కత్తుల కరచాలనం - ప్రపంచం విస్మయం..చిన్నన్నతో పెద్దన్న..!

ప్రపంచాన్ని ఒంటి చేత్తో శాసిస్తున్న అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ మొదటిసారిగా ఉత్తర కొరియా మైదానంలోకి అడుగు పెట్టారు. అత్యంత భారీ కట్టుదిట్టమైన భద్రత నడుమ ఆయన కాలు మోపారు. ఇప్పటికే యుద్ధ వాతావరణం నెలకొన్న ప్రస్తుత తరుణంలో ట్రంప్ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రపంచ వ్యాప్తంగా ఆయన టూర్ ..వైరల్‌గా మారింది. తొలి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌గా ఓ రికార్డు కూడా సృష్టించారు. ఒకరిపై మరొకరు కారాలు మిరియాలు నూరుతున్నారు. నార్త్ కొరియా ప్రెసిడెంట్ కిమ్‌తో కరచాలనం చేశారు. వాషింగ్టన్ కు రావాలని ట్రంప్ కోరారు. ఇద్దరు చిరునవ్వులు చిందించారు. చిలుక పలుకులు పలికారు. నిన్నటి దాకా వీరిద్దరు తీవ్ర ఆరోపణలు చేసుకున్నారు. ఒకానొక దశలో ట్రంప్ దాడులు చేస్తానని, దేశాన్ని తుద ముట్టిస్తానని బీరాలు పలికాడు. ఒకే ఒక్క హెచ్చరికతో మిన్నకుండి పోయారు. నీవు దాడి చేసిన క్షణమే నీ అమెరికా ప్రపంచ పటంలో ఉండదని కిమ్ చెప్పేశాడు. నీదగ్గర ఉన్న ఆయుధాల కంటే రెట్టింపు అణ్వాయుధాలు నా దగ్గర ఉన్నాయంటూ కిమ్ చెప్పేసరికల్లా ..యుఎస్ ప్రెసిడెంట్ మౌనం దాల్చారు. ఈ సమయంలో ట్రంప్...