ఆప్ నిలిచేనా..కమలం వికసించేనా
నిన్నటి దాకా చక్రం తిప్పి మరాఠాలో బోల్తా పడిన ప్రధాని మోదీజీ, హోమ్ శాఖా మంత్రి అమిత్ చంద్ర శాలు దేశ రాజధానిలో ఈసారి ఎలాగైనా సరే పాగా వేయాలని డిసైడ్ అయ్యారు. దీంతో ఎప్పుడూ లేనంతగా ఢిల్లీలో రాజకీయాలు మరింత వేడి పుట్టిస్తున్నాయి. అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రస్తుతం అధికారంలో ఉన్నది. అది కూడా అత్యంత గడ్డు పరిస్థితిని ఎదుర్కుంటోంది. ఈసారి బీజేపీ, కాంగ్రెస్, ఆప్ పార్టీలో పవర్ కోసం ఎన్నికల బరిలో ఆటో ఇటో తేల్చుకునేందుకు అస్త్రాలు సిద్ధం చేసుకున్నాయి. ఇప్పటికే ఆప్ అందరికంటే ముందంజలో ఉందనే చెప్పాలి. ఇంకో వైపు పౌరసత్వ సవరణ చట్టం పై ఢిల్లీ వాసులు భగ్గుమంటున్నారు. తాజాగా జేఎన్ యు లో స్టూడెంట్స్ పై దాడులు దేశమంతటా నిరసనలు, ఆందోళనలు మిన్నంటాయి.
ఇదంతా కావాలనే బీజేపీ దాని అనుబంధ సంస్థలు చేపట్టాయంటూ స్టూడెంట్స్ యూనియన్స్ ఆరోపించాయి. అయితే ఇప్పుడు ఎవరు హస్తినలో పాగా వేస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. దేశ రాజకీయ పటంలోని ప్రధానమైన మూడు పార్టీలు నువ్వా-నేనా అనే విధంగా ఈ ఎన్నికల్లో తలపడుతున్నాయి. ఈ పోరులో విజయం కోసం నేతలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఎన్నడూ లేని విధంగా బీజేపీలో ఈసారి ఓ కొత్త చర్చ తెరపైకి వచ్చింది. ఒకవేళ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తే సీఎం పదవి ఎవరిని వరిస్తుందనే దానిపై పెద్ద ఎత్తున చర్చలు సాగుతున్నాయి. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ సీఎం అభ్యర్థిపై కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
ఆప్ కన్వీనర్, సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ఎదుర్కొనే ధైర్యం, తెగువ ప్రధాని నరేంద్ర మోదీకి మాత్రమే ఉందన్నారు. ఎన్నికల ప్రచారంలో మోదీ ప్రముఖ పాత్ర పోషిస్తారని, ఆయన బలంతోనే ఢిల్లీలో విజయం సాధించి తీరుతామని మంత్రి అభిప్రాయపడ్డారు. అయితే గతంలో మాదిరిగా సీఎం అభ్యర్థిని ముందే ప్రకటించట్లేదని అన్నారు. ఎన్నికల ఎత్తుగడలో భాగంగానే ఇలాంటి సరికొత్త వ్యూహాలు రచిస్తున్నట్లు తెలిపారు. సీఎం అభ్యర్థి విషయంలో పలు రాష్ట్రాల్లో విభిన్న పరిస్థితులను ఎదుర్కొక తప్పదని పేర్కొన్నారు. పార్టీకి కట్టుబడి, విజయం కోసం నిబద్ధతతో పనిచేసే వారినే సీఎం పదవి వరిస్తుందని వ్యాఖ్యానించారు. కాగా 2008 ఎన్నికల్లో వీకే మల్హోత్రా, 2013 హర్ష వర్థన్, 2015 మధ్యంతర ఎన్నికల్లో మాజీ ఐపీఎస్ అధికారిని కిరణ్‌బేడీని బీజేపీ సీఎం అభ్యర్థిగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఆ ప్రయత్నాలేవీ ఫలించలేదు.
దీంతో దాదాపు రెండు దశాబ్దాలకు పైగా కమళనాధులు హస్తినలో అధికారానికి దూరంగా ఉండక తప్పడంలేదు. సరికొత్త ఎత్తుగడలతో, మోదీ మేనియాతో ఈసారి అధికారం కైవసం చేసుకోవాలని కట్టుదిట్టమైన వ్యూహాలు రచిస్తున్నారు. అయితే సీఎం అభ్యర్థిగా ఎంపీ మనోజ్ తివారీ పేరు మాత్రం బలంగా వినిపిస్తోంది. కాగా విజయమే లక్ష్యంగా సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇది వరకే ప్రచారంలో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. అవినీతి రహిత సమాజమే లక్ష్యంగా రాజకీయాల్లోకి అడుగు పెట్టిన అరవింద్ కేజ్రీవాల్ ఎదుర్కొన్న తొలి ఎన్నికల్లోనే సంచలనం సృష్టించారు. 2015లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 70 స్థానాలకు గాను ఏకంగా 67 స్థానాల్లో విజయం సాధించి చరిత్రలో నిలిచారు.
అంతకు ముందు ఏక ధాటిగా 15 ఏళ్లు అధికారంలో ఉన్న గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ కనీసం ఒక్క స్థానం కూడా గెలవలేక పోయింది. ఈసారి మాత్రం మెజార్టీ స్థానాలే లక్ష్యంగా ఆ పార్టీ పని చేస్తోంది. సీనియర్ నేత అజయ్‌మాకెన్ ముందుండి పార్టీ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. అయితే బీజేపీ ఎంచుకున్న వ్యూహాన్ని కాంగ్రెస్ కూడా అనుసరించే అవకాశం ఉంది. పోలింగ్‌కు ముందే సీఎం అభ్యర్థిని ప్రకటించే అవకాశాలు ఏమాత్రం కనిపించడం లేదు. దీనిపై కాంగ్రెస్ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. మొత్తం మీద హస్తిన మాత్రం ఎవరి స్వంతం అవుతుందో వేచి చూడాలి.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి