ఏడాది పాలన..మెరుపులు..మరకలు
కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో రెండవసారి కొలువు తీరిన తెలంగాణ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో ఏర్పడిన ప్రభుత్వం ముచ్చటగా ఏడాది పూర్తి చేసుకుంది. దేశానికే తమ పాలన ఆదర్శవంతమైన రీతిలో ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చెబుతుండగా, మిగులు బడ్జెట్లో ఉన్న రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చాడంటూ విపక్షాలు మండిపడుతున్నాయి. ఇదిలా ఉండగా రైతు సంక్షేమం, సబ్బండ వర్గాల అభ్యున్నతే ప్రధాన ఎజెండాగా పెట్టుకుంది ఈ ప్రభుత్వం. గతంలో అనుసరించిన విధంగానే ఈసారి కూడా పాలనను కొత్త పుంతలు తొక్కించే ప్రయత్నం చేశారు. అయితే ఖాళీల భర్తీ విషయంలో మాత్రం సర్కార్ నోరు మెదపక పోవడంపై నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు ఉద్యోగులకు పీఆర్సీ అమలు ఆగి పోయింది. రైతుబంధు, ఆసరా పెన్షన్ల పెంపు హామీలను తొలి ఏడాదే అమల్లోకి తీసుకు వచ్చారు. పాత చట్టాల స్థానంలో కొత్త చట్టాల రూపకల్పనపై దృష్టి పెట్టారు. మున్సిపల్, రెవెన్యూ శాఖల్లో అవినీతిని సమూలంగా నిర్మూలించేందుకు ఇప్పటికే కొత్త మున్సిపల్ చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. ముసాయిదా రెవెన్యూ చట్టాన్ని సిద్ధం చేశారు. సుపరిపాలన, అవినీతి నిర్మూలన, జాప్యాలను తుద ముట్టిం చాలనే లక్ష్యంతో ఈ చట్టాల రూపకల్పనకు సీఎం శ్రీకారం చుట్టారు. ప్రధాన దృష్టంతా సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంపై కేంద్రీకృతం చేశారు కేసీఆర్. కాళేశ్వరం, పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులను స్వయంగా పర్యవేక్షిస్తూ, నిరంతరం సమీక్షిస్తూ, క్షేత్రస్థాయి పర్యటనలతో పరుగులు పెట్టించారు.
ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వివక్ష వైఖరిపై సీఎం ఫైర్ అయ్యారు. కాగా పొరుగు రాష్ట్రాలతో స్నేహ పూర్వక సంబంధాలను కొనసాగిస్తున్నారు. ఏపీతో ఇచ్చి పుచ్చుకునే ధోరణితో వెళుతున్నారు. అయితే కొన్ని వివాదాస్పద నిర్ణయాలు కూడా తీసుకున్నారు. దీనిపై విమర్శలు వెల్లువెత్తాయి. కొత్త సచివాలయం, అసెంబ్లీ భవన సముదాయాలను నిర్మించాలని డిసిషన్ తీసుకున్నారు. ఎర్రంమంజిల్ భవనాన్ని కూల్చేసి అక్కడే 400 కోట్లతో కొత్త అసెంబ్లీ భవనాన్ని, ప్రస్తుత సచివాలయ భవనాలను కూల్చి100 కోట్లతో కొత్త సచివాలయ భవన సముదాయాన్ని నిర్మిస్తామని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై రాష్ట్ర హైకోర్టు స్టే విధించింది. పీఆర్సీ, పదవీ విరమణ వయసు పెంపు, పదోన్నతులు వంటి హామీల అమల్లో జాప్యంపై ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక వర్గాలు పలుమార్లు అసంతృప్తి వ్యక్తం చేశాయి.
ఆర్టీసీ కార్మికులు నిర్వహించిన 52 రోజుల సమ్మె సైతం ప్రభుత్వం, ఉద్యోగ, కార్మిక వర్గాల మధ్య దూరాన్ని మరింత పెంచింది. ఇక రెవెన్యూ శాఖలో పెట్రేగిపోయిన అవినీతి నిర్మూలనకు తీసుకొస్తున్న కొత్త రెవెన్యూ చట్టంతో తమ ఉద్యోగ ప్రాధాన్యతలు తగ్గిపోతాయని ఉద్యోగులు భావిస్తున్నారు. ఆర్థిక మాంద్యం ప్రభావం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై తీవ్రంగా పడింది. లోక్‌సభ ఎన్నికలకు ముందు గత ఫిబ్రవరిలో 1,82,087 కోట్లతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రభుత్వం ప్రవేశపెట్టగా, గత సెప్టెంబర్‌లో ప్రవేశ పెట్టిన పూర్తి స్థాయిలో బడ్జెట్‌ను1,46,492.30 కోట్లకు తగ్గించడం గమనార్హం.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి