రిలయన్స్ సరుకులు ఇక దుకాణాల్లో..!

రిలయన్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మరో కొత్త ఇండియాకు శ్రీకారం చుట్టింది . ఇప్పటికే తన వ్యాపార సామ్రాజ్యాన్ని మరింత విస్తరించుకుంటూ వెళుతున్నారు. ఆయిల్ , టెలికాం , రిటైల్ , ఈ కామర్స్ , డిజిటల్ టెక్నాలజీ , ఇలా ప్రతి రంగంలో తనదైన ముద్రతో ..ఇతర కంపెనీలకు చుక్కలు చూపిస్తోంది. ట్రెండ్స్ ద్వారా దుస్తులు ..కిడ్స్ వస్తువులు ..ఇలా ప్రతి ఒక్కటి అందుబాటులో ఉంచుతోంది . రిలయన్స్ ఇప్పటికే రిలయన్స్ డిజిటల్ పేరుతో ఎలక్ట్రానిక్స్ పరికరాలు, వస్తువులను విక్రయిస్తోంది . ఇందులో ప్రతి ఇంటికి కావలసిన వస్తువులన్నీ ఇందులో లభించేలా రిలయన్స్ గ్రూప్ పక్కాగా ప్లాన్ చేసింది . అందరికంటే భిన్నంగా వెళుతోంది . టెలికం రంగంలో ఇప్పటికే నంబర్ వన్ పొజిషన్ లో ఉంది . ఆసియా లో అత్యంత ధనవంతుడిగా పేరున్న ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ..తన కంపెనీ కి చెందిన సరుకులను ఇప్పటి దాకా తన రిటైల్ స్టోర్స్ లలోనే అమ్మేవారు . ఇప్పుడు తన మార్కెట్ స్ట్రాటజీని మార్చుకుంది ఈ కంపెనీ . ఆయా సరుకులను ఇండియాలోని కిరాణా దుకాణాల్లో విక్రయించాలని నిర్ణయం తీసుకుంది. ఇప్పటి దాకా రిలయన్స్ స్మార్ట్ , ఫ్రెష్ , మార్కెట్ స్టోర్స్ లలో మాత్రమే లభిస్తున...