కార్తీక దీపం..బుల్లితెరపై సంచలనం..!
తెలుగు వినోదపు రంగంలో స్టార్ టీవీ రికార్డులను షేక్ చేస్తోంది. ఎప్పుడైతే స్టార్ గ్రూప్ కు ఉదయ శంకర్ సి.ఈ.ఓ గా ఎంటర్ అయ్యాడో ఇక అప్పటి నుంచి ఇండియన్ ఎంటర్ టైన్మెంట్ రంగమే కాదు డిజిటల్ మీడియా రంగంలో పెను సంచనాలు సృష్టించేలా చేశాడు. ఆసియా ఖండంలో దుమ్ము రేపుతున్న స్టార్ టీవీ ఇప్పుడు ఇండియాను తిప్పేస్తోంది. బుల్లి తెరను స్టార్ టీవీ వాడుకున్నంతగా ఏ టీవీ వాడు కోవడం లేదంటే అతిశయోక్తి కాదు. ఇప్పుడు సగటు బుల్లితెర ప్రేక్షకులు అంతా స్టార్ చేజిక్కించుకున్న మాటీవీని విడిచి ఉండలేక పోతున్నారు. డిఫరెంట్ ప్రోగ్రామ్స్ రూపొందిస్తూ తెలుగు వినోద రంగాన్ని కొత్త పుంతలు తొక్కిస్తోంది స్టార్ మా. ఓ వైపు మా టివి ఇంకో వైపు హాట్ స్టార్ ..ఓహ్ ..ఉదయ్ శంకర్ సత్తా ఏమిటో ఈ పాటికే తెలిసింది.
మిగతా టీవీ యాజమాన్యాలకు. తెలుగు మీడియా న్యూస్ ఛానల్స్ సైతం మా టీవీ దెబ్బకు అక్కినేని నాగార్జున హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ లో ఏం జరుగుతోంది అంటూ ప్రత్యేక కథనాలు ప్రసారం చేస్తున్నాయి. అంటే దాని స్టామినా ఏపాటిదో ఈపాటికే అర్థమై ఉంటుంది. ఇక ఇప్పుడు తెలుగు సీరియల్స్ లలో మిగతా ఛానల్స్ ను వెనక్కి నెట్టేసింది స్టార్ మా టీవీ. ఉదయం నుంచి రాత్రి దాకా సీరియల్స్, సినిమాలు, మ్యూజిక్ ..స్పోర్ట్స్ ఇలా ప్రతి రంగాన్ని ఓన్ చేసుకుంటోంది. స్టార్ మా లో ప్రసారమవుతున్న సీరియల్స్ దుమ్ము రేపుతున్నాయి. రేటింగ్స్ లో దూసుకు పోతున్నాయి . ఎక్కడ చూసినా , ఎక్కడికివెళ్ళినా కార్తీక దీపం గురించిన చర్చ. చిన్నారుల దగ్గరి నుంచి పెద్దలు, మగవాళ్ళు కూడా ఈ సీరియల్ ను చూడకుండా ఉండలేక పోతున్నారు.
ఈ సీరియల్ లో నటించి వారంతా ఇప్పుడు సినిమా నటీనటులకు ఉన్నంత క్రేజ్ సంపాదించుకున్నారు. తెలుగు బుల్లితెరపై కార్తీక దీపం స్టార్ మాకు యెనలేని ఆదాయాన్ని సమకూర్చి పెడుతోంది. ప్రతి సోమవారం నుండి శనివారం వరకు రాత్రి 7:30 గంటలకు ప్రసారం అవుతుండగా , హాట్‌స్టార్‌లో కూడా చూసేలా స్టార్ టీవీ ఏర్పాటు చేసింది. ప్రదర్శన ప్రారంభమైనప్పటి నుండి రేటింగ్స్ చార్టులో స్థిరంగా అగ్రస్థానంలో ఉంది. ఈ సీరియల్ మలయాళం లో ప్రసారం అవుతున్న కరుతముతూ సీరియల్ కు రీమేక్. అక్కడ ఆసియానెట్ ఛానల్ లో ప్రసారం అవుతోంది. .ముదురు రంగు చర్మం గల, స్వచ్ఛమైన హృదయ పూర్వక అమ్మాయి ప్రేమి విశ్వనాధ్ నటించిన దీపా పాత్ర జీవితం చుట్టూ ఈ కథ తిరుగుతుంది.
నల్లటి చర్మం రంగు కారణంగా అనేక పరీక్షలు, కష్టాలను ఎదుర్కొంటుంది. ఆమె నిరుపమ్డా నటించిన డాక్టర్ కార్తిక్ ను వివాహం చేసుకుంటుంది, ప్రతి పరిస్థితుల్లోనూ ప్రేమ, నమ్మకం ,మద్దతుపై విశ్వాసం కలిగిస్తుంది. ఇక సీరియల్ పరంగా చూస్తే , మౌనితగా షోబా శెట్టి, సౌందర్యగా అర్చన అనంత్వి, హారీగా వేణు గోపాల్ , తులసీగా , సీతా మహాలక్ష్మి, ఆదిత్యగా యశ్వంత్, శ్రావ్యగా సంగీత కామత్, సౌర్యగా బేబీ కృతిక, హిమాగా బేబీ సహ్రుదా, దుర్గా ప్రసాద్ పాత్రలో నరసింహరెడ్డి, శ్రీలతగా యశ్వి కనకాల, భాగ్యలక్ష్మిగా ఉమదేవి నటిస్తున్నారు. ఈ సీరియల్ 2017 అక్టోబర్ 16 న ప్రారంభమైంది. ఇప్పుడు ఎక్కడ చూసినా కార్తీక దీపమే కనిపిస్తోంది, వినిపిస్తోంది. చిత్రం కదూ.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి