రిలయన్స్ ఆన్ లైన్ లో బిజినెస్..!

భారతీయ పారిశ్రామిక రంగంలో రాకెట్ కంటే వేగంగా దూసుకుపోతున్న రిలయన్స్  గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మరోసారి షాక్ ఇచ్చేనందుకు రెడీ అవుతోంది. ఇప్పటికే దిగ్గజ ప్రత్యర్థి కంపెనీలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న ఆర్ .ఐ. ఎల్ టెలికాం, లాజిస్టిక్స్, ఈకామర్స్, డిజిటల్ , ఆయిల్, జ్యుయెలరీ రంగాలలోకి అడుగు పెట్టింది. టెలికాం రంగాన్ని సరికొత్త నిర్ణయాలతో మార్కెట్ రంగాన్ని అతలాకుతలం చేస్తోంది. ఇప్పటికే ఎయిర్ టెల్, ఐడియా, బీ ఎస్ ఎన్ ఎల్ , తదితర కంపెనీలకు చుక్కలు చూపిస్తోంది. 34 కోట్ల మంది సబ్ స్క్రైబర్స్ తో రికార్డ్ లను తిరగ రాసింది. ఇప్పుడు ఇదే సంస్థ వినోద  రంగంతో పాటు భారతీయ మార్కెట్ లో బిగ్ నెట్ వర్క్ కలిగిన కిరాణా దుకాణాలపై కన్నేసింది.

ఇంకేం ఆల్ రెడీ ఆఫ్ లైన్ లో కార్యకలాపాలు నిర్వహిస్తుండగా తాజాగా ఆన్ లైన్ లో కి ఎంటర్ అయ్యేందుకు పావులు కదుపుతోంది. వచ్చే దీపావళి పండుగ నాటికి రిలయన్స్ ఆన్ లైన్ బిజినెస్ పేరుతో రంగంలోకి దిగనుంది. ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ రిటైల్ లిమిటెడ్ తన న్యూ కామర్స్ వెంచర్ పేరుతో దేశ వ్యాప్తంగా ప్రారంభించనుంది. ఇప్పటికే దేశంలో భారీ ఎత్తున రిటైల్, డిజిటల్ స్టోర్స్ ను ఏర్పాటు చేసింది. రిటైల్ ద్వారా ఆన్ లైన్ లోకి అడుగు పెట్టబోతోంది. తయారీదారులు, ట్రేడర్లు, చిన్న వ్యాపారులు, బ్రాండ్స్ , కన్సూమర్స్ ..అందరిని ఒకే వేదికపైకి తీసుకు వచ్చేలా టెక్నలాజి ద్వారా అనుసంధానం చేయనుంది. 

రిటైల్ స్టోర్స్, సూపర్ మార్కెట్లు, హైపర్ మార్కెట్స్, హోల్ సేల్, స్పెషాలిటీ అండ్ ఆన్ లైన్ స్టోర్స్ ను ఇప్పటికే నిర్వహిస్తోంది. తన ఆన్ లైన్ కామర్స్ వెంచర్ ను రెండు దశల్లో ప్రవేశ పట్టాలని యోచిస్తోంది. వ్యాపార పరంగా టాప్ రేంజ్ లో ఉన్న ఆర్. ఐ .ఎల్ మరెన్ని సంచనాలు సృష్టిస్తుందో చూడాలి. ఈ ఆన్ లైన్ వ్యాపారం ప్రారంభిస్తే దేశంలో కోట్లాది మంది చిన్న వ్యాపారస్తుల వ్యాపారం మీద పెద్ద దెబ్బ తగలనుంది. మూడు కోట్లకు పైగా కిరాణా దుకాణాలు ఉన్నాయి. రిలయన్స్ దెబ్బకు అబ్బా అనే పరిష్టితి మాత్రం ఖాయం. డీమానిటారైజేషన్ ప్రభావంతో గ్రామీణ వ్యాపారులు తీవ్ర నష్టాలకు లోనయ్యారు. ఈ పరిస్థితుల్లో రిలయన్స్ కనుక ఎంటర్ అయితే వేలాది మందికి బతుకు దెరువు లేకుండా పోతుందన్నది వాస్తవం. 

కామెంట్‌లు