బైజూస్‌లో గ్లోబల్ భరోసా

ఇండియన్ అంకురాలు భారీ ఎత్తున పెట్టుబడులు ఆకర్షితున్నాయి. ఇప్పటికే చాలా స్టార్ట్ అప్స్ కోట్లు కొల్లగొట్టాయి. తాజాగా ఇండియాకు చెందిన బైజూ సరికొత్త రికార్డ్ సృష్టించింది. ఏకంగా 4 కోట్ల రికార్డు డౌన్‌లోడ్లతో దూసుకు పోతున్న ఆన్‌లైన్‌ లెర్నింగ్‌ ప్లాట్‌ఫామ్‌ బైజూస్‌ తాజాగా భారీ పెట్టుబడులను సాధించింది. న్యూయార్క్ కేంద్రంగా ఉన్న హెడ్జ్ ఫండ్ సంస్థ టైగర్ గ్లోబల్  నుంచి 200 డాలర్లను పెట్టుబడులను కొట్టేసింది. ఈ విషయాన్ని స్వయంగా  ఆన్ లైన్ లెర్నింగ్ యాప్ బైజూస్ వ్యవస్థాపకుడు సీఈవో రవీంద్రన్  ప్రకటించారు. దీంతో బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న బైజూస్‌ వాల్యూ 8 బిలియన్ల డాలర్లు మించి పోతుందని మార్కెట్‌ విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో  2015 లో స్థాపించబడిన బైజూస్ భారతదేశంలో మూడవ అత్యంత విలువైన స్టార్టప్‌గా అవతరించింది.

టైగర్ గ్లోబల్ మేనేజ్‌మెంట్ వంటి బలమైన పెట్టుబడిదారుడితో భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉందని బైజూస్‌ సీఈవో తెలిపారు. విద్యార్థులు నేర్చుకునే విధానంలో పలు మార్పులు తీసుకు రావాలన్న తమ దీర్ఘకాలిక దృష్టికి, ఆవిష్కరణలకు మరో అడుగు ముందుకు పడినట్టు తెలిపారు. టైర్ 2, 3 నగరాల్లో అభ్యాసకులకు అందుబాటులో ఉండేలా మాతృభాషలో తమ ప్రోగ్రామ్‌లను ప్రారంభించటానికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. అంతేకాదు రాబోయే నెలల్లో ఆన్‌లైన్  పాఠాల కోసం ఒక స్టార్ట్అప్‌ను ప్రారంభించనున్నట్టు వెల్లడించారు. గత 12 నెలల్లో, గ్రామీణ, పట్టణాల్లో 42 మిలియన్ల రిజిస్టర్డ్ యూజర్లు, 3 మిలియన్ల చెల్లింపు చందాదారులు తమ యాప్‌లో ఉన్నారని పేర్కొన్నారు.

అలాగే సంస్థ ప్రకారం, ఒక విద్యార్థి అనువర్తనంలో గడిపే సగటు నిమిషాల సంఖ్య గత సంవత్సరంతో పోలిస్తే రోజుకు 64 నిమిషాల నుండి 71 నిమిషాలకు పెరిగింది. వార్షిక  సభ్యత్వాల రెన్యూవల్‌ రేట్లు 85 శాతం పుంజుకుంది. మరోవైపు భారతదేశంలో మిలియన్ల మంది పాఠశాల విద్యార్థుల మన్ననలు పొందుతూ,  విద్య, సాంకేతిక రంగంలో అగ్రగామిగా ఉన్న బైజూస్‌ బృందానికి మద్దతు ఇవ్వడం సంతోషంగా ఉందని టైగర్ గ్లోబల్ భాగస్వామి స్కాట్ ష్లీఫర్ తెలిపారు. మొత్తం మీద బైజూస్ ఇప్పుడు ఓ సంచలనం. ఏదైనా డిఫరెంట్ గా ఆలోచించడమే కాదు అది ఆచరణలో చేసి చూపిస్తే కోట్లు పోగేసు కోవడం పెద్ద కష్టమేమీ కాదన్నమాట. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!