంలోకి దిగింది. ఇంతకు ముందు బిగ్‌బాస్‌ హౌస్‌లోకి వచ్చిన రాహుల్‌ తల్లి ఇంటి సభ్యులతో పాటు ప్రేక్షకుల మనసులనూ గెలుచు కుంది. హౌస్‌ను వీడి వెళ్లే ముందు రాహుల్‌కు టాస్క్‌లు బాగా ఆడమని సూచించింది.

అమ్మ మాట రాహుల్‌కు టాబ్లెట్‌లా పని చేసిందేమో, తర్వాతి టాస్క్‌ల్లో తానేంటో నిరూపించుకుని టికెట్‌ టు ఫినాలే అందుకున్న ఫస్ట్‌ ఫైనలిస్టుగా నిలిచి  అమ్మ మాట నిలబెట్టుకున్నాడు. మరి ఇప్పుడు ఏకంగా బిగ్‌బాస్‌ టైటిల్‌ కావాలని ఆమె రాహుల్‌ అభిమానులను కోరుతోంది. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో పోస్ట్‌ చేసింది. రాహుల్‌ మంచితనం, నిజాయితీ, ముక్కు సూటి మాటలను మెచ్చి ఇక్కడి దాకా తీసుకొచ్చారు. మీ ప్రేమను ఓట్ల రూపంలో చూపించి రాహుల్‌ను గెలిపించమని కోరింది. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి. 

కామెంట్‌లు