పోస్ట్‌లు

మార్చి, 2020లోని పోస్ట్‌లను చూపుతోంది

సినీ కార్మికుల కోసం భారీ సాయం

చిత్రం
క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారి దెబ్బ‌కు తెలుగు సినిమా రంగం తీవ్ర ఒడిదుడుల‌కు లోనైంది. ఎక్కువ మంది కార్మికులు ఈ ప‌రిశ్ర‌మ‌నే న‌మ్మ‌కున్నారు. రెక్కాడితే కానీ డొక్కాడ‌ని కార్మికులు వేలాది మంది ఉన్నారు. తెర‌పై కొంద‌రు మాత్ర‌మే హీరోలుగా చెలామ‌ణి అవుతుండ‌గా మిగ‌తా కార్మికులంతా తెర వెన‌కే ఉండి పోతున్నారు. వీరి సంక్షేమం కోసం గ‌తంలో దివంగ‌త న‌టుడు, ద‌ర్శ‌కుడు ప్ర‌భాక‌ర్ రెడ్డి ఎంత‌గానో కృషి చేశారు. ప్ర‌స్తుతం మా మూవీస్ అసోసియేష‌న్ ప‌ని చేస్తోంది. దీనికి ప్ర‌ముఖ న‌టుడు చిరంజీవి గౌర‌వ అధ్య‌క్షుడిగా ఉన్నారు. వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ గా న‌టుడు న‌రేష్ కొన‌సాగుతున్నారు. తాజాగా క‌రోనా ఎఫెక్ట్ భారీగా ఉండ‌డంతో ఉన్న ప‌ళంగా సినిమా షూటింగ్స్ ల‌ను బంద్ చేశారు. దీంతో కార్మికులు రోడ్డున ప‌డ్డారు. ఏడాది పొడ‌వునా ఏదో ఒక సినిమా న‌డుస్తూ ఉండ‌డంతో దీనినే న‌మ్ముకుని బ‌తుకులీడుస్తున్న వారంతా దిక్కు తోచ‌ని స్థితిలోకి నెట్ట‌బ‌డ్డారు. క‌రోనా వైర‌స్ మ‌హమ్మారి నుంచి దేశాన్ని కాపాడాలంటూ భార‌త‌దేశ ప్ర‌ధాన‌మంత్రి మోదీజీ ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు. ఈ ఆప‌త్కాల స‌మ‌యంలో కోట్లాది మందికి వైద్య ప‌రీక్ష‌లు చేయ‌డం, మందులు స‌ర‌ఫ‌రా, ప్రాథ...

స‌మున్న‌త భార‌తావ‌నికి స‌లాం

చిత్రం
ప్ర‌పంచం క‌రోనా వైర‌స్ దెబ్బ‌కు విల‌విల‌లాడుతోంది. అందుకు ఇండియా మిన‌హాయింపు ఏమీ కాదు. కాబోదు కూడా. ఎందుకంటే అదే లోకంలో మ‌నం కూడా భాగ‌స్తుల‌మే. కాద‌న‌లేం. ప్ర‌స్తుత సంద‌ర్భం ఏమిటంటే నిన్న‌టి దాకా ఈ దేశంలో ఉండి..ఇక్క‌డి గాలి పీల్చి..ఇక్క‌డి వ‌న‌రుల‌ను వాడుకుని..ఉద్యోగం పేరుతో..సంపాదించే నెపంతో ఇత‌ర దేశాల‌కు వెళ్లిన వాళ్లు ఇపుడు త‌ల‌దించు కోవాల్సిన దుస్థితి. కాలం మార‌దు..అది కొన్ని త‌రాలుగా, ద‌శాబ్ధాలుగా త‌న దారిన వెళుతూనే ఉన్న‌ది. అందులో భాగమే ఈ సంచారం..ప్ర‌కృతి ప్ర‌కోపం. జీవ‌న విధ్వంసం జ‌రుగుతూనే ఉన్న‌ది. కోట్లాది మంది ప్ర‌జ‌లు ఆక‌లి కేక‌ల‌తో అల్లాడుతున్నారు. టెక్నాల‌జీ పేరుతో స‌రిహ‌ద్దులు దాటి అదే ప్ర‌పంచం అనుకుని విర్ర‌వీగుతూ..త‌మ కంటే గొప్ప వాళ్లు ఎవ‌రూ లేర‌ని భ్ర‌మ‌ల్లో బ‌తుకుతున్న ప్ర‌వాస భార‌తీయులు ఇపుడు పున‌రాలోచ‌న‌లో ప‌డ్డారు. ఈ ప్ర‌పంచాన్ని తన క‌నుస‌న్న‌ల‌లో ఉంచుకుని శాసిస్తూ వ‌చ్చిన అగ్ర‌రాజ్యం అమెరికా ఇపుడు క‌రోనా వైర‌స్ అనే కంటికి క‌నిపించ‌ని దానిని ఎలా ఎదుర్కోవాలో తెలియ‌క త‌ల్ల‌డిల్లుతోంది. ఒక ర‌కంగా తాను చెప్పిందే వేదం..తాను గీసిందే శాస‌నం అంటూ బీరాలు ప‌లికిన ఈ దేశం ...

ఆర్థిక రంగం అస్త‌వ్య‌స్తం

చిత్రం
భార‌త దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ ఇపుడు న‌డిసంద్రంలో కొట్టుమిట్టాడుతోంది. క‌రోనా వైర‌స్ దెబ్బ‌కు ప్ర‌పంచ మార్కెట్‌ను తీవ్ర ప్ర‌భావం చూపిస్తోంది. చైనాలో స్టార్ట్ అయిన ఈ వైర‌స్ వ‌ల్ల అనేక దేశాలు అల్లాడి పోతున్నాయి. న‌ష్ట నివార‌ణ చ‌ర్య‌లు చేప‌ట్టినా కంట్రోల్ కాక పోవ‌డంతో గ‌త్యంత‌రం లేని ప‌రిస్థితుల్లో లాక్ డౌన్ చేస్తున్నాయి. దీంతో ఉత్ప‌త్తి, పారిశ్రామిక రంగాల‌న్నీ క్లోజ్ కావ‌డంతో ప్ర‌పంచ మాన‌వాళి మ‌నుగ‌డ‌కు మ‌రింత ప్ర‌మాదం ఏర్ప‌డింది. ఈ విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో ప్ర‌పంచాన్ని ఒంటి చేత్తో శాసిస్తున్న అగ్ర‌రాజ్యం అమెరికా సైతం క‌రోనా వైర‌స్‌ను క‌ట్ట‌డి చేయ‌లేక పోతోంది. న‌ష్ట నివార‌ణ చ‌ర్య‌లు తీసుకోవాల్సిన ప్రెసిడెంట్ ట్రంప్ దీని ప‌ట్ల కొంత ఉదాసీన వైఖ‌రిని అవ‌లంభిస్తూ వ‌చ్చారు. ఇది మ‌రింత పెను ప్ర‌మాదంగా ప‌రిణ‌మించింది. దీంతో ఆల‌స్యంగా మేల్కొన్న ప్రెసిడెంట్ అత్య‌వ‌స‌ర స‌మావేశాన్ని నిర్వ‌హించారు. క‌రోనా కంట్రోల్ చేసేందుకు ట్రిలియ‌న్ డాల‌ర్ల‌ను ప్ర‌క‌టించారు. అంత‌కు ముందు ట్రంప్ చైనాను టార్గెట్ చేశారు. చైనా వ‌ల్ల‌నే ఈ క‌రోనా మ‌హ‌మ్మారి దాపురించిందంటూ కారాలు మిరియాలు నూరారు. దీనికి తానేమీ త‌క్కువ తి...

దేశానికి కేంద్రం భ‌రోసా

చిత్రం
అత్యంత క్లిష్ట ప‌రిస్థితుల‌ను ఎదుర్కొంటున్న భార‌త దేశానికి కాయ‌క‌ల్ప చికిత్స చేసేందుకు కేంద్రంలోని బీజేపీ స‌ర్కార్ న‌డుం బిగించింది. ప్ర‌పంచాన్ని గ‌డ‌గ‌డ‌లాడిస్తున్న క‌రోనా వైర‌స్ వ్యాప్తి చెంద‌డంతో న‌ష్ట నివార‌ణ చ‌ర్య‌లు చేప‌ట్టింది. వేలాది మంది ఇప్ప‌టికే దీని బారిన ప‌డ్డారు. ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌గా దేశ‌మంత‌టా ష‌ట్ డౌన్ ప్ర‌క‌టించారు భార‌త ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర దామోద‌ర దాస్ మోదీజి. వైద్యులు, పోలీసులు, స్వ‌చ్చంధ నిర్వాహ‌కులు సైతం ఆదుకునేందుకు ముందుకు వ‌చ్చారు. అటు సెల‌బ్రెటీలు, క్రీడాకారులు, వ్యాపారవేత్త‌లు, కంపెనీలు పెద్ద ఎత్తున విరాళాలు ప్ర‌క‌టించాయి. ఎప్ప‌టిక‌ప్పుడు కేంద్రం ఆయా రాష్ట్రాల అధినేత‌ల‌తో ప్ర‌త్యేక స‌మావేశం ఏర్పాటు చేసింది. క‌రోనాను అదుపులోకి తీసుకు వ‌చ్చేందుకు చ‌ర్య‌లు చేప‌ట్టింది. ఇందు కోసం ఏకంగా ఆర్థిక శాఖా మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ రంగంలోకి దిగారు.    వివిధ రంగాల‌కు సానుకూలంగా ఉండేలా చూశారు. వేత‌న జీవుల‌కు కొంత ఉప‌శ‌మ‌నం క‌లిగించారు. ఉపాధి హామీ కింద ప‌నిచేస్తున్న కూలీల‌కు ధ‌ర‌లు పెంచారు. నిత్యావ‌స‌ర స‌రుకులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పేద‌ల‌కు అందేలా ...

క‌రోనా..క్యా క‌ర్‌నా

చిత్రం
క‌రోనా వైర‌స్ దెబ్బ‌కు అగ్ర‌రాజ్యం అమెరికా అల్లాడుతోంది. నిన్న‌టి దాకా టేక్ ఇట్ ఈజీగా తీసుకున్న పెద్ద‌న్న ఇపుడు వైర‌స్ వ్యాప్తి చెంద‌డం, బాధితులు అంత‌కంత‌కూ ఎక్కువ కావ‌డం, నివార‌ణ చ‌ర్య‌లు చేప‌ట్టేందుకు కావాల్సిన సౌక‌ర్యాలు లేక పోవ‌డంతో ప్రెసిడెంట్ పున‌రాలోచ‌న‌లో ప‌డ్డారు. త్వ‌ర‌లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నుండ‌డంతో ఈ వ్యాధిని కంట్రోల్ చేయ‌డంలో స‌రైన శ్ర‌ద్ధ చూపించ‌లేదు. దీంతో బాధితుల సంఖ్య పెరుగుతూ వ‌స్తోంది. నిన్న‌టి దాకా చైనా వ‌ర‌ల్డ్ వైడ్ గా చూస్తే టాప్ వ‌న్ లో ఉండ‌గా ఇపుడు దానిని ఇట‌లీ దాటేసింది. వేలాది మంది పిట్ట‌ల్లా రాలుతున్నా ఏమీ చేయ‌ల‌ని స్థితిలోకి చేరుకుంది ఈ కంట్రీ. ఇదిలా ఉండ‌గా ఆర్థికంగా ఫ‌స్ట్ ప్లేస్ లో ఉన్న అమెరికా ను క‌రోనా కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. బాధితుల సంఖ్య ఇటలీని దాటేసింది. ఒక వేళ ఈ వైర‌స్ మ‌రింత విజృంభిస్తే యుఎస్ ద‌గ్గ‌ర కంట్రోల్ చేసేందుకు కావాల్సిన స‌దుపాయాలు, సిబ్బంది, నిపుణులు, వైద్యులు లేక పోవ‌డం బాధాక‌రం. అమెరిక‌న్లు ఈ వ్యాధిని త‌ల్చుకుని కుమిలి పోతున్నారు. ట్రంప్ ఎందుకు చ‌ర్య‌లు చేప‌ట్ట‌డం లేదంటూ ఆందోళ‌న చెందుతున్నారు. 24 గంటల వ్యవధిలోనే పది వేల కొత్త ...

క‌రోనా కోసం సెల‌బ్రెటీల సాయం

చిత్రం
 క‌రోనా వైర‌స్ దెబ్బ‌కు దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో సినీ రంగానికి చెందిన ప‌లువురు సినీ ప్ర‌ముఖులు త‌మ ఉదార‌త‌ను చాటుకున్నారు. చిరంజీవి, మ‌హేష్ బాబు, ప‌వ‌న్ క‌ళ్యాణ్, ప్ర‌భాస్, జూనియ‌ర్ ఎన్టీఆర్, న‌రేష్ , రామ్ చ‌ర‌ణ్‌, సాయి ధ‌రమ్ తేజ్, నితిన్, త‌దిత‌రుల‌తో పాటు సినీ ద‌ర్శ‌కులు, నిర్మాతలు సైతం క‌రోనా వ్యాధి నివార‌ణ కోసం కృషి చేస్తున్న ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ప్ర‌భుత్వాల‌కు త‌మ వంతు స‌హ‌కారాన్ని విరాళాల రూపేణా అంద‌జేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. వీరందిర‌లో ఎక్కువ‌గా సాయం ప్ర‌క‌టించింది మాత్రం ప్ర‌భాస్ ఒక్క‌డే. ఆయ‌న ఏకంగా 4 కోట్ల రూపాయ‌ల‌ను విరాళంగా ప్ర‌క‌టించారు. ఇందులో మూడు కోట్ల రూపాయ‌ల‌ను ప్ర‌ధాన‌మంత్రి ఎమ‌ర్జెన్సీ ఫండ్ కు ఇవ్వ‌గా ఏపీ, తెలంగాణ‌ల‌కు చెరో 50 ల‌క్ష‌లు ఇస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. చిరంజీవి కోటి, రామ్ చ‌ర‌ణ్ 75 ల‌క్ష‌లు, మ‌హేష్ బాబు కోటి, జూనియ‌ర్ ఎన్టీఆర్ 75 ల‌క్ష‌లు, న‌రేష్ 10 ల‌క్ష‌లు, నితిన్ 10 ల‌క్ష‌లు, సాయి ధ‌ర‌మ్ తేజ్ 10 ల‌క్ష‌లు ప్ర‌క‌టించారు. ద‌ర్శ‌కులు త్రివిక్రం శ్రీ‌నివాస్ రెండు రాష్ట్రాల‌కు 10 ల‌క్ష‌ల చొప్పున ప్ర‌క‌టించ‌గా దిల్ రాజు, ...

క‌రోనా క‌ల్లోలం..దేశం అల్ల‌క‌ల్లోలం

చిత్రం
క‌రోనా దెబ్బ‌కు ఇండియా అల్లాడుతోంది. ఇప్ప‌టికే కేసులు వంద‌లు దాటి వేయి వ‌ర‌కు వ‌స్తున్నాయి. దీంతో ఎటూ పాలుపోలేని స్థితిలో ఉన్న భార‌త ప్ర‌భుత్వం గ‌త్యంత‌రం లేని ప‌రిస్థితుల్లో ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీజీ ఏప్రిల్ 14 వ‌ర‌కు ష‌ట్ డౌన్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. దీంతో కోట్లాది మంది ప్ర‌జ‌లు త‌మ ఇళ్ల‌ల్లోంచి బ‌య‌ట‌కు రావ‌డం లేదు. అన్ని రాష్ట్రాలు పూర్తిగా క్లోజ్ చేయాల‌ని ఇప్ప‌టికే ఆదేశాలు జారీ చేశారు. ప్ర‌పంచ వ్యాప్తంగా చైనా చాలా వ‌ర‌కు కరోనా వైర‌స్ వ్యాప్తి చెంద‌కుండా కంట్రోల్ చేయ‌గ‌లిగితే అమెరికా మాత్రం భారీ మూల్యం చెల్లించుకుంటోంది. మొద‌ట్లో దీనిని లైట్‌గా తీసుకున్న ప్రెసిడెంట్ ట్రంప్ ..దీని దెబ్బ‌కు రోజు రోజుకు బాధితుల సంఖ్య పెరుగుతూ ఉండ‌డంతో గ‌త్యంత‌రం లేక ఎవ్వ‌రూ బ‌య‌ట‌కు రావ‌ద్దంటూ ప్ర‌క‌ట‌న చేశారు. అంతే కాకుండా ఈ వైర‌స్ ను వ్యాప్తి చెందేలా చేసిన చైనాను ఆయ‌న టార్గెట్ చేశారు. త‌మ దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను దెబ్బ కొట్టాల‌నే ఉద్ధేశంతోనే చైనా ఇలా చేసిందంటూ తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. దీంతో రంగంలోకి దిగిన డ్రాగ‌న్ చైనా అమెరికాపై మండి ప‌డింది. నిరాధార‌మైన ఆరోప‌ణ‌లు చేయ‌డం మానుకోకుంటే బాగ...

క‌నిపిస్తే కాల్చివేత..ఇండియా ష‌ట్ డౌన్

చిత్రం
ప్ర‌పంచం ఒకే ఒక్క వైర‌స్ ను చూసి వ‌ణుకుతోంది. 195 దేశాల‌కు విస్త‌రించిన ఈ మ‌హ‌మ్మారి కోట్లాది ప్ర‌జ‌ల‌ను, దేశాధినేత‌ల‌ను, పాల‌కుల‌ను ముప్పుతిప్ప‌లు పెడుతోంది. అంతే కాదు ఏ స‌మ‌యంలో ఎవ‌రిని కాటేస్తుందో తెలియ‌ని ప‌రిస్థితి నెల‌కొంది. ఈ వైర‌స్ దెబ్బ‌కు జ‌నం పిట్ట‌ల్లా రాలుతున్నారు. టెక్నాల‌జీ ప‌రంగా ఎంతో ముందంజ‌లో ఉన్నా ప్ర‌పంచాన్ని శాసించే పెద్ద‌న్న అమెరికా సైతం క‌రోనాను చూసి జ‌డుసుకుంటోంది. దీని ప్ర‌భావం ఏ మేర‌కు ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. ఇప్ప‌టికే ఇట‌లీని క‌మ్మేసిన ఈ భూతం దెబ్బ‌కు ప్ర‌ధాన దేశాల‌న్నీ విల‌విల‌లాడుతున్నాయి. ఇక ఇండియా విష‌యానికి వ‌స్తే క‌రోనా వైర‌స్ పుణ్య‌మా అంటూ ఇక్క‌డ కూడా పాకింది. ఇప్ప‌టి దాకా క‌నీసం 500 మందికి పైగా ఈ వ్యాధిన బారిన ప‌డ్డారు. కోట్లాది రూపాయ‌లు కేంద్ర‌, రాష్ట్రాలు నీళ్ల‌ల్లా ఖ‌ర్చు చేస్తున్నాయి. సాక్షాత్తు భార‌త‌దేశ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర దామోద‌ర‌దాస్ మోదీజీ, ఏపీ, తెలంగాణ సీఎంలు జ‌గ‌న్, కేసీఆర్ లు న‌ష్ట నివార‌ణ చ‌ర్య‌లు చేప‌ట్ట‌డంలో నిమ‌గ్న‌మ‌య్యారు. లాక్ డౌన్ ప్ర‌క‌టిస్తున్న‌ట్లు మోదీ ప్ర‌క‌టించ‌గా కేసీఆర్ ఏకంగా క‌నిపిస్తే కాల్చివేత‌కు ఆదేశాలు జారీ చే...

శ్రీ‌కృష్ణం..ప్ర‌భుపాదం

చిత్రం
కృష్ణా నీవే అంటూ హ‌రిహ‌ర‌న్ పాడుతుంటే మ‌న‌సు అలౌకిక‌మైన దారుల్లో సంచ‌రిస్తుంది. ఉన్నాడో లేడో తెలియ‌ని సందిగ్ధావ‌స్థ స్థితిలోంచి కోట్లాది జ‌నాన్ని భ‌క్తులుగా మార్చిన ఘ‌న‌త ఆ కృష్ణుడిదే. వెన్న దొంగ‌గా, ఆరాధ్య దైవంగా వినుతికెక్కిన ఆయ‌న బోధించిన భ‌గ‌వ‌ద్గీత ఇవాళ ప్ర‌తి ఇంట్లోకి చేరిపోయింది. ఎంత‌లా అంటే విడ‌దీయ‌లేనంత‌గా. ప్ర‌తి చోటా..ప్ర‌తి నోటా కృష్ణా అన్న ప‌ద‌మే విన‌సొంపుగా..విన‌మ్రంగా..విశ్వ వ్యాప్తంగా..నిత్యం..నిరంత‌రం..లోక‌మంత‌టా వినిపిస్తోంది. ఎలాంటి భేష‌జాలు లేకుండా..అహం అన్న‌ది ద‌రిచేర‌కుండా మ‌నుషులుగా ఎలా ఉండాలో..ఎలా వ్య‌వ‌హ‌రించాలో..ఎలా బ‌త‌కాలో బోధించారు..కోట్లాది భ‌క్తుల‌కు త‌న ప్ర‌వ‌చ‌నాల ద్వారా సందేశాల‌ను చేర‌వేశారు. ఈ ప్ర‌పంచ గ‌తి శీల‌త‌ను మార్చిన సంఘ‌ట‌న‌లు ఎన్నో ఉన్నాయి. కానీ ఈ లోకాన్ని సంస్క‌రించిన మ‌హానుభావులు ల‌క్ష‌లాది మంది ఉన్నారు. వారిప్పుడు భౌతికంగా లేరు. కానీ వారు సూచించిన మార్గాలు, వారు న‌డిచిన అడుగు జాడ‌ల‌న్నీ నేటికీ స్ఫూర్తిని క‌లిగిస్తున్నాయి. దైవం స‌మానం..కానీ మ‌న మ‌న‌స్సులు మాత్రం ఒక చోట కుదురుగా ఉండ‌వు. ఉండ‌లేవు కూడా. ఎందుకంటే స్పందించే గుణం వీటికి మాత్ర‌...

ఆల‌యాలు క్లోజ్..ద‌ర్శ‌నాలు బంద్

చిత్రం
క‌రోనా ఎఫెక్ట్ దెబ్బ‌కు అన్ని రంగాలు విల‌విల‌లాడుతుండ‌గా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్ర‌ధాన ఆల‌యాల‌న్నీ మూసి వేశారు. ప్ర‌పంచంలోనే అత్యంత ఆదాయం క‌లిగిన తిరుమ‌ల‌లో ద‌ర్శ‌నాలు ర‌ద్దు చేసిన‌ట్లు టీటీడీ ఈఓ సింఘాల్ ప్ర‌క‌టించారు. ఈ మేర‌కు సీఎం జ‌గ‌న్, టీటీడీ ఛైర్మ‌న్ సుబ్బారెడ్డిల‌తో చ‌ర్చించిన మీదట ఈ నిర్ణ‌యం తీసుకున్నామ‌ని వెల్ల‌డించారు. వేలాది మంది ఇప్ప‌టికే వెంక‌టేశ్వ‌ర స్వామి వారి ద‌ర్శ‌నం కోసం ముంద‌స్తుగా బుకింగ్ చేసుకున్నారు. వీరికి కోలుకోలేని షాక్ ఇచ్చింది టీటీడీ. క‌రోనా వ్యాధి ఊహించ‌ని రీతిలో వ్యాప్తి చెందుతుండ‌డంతో గ‌త్యంత‌రం లేని ప‌రిస్థితుల్లో ఇప్ప‌టికే విద్యా సంస్థ‌ల‌ను మూసి వుంచారు. దీనిని దృష్టిలో పెట్టుకున్న ఆయా రాష్ట్రాల ప్ర‌భుత్వాలు ముంద‌స్తు చ‌ర్య‌లు తీసుకున్నాయి. ఎవ్వ‌రూ బ‌య‌ట‌కు రావ‌ద్ద‌ని, క‌నీసం 15 రోజుల పాటు ఇళ్ల‌ల్లోనే ఉండాల‌ని సూచించారు. దీంతో ప్ర‌ధాన ఆల‌యాలు వేములాడ రాజ‌న్న‌, యాదాద్రి శ్రీ ల‌క్ష్మి న‌ర‌సింహ స్వామి, భ‌ద్రాద్రి రామాల‌యం, బాస‌ర‌, ఆలంపూర్, బీచుప‌ల్లి, శ్రీ‌శైలం, తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం, కాణిపాకం, శ్రీ‌శైలం, మ‌హానంది, మంత్రాల‌యంతో పాటు శ్రీ‌కా...

క‌రోనాపై ఫ్యాన్స్ ఫైర్

చిత్రం
క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారి దెబ్బ‌కు అన్ని రంగాల‌తో పాటు క్రీడారంగం కూడా కుదుపున‌కు లోనైంది. ప్ర‌పంచాన్ని ఇప్ప‌టికే గ‌డ‌గ‌డ‌లాడిస్తున్న ఈ వైర‌స్ దెబ్బ‌కు క్రికెట్, బ్యాడ్మింట‌న్, టెన్నిస్, వాలీబాల్, చెస్, ఫుట్ బాల్, బేస్ బాల్, హాకీ, త‌దిత‌ర అన్ని ఆట‌లు అర్ధాంత‌రంగా ర‌ద్ద‌య్యాయి. ప్ర‌స్తుతం జ‌పాన్‌లో జ‌రుగుతున్న ఒలంపిక్ గేమ్స్ కూడా జ‌రుగుతాయో లేదోన‌న్న మీమాంస నెల‌కొంది. మ‌రో వైపు ఇండియాకు ఐకాన్‌గా ఉన్న క్రికెట్ కు సంబంధించి భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు అసాధ‌ర‌ణ నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే ఇండియ‌న్ ప్రిమియ‌ర్ లీగ్ పోటీలు జ‌ర‌గాల్సి ఉండ‌గా కేంద్ర ప్ర‌భుత్వం తాజా నిర్ణ‌యం తీసుకోవ‌డంతో త‌ప్ప‌ని ప‌రిస్థితుల్లో తాము కూడా తాత్కాలికంగా అన్ని మ్యాచ్‌ల‌ను, టోర్న‌మెంట్ ల‌ను ర‌ద్దు చేస్తున్న‌ట్లు బిసిసిఐ చీఫ్ సౌర‌బ్ గంగూలీ వెల్ల‌డించారు. దీంతో కోట్లాది రూపాయ‌ల న‌ష్టం వాటిల్ల‌నుంది. అంతే కాకుండా స్పాన్స‌ర్స్ చేస్తున్న కంపెనీలు సైతం భారీగా న‌ష్ట‌పోవాల్సిన ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. ర‌ద్దు చేయ‌డం కాకుండా వాయిదా మాత్రం వేయాలని కోరుతున్నాయి. దీనిని ప‌రిగ‌ణ‌లోకి తీసుకున్న బీసీసీఐ అత్య‌వ‌స‌ర స‌మావేశ...

మంజ్రేక‌ర్‌కు పండిట్ బాస‌ట

చిత్రం
భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు  కామెంటరీ ప్యానల్‌ నుంచి ఉద్వాసనకు గురైన సంజయ్‌ మంజ్రేకర్‌కు మాజీ క్రికెటర్‌ చంద్రకాంత్‌ పండిట్‌ బాసటగా నిలిచాడు. అతన్ని తిరిగి కామెంటరీ ప్యానల్‌లోకి తీసుకోవాలని బీసీసీఐని అభ్యర్థించాడు. స్వతహాగా తన వ్యాఖ్యానంలో దూకుడు స్వభావం ఉన్న మంజ్రేకర్‌ ఎవర్నీ కావాలని గాయ పరచడంటూ వెనుకేసుకొచ్చాడు. తనకు మంజ్రేకర్‌ చిన‍్నతనం నుంచి తెలుసని, అతనిది ఉన్నది ఉన్నట్లు మాట్లాడే స్వభావమే తప్పితే వేరే ఉద్దేశాలు ఏమీ ఉండన్నాడు. ఒక కామెంటరీ చెప్పేటప్పుడు ప్రతీసారి ప్రజల్ని ఆకట్టుకునే వ్యాఖ్యానాలు అతను చేయలేక పోవచ్చని, అందుచేత మంజ్రేకర్‌ను తన కామెంటరీ ప్రొఫెషన్‌కు దూరం చేయడం భావ్యం కాదన్నాడు. మంజ్రేకర్‌ను కాస్త దూకుడు తగ్గించమని బీసీసీఐ ఒక వార్నింగ్‌ ఇచ్చి, మళ్లీ అతన్ని విధుల్లోకి తీసుకోవాలన్ని చంద్రకాంత్‌ పండిట్‌ కోరాడు. నాకు మంజ్రేకర్‌ బాల్యం నుంచి తెలుసు. ఇతరుల్ని గాయపరిచే మనస్తత్వం అతనిదైతే కాదు. ఉన్నది ఉన్నట్లు వ్యక్తిత్వం మంజ్రేకర్‌ది. ఆ విషయంలో నేను ఎప్పుడు అతన్ని అభిమానిస్తూనే ఉంటాను. ముఖం మీద మాట్లాడే స్వభావం ఉన్నవారిని ఎవరూ ఇష్టపడరు.. కానీ ఒక కామెంటేటర్‌గా అతను ...

