లోకపు వాకిట నెత్తుటి సంతకం ..పాట..!
మనసు మూగదై పోయినప్పుడు దానికి స్వాంతన చేకూర్చే సాధనాల్లో టానిక్ లాగా పని చేసేది, తక్షణమే రిలీఫ్ ఇచ్చేది ఏదైనా ఉంది అంటే అది ఒక్కటే పాట. ఈ లోకంలో సకల జీవరాశులతో పాటు మానవ జాతి కూడా ఎప్పుడో ఒకప్పుడు పాడడం రాక పోయినా కనీసం కూని రాగమైనా తీసి ఉంటారు. అడవుల్లో , పచ్చని ప్రకృతి ఒడిలో ఉన్నప్పుడు, జంతువులు కూడా ఆనందానికి లోనైనప్పుడు ఆడుతాయి..ఒక్కోసారి అరుస్తాయి కూడా. భూమి పొరల్లో ఇంకి పోయిన ప్రతిది కూడా ఈ ప్రపంచానికి పనికి వస్తుంది. ఒక్క మానవ దేహం తప్ప. అందుకే ఏనాడో సామాజిక సంస్కర్త పోతులూరి వీరబ్రహ్మం చెప్పారు. చిల్లర రాళ్లకు మొక్కడం కంటే చిత్తం మీద మనసు పెట్టు అని బతుకు మర్మం..తత్వాన్ని అర్థమయ్యేలా..జనం భాషలో చెప్పారు. తోలు బొమ్మలాటలైనా , చివరకు నాటకమైనా ..ఏదైనా పాట పరిధిలోకి రావాల్సిందే. తాజాగా బెంగాల్ కు చెందిన యాచకురాలు పాడిన పాట వైరల్ అయ్యింది.
ఆమెను తక్కువ చేయడం లేదు..కానీ ప్రపంచానికే పోరాటాలతో కొత్త పాఠాలు నేర్పిన తెలంగాణాలో ఎక్కడికి వెళ్లినా గాయకులు , పాటగాళ్లు వందల కొద్దీ కనిపిస్తారు. వారు నిజమైన మట్టి బిడ్డలు. వాళ్ళ గొంతుల్లో మాధుర్యం ఉండక పోవొచ్చు. కానీ గుండెల్లో గూడు కట్టుకు పోయిన దుఃఖాన్ని పాటల్లోకి ఒలికించే ప్రయత్నం ఉందే, అది ఎంత దాకా తీసుకు వెళుతుంది అంటే ఇక ఈ జీవితం ఇంతటితో ఆగి పోతే బావుండు అన్నంతగా, మనల్ని మైమరిచి పోయేలా చేస్తారు. వేలాది మంది కళాకారులు చిరునామా లేకుండా పోయారు. ఈ పోరాటపు గడ్డ మీద ప్రతి చోటా దట్టించిన బందూకులు లాంటి వీరులున్నారు. అమరత్వాన్ని దోసిళ్ళలోకి తీసుకుని, గొంతును మట్టిగా మార్చుకుని జనం కోసం పాడుతున్న వారు ఎందరో. వీరంతా చెట్టుకొకరు గా వీడి పోయారు. ప్రపంచీకరణ ప్రభావం దెబ్బకు అసలైన గొంతులు పాటలు అల్లడం లేదు.
బతుకు బరువై పోయిన చోట పాటలు ఉండవా , చీకటి రోజుల్లో , చీకట్లో , నిర్బంధపు పహారా నీడను దాటుకుని ఎన్ని గొంతులు గానం చేస్తున్నవో ఎవరికి ఎరుక. అందుకే అడవులు చల్లంగా ఉన్నవి. మట్టి బిడ్డల ఆర్తనాదాలు ఇప్పుడు పచ్చని అడవితల్లి కోసం గానం చేస్తున్నవి. నేను పచ్చని చెట్టునంటూ , నేను మట్టిలోంచి వచ్చిన ..దానిలోకే వెళ్ళిపోతానంటూ పాడుకుంటూ , కంజీర నాదం మోగించుకుంటూ సాగిపోతున్నారు. నల్లమల పేరు తలుచుకుంటే చాలు ఆ అడవి బిడ్డల గొంతులు కంకులై విచ్చుకున్నట్లు పాడుతూ ఉంటే ఆ కొండలు, ఆ గుట్టలు , ఆ సెలయేరు అంతా ఒక్కటయ్యేనా అన్నట్లు అనిపించేది. పాటంటే రక్త మాంసాలు కలిసిన మనిషి చరిత్ర కాదు . అది కోట్లాది జన సమూహపు ఆర్త నాదం. ఊపిరి ఆగిపోతుంటే ..గుండె కొట్టుకోవడం ఆగి పోతున్నట్టు అనిపిస్తుంటే ..చుట్టూ రణగొణధ్వనులు వినిపిస్తూ వుంటే పాట ఆయుధమై అల్లుకు పోతుంది.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి