వెంటాడే జ్ఞాపకం..పూసిన మందారం..!

పిచ్చి వాళ్ళను చూడాలని ఉందా..? అయితే ఎక్కడికో వెళ్లాల్సిన పని లేదు. ఇక్కడే సినిమా రంగం ఉందిగా . అక్కడ చదువుతో పని లేదు. కావాల్సినంత సరుకుంటే చాలు. మీకు మీపై నమ్మకం, క్రియేటివిటీ  ఉంటే చాలు. లెక్కలేనన్ని అవకాశాలు తలుపు తడుతాయి. టెక్నాలజీ పుణ్యమా , డిజిటల్ మీడియా రంగం వచ్చాక సీన్ మారింది. ఇక్కడ ఒక్కరిదే రాజ్యం కాదు..అందరీదీనూ. ఎవరికి వారే కింగ్ లు . తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వెలిబుచ్చే ఛాన్స్ ఉంటోంది. ప్రతి రంగంలో ఉన్నట్లే ఇక్కడ కూడా హీరోయిన్లు, ఇతర పాత్రల్లో నటించే మహిళలు వివక్ష ఎదుర్కుంటున్నారన్న విమర్శలున్నాయి. తన వారు సినీ రంగంలో ఉన్నప్పటికీ తనకంటూ ఓ ఇమేజ్ ను స్వంతం చేసుకుంది . 

వరలక్ష్మి శరత్ కుమార్. ఆమెకు ఇప్పుడు 34 ఏళ్ళు . ఏ విషయమైనా కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడటం అలవాటు. కన్నడ, తమిళ్, మలయాళం లలో నటిస్తున్నారు. అందరి కంటే ఎక్కువగా ఆమె సామాజిక మాధ్యమాలలో చురుకుగా ఉంటారు. ట్విట్టర్ లో , ఇంస్టా గ్రామ్ లో వరలక్ష్మికి ఫాలోయింగ్ ఎక్కువ. నటిగా , డ్యాన్సర్ గా ..జంతు ప్రేమికురాలు, ఫెమినిస్ట్. సేవ చేసేందుకు స్వంతంగా సేవ్ శక్తి ని ఏర్పాటు చేశారు. మైక్రోబయోలజీలో డిగ్రీ , ఎడిన్ బర్గ్ లో ఎంబీఏ చదివారు. ముంబైలోని అనుపమ్ ఖేర్ యాక్టింగ్ ఇన్సిట్యూట్ లో శిక్షణ పొందారు. విగ్నేష్ శివన్ దర్శకత్వం లో పోడా పొడి సినిమాలో మొదటి సారిగా నటించారు వరలక్ష్మి శివకుమార్. 

రిడీఫ్ ఆమె నటనకు అవార్డు ఇచ్చింది. కన్నడలో మాణిక్య మూవీలో నటించారు..మెప్పించారు. ప్రముఖ సినీ దర్శకుడు బాల డైరెక్షన్ లో తమిళ్ లో తీసిన తారై తప్పత్తయి సినిమాలో నటించారు. ఈ సినిమా కోసం ఆమె తన బరువును తగ్గించుకున్నారు. 2016 లో మమ్ముట్టితో కలిసి కసభ సినిమాలో చేశారు. కొందరు ప్రొడ్యూజర్స్ వ్యవహార శైలి నచ్చలేదంటూ అప్పా మూవీ నుంచి తప్పుకున్నారు. సినీ నటిగా ఉంటూనే బుల్లి తెరపై -ఉన్నాయి అరిందాల్ - ప్రోగ్రాం కు హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఇది జయ టీవీలో ప్రసారమవుతోంది. విజయ్ సర్కార్ సినిమాలో వరలక్ష్మి అద్భుతంగా నటించారు. ఆమె నటినే కాదు..స్త్రీ పక్షపాతి కూడా. ఇలాంటి వాళ్ళే కావాలి కదూ. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!