ఉద్యోగుల‌కు బంప‌ర్ ఛాన్స్

చిత్రం
క‌రోనా పుణ్య‌మా అంటూ ఆయా కంపెనీల్లో ప‌నిచేస్తున్న వారికి ఇప్పుడు ఇంటి వద్ద నుంచే ప‌ని చేసుకునే స‌దుపాయం క‌లుగుతోంది. దీంతో ఆడిందే ఆట పాడిందే పాట అన్న రీతిలో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ దెబ్బ‌కు అన్ని దేశాలు విల‌విల‌లాడుతున్నాయి. ఇదే స‌మ‌యంలో తాము ప్ర‌యాణం చేస్తూ ఆఫీసుల‌కు రాలేమంటూ ఉద్యోగులు తెగేసి చెప్ప‌డంతో కంపెనీలు కాళ్ల బేరానికి వ‌చ్చాయి. దీంతో ఆఫీసుల‌కు మాత్రం రాక‌పోయినా ప‌ర్వాలేదు కానీ టైం త‌ప్ప‌కుండా నిర్దేశించిన టార్గెట్‌ను పూర్తి చేసేందుకు కావాల్సిన స‌దుపాయాల‌ను తాము స‌మ‌కూరుస్తామంటూ కంపెనీల య‌జ‌మానులు స్ప‌ష్టం చేశారు. దీంతో సందిట్లో స‌డేమియా అన్న చందంగా ఫుల్ జోష్ మీదున్నారు. ఎక్కువ‌గా అమెరికా, ఫ్రాన్స్, సింగ‌పూర్, లండ‌న్ , త‌దిత‌ర దేశాల్లో ఎక్కువ‌గా ఉంటున్న అన్ని రంగాల కంపెనీల‌న్నీ వ‌ర్క్ ఫ్రం హోం సౌక‌ర్యాన్ని క‌ల్పిస్తున్నాయి. దీనిని స‌ద్వినియోగం చేసుకునేందుకు వీలుగా ఉద్యోగులు సైతం వ‌ర్క్‌లో నిమ‌గ్న‌మ‌వుతున్నారు. తాజాగా ఐటీ దిగ్గ‌జ కంపెనీ ఫేస్ బుక్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. అదేమిటంటే క‌రోనా ప్ర‌భావం ఉన్నందున ఉద్యోగుల‌కు అద‌న‌పు బోన‌స్ ప్ర‌...

ఇండియాలో హెల్త్ ఎమ‌ర్జెన్సీ

చిత్రం
క‌రోనా మ‌హ‌మ్మారి దేశాన్ని ఇబ్బందుల‌కు గురి చేస్తోందంటూ భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర దామోద‌ర దాస్ మోదీ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ప్ర‌జ‌లంతా ఒకే తాటిపై వుంటూ త‌మ‌కు తాము స్వీయ నియంత్ర‌ణ విధించు కోవాల్సిన అవ‌స‌రం ఉందని అన్నారు. ప్ర‌ధాన‌మంత్రి జాతిని ఉద్ధేశించి ప్ర‌సంగించారు. క‌రోనా ప్ర‌భావం ప్ర‌పంచాన్ని గ‌డ‌గ‌డ‌లాడిస్తుండ‌గా మ‌న దేశాన్ని సైతం విస్మయం చెందేలా చేస్తోంద‌న్నారు. ప్ర‌తి ఒక్క‌రు త‌మ కుటుంబంతో పాటు ప‌రిస‌రాలను సైతం శుభ్రంగా ఉంచుకోవాల‌న్నారు. క‌రోనా వైర‌స్ కు మందు అనేది లేకుండా పోయింది. ఎంతో మంది వైద్యులు, నిపుణులు ఈ మ‌హ‌మ్మారి వ్యాధి నుంచి ర‌క్షించేందుకు రేయింబ‌వ‌ళ్లు శ్ర‌మిస్తున్నార‌ని చెప్పారు. అంతే కాకుండా ప్ర‌జ‌లంద‌రు ఆరోగ్య ప‌రంగా బాగుండాల‌నే ఉద్దేశంతో ఎప్ప‌టిక‌ప్పుడు వైద్యుల‌తో పాటు సిబ్బంది, పోలీసులు, ప్యారా మిల‌ట‌రీ ద‌ళాలు త‌మ వంతుగా దేశ సేవ‌లో నిమ‌గ్న‌మ‌య్యార‌ని, వీరంద‌రికి మ‌నంద‌రం కృత‌జ్ఞ‌త‌లు చెప్పుకోవాల్సిన స‌మయం ఆసన్న‌మైంద‌న్నారు. క‌నీసం వారం రోజుల పాటు దేశంలోని వారంతా త‌మ త‌మ స్థ‌లాల్లోనే ఉండాల‌ని, ఇళ్ల‌ల్లోంచి ఎవ‌రూ బ‌య‌ట‌కు రావ‌ద్దని పీఎం కోరారు. వైద్య ఆరోగ్య శాఖ...

మ‌నోళ్ల‌కు అండ‌గా నిలుద్దాం

చిత్రం
ఎన్నాళ్ల‌కు ఎన్నేళ్ల‌కు ఇండియ‌న్ విమెన్స్ క్రికెట్ టీం ఫైన‌ల్ కు రావ‌డం. ఒక‌ప్పుడు వాళ్లు ఆడుతున్నారంటే ప‌ట్టించుకునే వాళ్లం కాదు. క‌పిల్ దేవ్, అజారుద్దీన్, స‌చిన్, గంగూలీ నుంచి నేటి కోహ్లి దాకా అంతా వాళ్ల గురించిన చ‌ర్చ‌నే. ఇదే స‌మ‌యంలో ఒక్క‌సారిగా హైద‌రాబాద్ అమ్మాయి మిథాలీ రాజ్ వ‌చ్చాక భార‌త‌దేశంలో మ‌హిళా క్రికెట్‌కు మ‌రింత ఆద‌ర‌ణ పెరిగేలా చేసింది. క్రికెట్ అంటేనే పురుషుల‌కు మాత్ర‌మే చెందింద‌ని అనుకునే రోజుల నుంచి ఇపుడు ప్ర‌పంచ‌మంతా మ‌హిళ‌లు కూడా ధీటుగా, ధాటిగా ఆడ‌గ‌ల‌ర‌ని నిరూపించారు. దీంతో భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు ఏకంగా వారి కోసం ప్ర‌త్యేకంగా బోర్డును ఏర్పాటు చేసింది. వాళ్ల‌కు కాంట్రాక్టు సిస్టం ను ఇంట్ర‌డ్యూస్ చేసింది. గంగూలీ బీసీసీఐ చీఫ్ అయ్యాక క్రికెట్ ఆట‌లో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. పాల‌నా ప‌రంగా కొత్త పుంత‌లు తొక్కించాడు ఈ మాజీ క్రికెట‌ర్. భార‌త దేశ ప్ర‌ధాన‌మంత్రి నుంచి అంతా మ‌న మ‌హిళా జ‌ట్టు గెల‌వాల‌ని కోరుకున్న వారే. కానీ సీన్ రివ‌ర్స్ అయింది. ఇండియా జ‌ట్టు భారీ తేడాతో ఓడిపోయింది. దీనికి బాధ ప‌డాల్సిన ప‌నిలేదు. ఎందుకంటే కార్పొరేట్ కంపెనీల గుప్పిట్లో...

లేచి ప‌డిన పృథ్వీరాజ్

చిత్రం
న‌టుడిగా తెలుగు సినిమా రంగంలో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌త‌ను చాటుకున్న పృథ్వీరాజ్ ఇపుడు పున‌రాలోచ‌న‌లో ప‌డ్డారు. బాగున్న‌ప్పుడు అంతా పోగైన జ‌నం ఇపుడు ప‌లు ఆరోప‌ణ‌లు ఎదుర్కొని శ్రీ వెంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్ ఛైర్మ‌న్ ప‌ద‌వి నుంచి అనూహ్యంగా త‌ప్పుకోవ‌డంతో ఎవ‌రూ ఆయ‌న ద‌రిదాపుల్లోకి వెళ్ల‌డం లేదు. ఈ విష‌యాన్ని, ఘోర‌మైన అవ‌మాన‌క‌రంగా భావిస్తున్న‌ట్లు స్వ‌యంగా ఈ న‌టుడే ఇటీవ‌ల వాపోవ‌డం జ‌రిగింది. ప‌లు విజ‌య‌వంత‌మైన సినిమాల్లో న‌టించి మెప్పించిన ఘ‌న‌త పృథ్విది. అంతే కాకుండా ఉన్న‌ది ఉన్న‌ట్లుగా మాట్లాడే స్వ‌భావం క‌లిగి ఉండ‌డం కూడా ఆయ‌న కెరీర్‌కు పెద్ద అడ్డంకిగా మారింది. మొద‌టి నుంచి తెలుగుదేశం పార్టీకి వ్య‌తిరేకంగా ప‌నిచేస్తూ వ‌చ్చారు. పృథ్వీరాజ్ కు వైఎస్ ఆర్ అంటే పిచ్చి. అదే వైఎస్ జ‌గ‌న్‌కు హార్డ్ కోర్ ఫ్యాన్‌గా ఉంటూ వ‌చ్చారు. అంతేకాకుండా జ‌గ‌న్ స్థాపించిన కొత్త పార్టీలో ఆయ‌న వెంట కార్య‌క‌ర్త‌గా ప‌నిచేశారు. న‌మ్మ‌క‌మైన నాయ‌కుడిగా ఎదిగారు. ఏకంగా పార్టీకి వెన్నుద‌న్నుగా నిలిచారు. పార్టీ ప్ర‌చారానికి ర‌థ‌సార‌థిగా ఉన్నారు. ఎన్నో కార్య‌క్ర‌మాలు చేప‌ట్టారు. ఓ వైపు వృత్తి ప‌రంగా క‌ళాకారుడైన పృథ్వీరాజ...

ఆస్ట్రేలియానే అస‌లైన విజేత

చిత్రం
అంద‌రూ అనుకున్న‌ట్టుగానే మన మ‌హిళా క్రికెట్ జ‌ట్టు చేతులెత్తేసింది. ఫైన‌ల్ పోరులో చ‌తికిల‌ప‌డింది. ప్ర‌త్య‌ర్థి జ‌ట్టు ప‌క్కా ప్లాన్ తో ఆడితే..మ‌న వాళ్లు అలా వ‌చ్చి ఇలా పెవిలియ‌న్ దారి ప‌ట్టారు. వ‌చ్చిన అద్భుత‌మైన అవ‌కాశాన్ని వ‌దులుకున్నారు. దీంతో మ‌రోసారి ఆస్ట్రేలియా మ‌హిళా జ‌ట్టు చ‌రిత్ర సృష్టించింది. వ‌రుస‌గా అయిదోసారి టీ20 ప్ర‌పంచ క‌ప్ ను ముద్దాడింది. ఇండియా జ‌ట్టును చిత్తుగా ఓడించింది. చాంపియన్‌ ఆట తీరుతో ఆస్ట్రేలియా మరోసారి మెరిసింది..  ప్రపంచకప్‌-2020 విజేతగా నిలిచింది. టీ20 ప్రపంచకప్‌ ఫైనల్లో భాగంగా టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో ఆసీస్‌ 85 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌ నిర్ణీత ఓవర్లలో  4 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది.  స్టార్‌ బ్యాటర్‌ అలీసా హీలీ విధ్వంసానికి తోడు.. మరో ఓపెనర్‌ బెత్‌ మూనీ  హాఫ్‌ సెంచరీతో రాణించారు. దీప్తి శర్మ రెండు వికెట్లు పడగొట్టింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 19.1 ఓవర్లలో 99 పరుగులకు ఆలౌటైంది. ప్రధాన బ్యాటర్లు షషాలీ, మంధాన, రోడ్రిగ్స్ , హర్మన్ లు ఎలాంటి ప‌ర్ ఫార్మెన్స్ క‌న‌బ‌ర్చ‌లే...

