గూగుల్ గుడ్ ఐడియా

ప్రపంచాన్ని శాసిస్తున్న టెక్ దిగ్గజ కంపెనీ గూగుల్ గుడ్ ఐడియాస్ ఎక్కడ ఉన్నా ఎంకరేజ్ చేస్తుంది. న్యూ ఐడియాస్ ను ప్రోత్సహిస్తుంది. ఇందు కోసం ప్రతిఏటా ప్రపంచ వ్యాప్తంగా పోటీలు నిర్వహిస్తుంది. ఇందులో తమ ఆలోచనలు పంచు కోవచ్చు. అవి సమాజానికి, మానవ సమూహానికి ఉపయోగ పడేలా ఉండాలి. అంతే కాకుండా గూగుల్ సామాజిక బాధ్యత కింద పలు సేవా కార్యక్రమాలు చేపడుతోంది. పర్యావరణం కాపాడు కునేలా జనాన్ని జాగృతం చేసే పనిలో నిమగ్నమైంది. తాజగా గూగుల్ సరికొత్త ఐడియాకు శ్రీకారం చుట్టింది. ఇప్పుడు ప్రపంచాన్ని ఆయుధాలు, అణుబాంబులు కంటే ఎక్కువగా స్మార్ట్ ఫోన్స్, ఇంటర్నెట్ తీవ్ర ప్రభావం చూఫుతున్నాయి.

దీంతో లైఫ్ లో ప్రశాంతత కరువవుతోంది. టెక్నాలజీ అందుబాటులోకి వచ్చినా దీని వల్ల మేలు కంటే ఎక్కువగా కీడే జరుగుతోంది. ఇందు కోసం ఓ ఐడియాను ఇంప్లిమెంట్ చేసింది. అదేమిటంటే ఆ ఫోన్​ నుంచి ఫోన్లు చేసుకోలేం. మెసేజ్​లు పంపించుకోలేం. వాట్సాప్​లో చాటింగ్​ చెయ్యలేం. ముచ్చట పడి ఓ సెల్ఫీ తీసుకోలేం. అదే గూగుల్​ తీసుకొస్తున్న కొత్త  పేపర్​ ఫోన్​ .ఆ మధ్య గూగుల్​ పిక్సెల్​ 4 ఫోన్​ను రిలీజ్​ చేసింది. దానిని విడుదల చేసిన కొద్ది రోజులకే ఈ పేపర్​ ఫోన్​నూ తీసుకొచ్చింది. నిజానికి ఇది ఫోన్​ కాక పోయినా, ఓ మంచి ఉద్దేశం తోనే ఈ పేపర్​ ఫోన్​ ఆలోచన చేసింది గూగుల్​. నేటి ప్రపంచం మొత్తం స్మార్ట్​ అయి పోయిన సంగతి తెలిసిందే. దాని నుంచి తప్పించేందుకే కంపెనీ ఈ ఉపాయం చేసింది.

ఓ పెద్ద పేపర్​ ముక్కను మడత పెట్టి, అందులో మన ఫోన్లలో ఉన్న ఫీచర్లను ప్రింట్​ చేయించింది. మనం ఫోన్​లో పెట్టుకునే వాల్​పేపర్​ దగ్గర్నుంచి, రోజూ మనం వాడే యాప్స్​ వరకు అన్నింటినీ పొందు పరిచింది. తమ కస్టమర్ల మంచి కోసమే ఈ ఆలోచన చేసినట్టు గూగుల్​ క్రియేటివ్​ టీం హెడ్​ తెలిపారు. గూగుల్​ ఒక్కటే కాదు, డిజిటల్​ ప్రపంచం నుంచి కాస్త ఉప శమనం కోసం చాలా కంపెనీలు, చాలా మంది ఇలాంటి కార్యక్రమాలే ప్రారంభించారు. ‘నో టెక్​ సండేస్​’ పేరిట ఓ కార్యక్రమమే నడుస్తోంది. గుడ్ ఐడియా కదూ..అవును ఒక రోజు ఫోన్ వాడకుండా వుంటే ఎంత బావుంటుందో కదూ. మనమూ ట్రై చేద్దామా. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!