రోగుల పాలిట దేవత ..ఎందరికో స్ఫూర్తి ప్రదాత
దేశంలో ఐటి రంగంలో టాప్ రేంజ్ లో కొనసాగుతున్న ప్రాంతంగా హైదరాబాద్ దూసుకు వెళుతోంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంతో పాటు లాజిస్టిక్ , హెల్త్ , ఈ కామర్స్ , టెలికాం , ఆయిల్ , ట్రాన్స్ పోర్ట్ , నిర్మాణ , రియల్ ఎస్టేట్ , తదితర రంగాలలో భారీ ఎత్తున కంపెనీలు ఏర్పాటు అయ్యాయి. దీంతో వేలాది మంది ఇక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు. ఐటి సెక్టార్ లో పనిచేస్తున్న ఎంప్లాయీస్ పెద్ద ఎత్తున వత్తిళ్లకు లోనవుతున్నారు. దీంతో ఆరోగ్యంతో పాటు మానసికంగా చితికి పోతున్నారు. తీవ్ర ఇబ్బందులకు లోనవుతున్నారు. దీంతో సోషల్ , ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్స్ కు , సైకాలజీ లో అనుభవం కలిగిన వారికి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. అంతే కాకుండా సాఫ్ట్ స్కిల్స్, బిహేవిరియల్ , టెన్షన్ ఫ్రీగా ఉండేందుకు ట్రైనర్స్ శిక్షణ ఇస్తున్నారు. కార్పొరేట్ కంపెనీలు, వివిధ సంస్థల్లో సలహాదారులుగా, పర్మినెంట్ గా పని చేస్తున్నారు. పలు వ్యక్తిగత సమస్యలతో సతమత మయ్యే వారికి స్వాంతన చేకూరుస్తున్నారు. దైనందిన జీవితంలో వత్తిళ్ల నుండి అధిగమించేందుకు ఆయా ప్రధాన హాస్పిటల్స్ లో ప్రత్యేకంగా బాధితుల కోసం సెంటర్స్ ను నెలకొల్పారు. హైదరాబాద్ లో చాలా మంది ట్రైనర్స్ వేలాద...