నిన్న లేబ‌ర్..నేడు సిఇఓ ..విమెన్ స‌క్సెస్ జ‌ర్నీ

చిత్రం
క‌ల‌లు క‌నండి..వాటిని నిజం చేసుకునేందుకు ప్ర‌య‌త్నం చేయండి. పోతే పోయేదేముంది..జ‌స్ట్ క‌ష్ట‌ప‌డ‌ట‌మేగా. అయితే విజ‌యం వ‌రిస్తుంది. కాక‌పోతే అప‌జ‌యం నేర్పిన అనుభ‌వం ప‌నికొస్తుంది. కొంద‌రిని చూస్తే జాలేస్తుంది. ఇంకొంద‌రిని చూస్తే గుండెల్లో దాచుకోవాల‌ని అనిపిస్తుంది. ఈ స‌మాజంలో ఆడ‌వాళ్లంటే చుల‌క‌న భావం. వాళ్లకు ఏదీ చేత‌కాద‌నే కామెంట్స్ ఎక్కువ‌గా వింటూ వుంటాం. కానీ అవేవీ ఆమె విష‌యంలో అడ్డురాలేదు. తెలంగాణ ప్రాంతానికి చెందిన అనిలా జ్యోతి రెడ్డిది క‌న్నీటి క‌థ‌. అత్యంత పేద‌రికం నుంచి వ‌చ్చిన ఆమె ఎన్నో క‌ష్టాల‌ను అనుభ‌వించింది. లేబ‌ర్‌గా ప‌నిచేసిన ఆమె ఇపుడు ఏకంగా ప్ర‌పంచాన్ని శాసిస్తున్న అమెరికాలో ఏకంగా ఐటీ రంగానికి సంబంధించి కీ సాఫ్ట్ వేర్ సొల్యూష‌న్స్ కంపెనీని ఏర్పాటు చేసింది. ఒక‌ప్పుడు కూలీగా ప‌నిచేసిన జ్యోతి రెడ్డి ఇపుడు బిగ్గెస్ట్ కంపెనీకి సిఇఓగా ఉన్నారు. ఇది నిజంగా జ‌రిగిన క‌థ‌.  ఎంద‌రికో స్ఫూర్తి దాయ‌కంగా నిలిచిన ఆమె జీవితం ప్ర‌తి ఒక్క‌రికి పాఠం కావాలి. ఐదుగురు పిల్ల‌లు క‌లిగిన ఆ కుటుంబంలో ఎనిమిదేళ్ల‌ప్పుడు పేరెంట్స్ బ‌తుకు భారం ఎక్కువై జ్యోతిరెడ్డిని అనాధ ఆశ్ర‌మంలో చేర్పించారు....

జ‌గ‌న్ నిర్ణయానికి జ‌నామోదం

చిత్రం
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి సందింటి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి తీసుకున్న అసాధార‌ణ‌మైన నిర్ణ‌యాన్ని జ‌నం స్వాగ‌తిస్తున్నారు. మొద‌టిసారిగా ఓ మ‌హిళ‌కు ఉన్న‌త‌మైన ప‌ద‌విని క‌ట్ట‌బెట్ట‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది రాష్ట్రంలో. విజయనగరం జిల్లా  సింహాచలం దేవస్థానం ట్రస్ట్‌ బోర్డు చైర్‌పర్సన్‌గా, మహారాజా అలక్‌ నారాయణ సొసైటీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్సెస్ ట్రస్ట్‌ చైర్‌పర్సన్‌గా ఆనంద గజపతి కుమార్తె సంచయిత గజపతిరాజును నియమిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు ఏపీ సీఎం. త‌న‌కు ఈ ప‌ద‌విని అప్ప‌గించ‌డంతో ఆమె ఉబ్బిత‌బ్బిబ్బ‌వుతోంది. ఈ సంద‌ర్భంగా జ‌గ‌న్‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలియ చేసింది. కాగా గ‌త కొన్నేళ్లుగా ఒకే క‌టుంబం చెలాయిస్తున్న ఆధిపత్యానికి చెక్ పెట్టారు. 1958లో దివంగత పి.వి.జి.రాజు నెలకొల్పిన మాన్సాస్‌ సంస్థ విద్యా వ్యవస్థను అభివృద్ధి పరిచేందుకు విద్యా సంస్థలను నడుపుతోంది. 1958లో పీవీజీ రాజు వ్యవస్థాపక చైర్మన్‌ కాగా ఆనంద గజపతిరాజు, అశోక్‌ గజపతిరాజు ట్రస్ట్‌ బోర్డు సభ్యులుగా ఉండేవారు. 1994లో పి.వి.జి.రాజు మరణం తర్వాత ఆనంద గజపతిరాజు చైర్మన్‌ అయ్యారు. 2016లో ఆయన మరణం తర్వాత అశోక్‌ గజపతిరాజు చైర్మన్‌ బాధ్యతల...

వ‌ర‌ల్డ్ విమెన్స్ క్రికెట్ క‌ప్ ఫైన‌ల్లో టీమిండియా

చిత్రం
భార‌తీయ మ‌హిళా క్రికెట్ జ‌ట్టు అస‌మాన ప్ర‌ద‌ర్శ‌న‌తో ప్ర‌పంచ మ‌హిళ‌ల క్రికెట్ కప్ ఫైన‌ల్‌లోకి దూసుకు వెళ్లింది. ఇంగ్లండ్‌తో జ‌రిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో అనూహ్యంగా వ‌ర్షం అడ్డంకిగా మార‌డంతో ఆట‌ను పూర్తిగా ర‌ద్దు చేశారు. దీంతో మెరుగైన ర‌న్ రేట్ తో పాటు గ్రూపులో ప్ర‌థ‌మ స్థానంలో ఉన్న ఇండియా జ‌ట్టు నేరుగా ఫైన‌ల్‌కు చేరుకుంది. నిబంధ‌న‌లు మార్చాల‌ని, మ‌రోసారి మ్యాచ్ నిర్వ‌హించేందుకు అవ‌కాశం ఇవ్వాల‌ని మ‌హిళా ప్ర‌పంచ క‌ప్ నిర్వాహ‌కులు ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ కౌన్సిల్ కు విన్న‌పించారు. వీరి అభ్య‌ర్థ‌న‌ను ఐసీసీ నిర్ద‌ద్వందంగా తోసి పుచ్చింది. దీంతో ఇండియా, ఇంగ్లండ్ మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్ క్లోజ్ అయిన‌ట్లు ప్ర‌క‌టించ‌డంతో ప్ర‌పంచ క‌ప్ టోర్న‌మెంట్ నుంచి ఇంగ్లండ్ నిష్క్ర‌మించింది. ఆ జ‌ట్టు ఆట‌గాళ్లు పూర్తిగా నిరాశ‌కు లోన‌య్యారు. అడ్డ‌దిడ్డ‌మైన నిబంధ‌న‌లు విధించ‌డం వ‌ల్ల తాము గొప్ప ఛాన్స్ మిస్స‌య్యామ‌ని ఆవేద‌న చెందారు. ఇంకో వైపు ఈ టోర్న‌మెంట్‌లో ఎలాంటి ఓట‌మి చెంద‌కుండానే భార‌త విమెన్స్ క్రికెట్ జ‌ట్టు ఫైన‌ల్‌కు దూసుకు వెళ్లింది. ఇండియ‌న్ క్రికెట‌ర్స్ క‌లిసి క‌ట్టుగా ఆడారు. అద్భుత నైపుణ్యాన్ని ప్ర‌ద‌...