పూరీ..పడి లేచిన కెరటం

తెలుగు సినిమా రంగంలో అతడో సునామి. ఎవడి బతుకు వాడే బతకాలన్న ఫిలాసఫీ. అతడో ట్రెండ్ సెట్టర్. భావుకుడు. రచయిత. ఫిలాసఫర్ అన్నిటికంటే ఎలాంటి కల్మషం లేని వ్యక్తి. అతడే దమ్మున్న డైరెక్టర్ పూరీ జగన్నాథ్. రామ్ గోపాల్ వర్మ టీమ్ లో ఒకడు. గుండెల్లో గునపాలు దించినట్టు ఉంటాయి అతడి డైలాగ్స్. పూరి అంటేనే ఓ బ్రాండ్. ఓ సెన్సేషన్. తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ ను స్వంతం చేసుకున్న ఆయన టాప్ పొజిషన్ కు చేరుకున్నారు. అనుకోని పరిస్థితుల్లో కిందకు జారారు. సంపాదించుకున్న కోట్లాది రూపాయలు పోగొట్టుకున్నాడు. ఒకానొక సమయంలో తాను ఒంటరివాడై పోయాడు. కానీ కష్ట కాలంలో ఏ మాత్రం ధైర్యం కోల్పోలేదు. అన్నీ కోల్పోయినా ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. ఇస్మార్ట్ శంకర్ సినిమా తీసి మరో బ్లాక్ బ్లస్టర్ మూవీతో తిరిగి తన పవర్ ఏమిటో రుచి చూపించాడు. స్మూత్ కేరక్టర్ కే పరిమితమై పోయిన రామ్ పోతినేనిని ఈ సినిమాలో డిఫరెంట్ గా పూర్తి భిన్నంగా చూపించాడు. పూరీ అంటేనే మినిమమ్ గ్యారెంటీ వున్న డైరెక్టర్ గా పేరుంది. ఆయన తీసిన ప్రతి సినిమాలో హీరో కు ఓ స్పెషాలిటీ ఉంటుంది. అంతకంటే ఎక్కువగా ఐడెంటిటీ ఉంటుంది. మూస ధోరణితో సాగుతున్న టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ తో త...