వారేవా..తలైవా

తమిళుల ఆరాధ్య దైవంగా భావించే అరుదైన నటుడు రజనీకాంత్ నటించిన దర్బార్ ఊహించని రీతిలో కలెక్షన్లు కొల్లగొడుతోంది. పాన్ ఇండియన్ డైరక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ విడుదలైన అన్ని చోట్లా పాజిటివ్ టాక్ ను మూటగట్టుకుంది. ఏకంగా ఈ సినిమా అంచనాలకు మించి 200 కోట్ల క్లబ్ లో చేరింది. ఇప్పటికే సంక్రాంతి పండుగ సందర్బంగా తెలుగులో దర్బార్, అల వైకుంఠపురం లో, సరిలేరు నీకెవ్వరూ, ఎంత మంచి వాడవురా సినిమాలు విడుదలయ్యాయి. ఇవ్వన్నీ సక్సెస్ ఫుల్ గా నడుస్తున్నాయి. ఇదిలా ఉండగా రజనీకాంత్ దర్బార్ భారీ కలెక్షన్లను కొల్లగొడుతోంది. దర్బార్ కలెక్షన్ల సునామీతో మరో రికార్డు సొంతం చేసుకుంది. విడుదలైన పదకొండు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా దర్బార్ అతధిక వసూళ్లు రాబట్టిందని ప్రముఖ ట్రేడ్ విశ్లేషకుడు త్రినాథ్ వెల్లడించారు. దీంతోపాటు ప్రపంచ వ్యాప్తంగా భారీగా వసూళ్లు రాబట్టిన రజనీకాంత్ ఐదో సినిమా ‘దర్బార్’ కావడం విశేషం. గతంలో తలైవా నటించిన ఎంతిరాన్, కబాలి, రోబో 2.ఓ, పేటా చిత్రాలు కూడా ప్రపంచ వ్యాప్తంగా 200 కోట్ల కలెక్షన్లను సాధించాయి. కాగా ఈ భారీ కలెక్షన్లలో అధిక భాగం తమిళనాడు నుంచి సుమారు 80 కోట్లు వచ్చాయి....