మీ విజయం అపురూపం ..ఎందరికో ఆదర్శం

ప్రపంచ స్థాయి విజేతలకు భాగ్యనగరం వేదికగా ..కేరాఫ్ గా మారిందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు అన్నారు. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ సాధించిన పీవీ సింధుతో పాటు పారా బ్యాడ్మింటన్ జగజ్జేతగా నిలిచిన మానసి జోషిని ప్రత్యేకంగా అభినందించారు. త్వరలో జరగ బోయే ఒలంపిక్స్ పోటీల్లోనూ పసిడి పతకాలు సాధించాలని, ఆయా రాష్ట్రాలకు పేరు తీసుకు రావాలని సీఎం కోరారు. ఈ విజయం సాధించడం ద్వారా భారత దేశ గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పారని ప్రశంసించారు. భవిష్యత్తులో జరిగే పోటీలలో సింధు పాల్గొనేందుకు కావాల్సిన ఏర్పాట్లను ప్రభుత్వమే చూసుకుంటుందని చెప్పారు.
ఇంటర్నేషనల్ లేవల్లో జరిగే క్రీడా పోటీల్లో విజేతలను తయారు చేసే వేదికగా హైదరాబాద్ మారడం తనకు ఎంతో సంతోషం కలిగిస్తోందని అన్నారు. పీవీ సింధు , ఆమె పేరెంట్స్ , కోచ్ గోపీచంద్ , తెలంగాణ బ్యాడ్మింటన్ సంఘం వైస్ ప్రెసిడెంట్ చాముండేశ్వరి నాథ్ ప్రగతి భవన్ లో కలిశారు. వీరితో పాటు మంత్రి శ్రీనివాస్ గౌడ్, క్రీడా సంస్థ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి , డిజిపి మహేందర్ రెడ్డి , పోలీస్ కమిషనర్లు అంజనీకుమార్ , సజ్జనార్ , మహేష్ భగవత్ , ఇంటెలిజెన్స్ ఐజి నవీన్ చంద్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా సింధును సీఎం సత్కరించారు. సింధు ఆట తీరు అమోఘం. ప్రపంచ విజేతగా నిలవడం చాలా కష్టం .
అయినా ఆమె దానిని సాధించింది. కష్టపడటం, శ్రమ వల్లనే ఇది సాధ్యమైంది. గోపీచంద్ మంచి శిక్షణ ఇచ్చారు. మరిన్ని విజయాలు సాధించాలని కేసీఆర్ కోరారు. అనంతరం గవర్నర్ దంపతులను వీరు కలిశారు. రాబోయే ఒలంపిక్స్ పోటీల్లో ప్రతిభ చూపిస్తారన్న నమ్మకం తనకు ఉందన్నారు. సింధుతో పాటు మానసి లు విజయం సాధించి అందరికి స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు. గవర్నర్‌ దంపతుల ఆధ్వర్యంలో సింధు, మానసి, బ్యాడ్మింటన్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌లను రాజ్‌భవన్‌లో సన్మానించారు. మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ మాట్లాడుతూ.భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

కామెంట్‌లు