కలిసిన కత్తులు
రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరని నిరూపించారు దిగ్గజ నేతలు. ఒకరు ప్రస్తుత ముఖ్యమంత్రి పదవిలో కొనసాగుతుండగా, మరొకరు మాజీ సీఎం. ఈ అరుదైన సన్నివేశం కన్నడనాట చోటు చేసుకుంది. ఈ అరుదైన సంఘటనకు సాక్షీభూతంగా నిలిచింది మాత్రం బెంగళూర్ లోని ఓ ఆస్పత్రి. ప్రతి నిత్యం ఒకరిపై మరొకరు ఆరోపణలు, విమర్శలు చేసుకుంటూ ఉండే వీరిని చూసి జనం నివ్వెర పోవడం మామూలే. అయితే చాలా రాష్ట్రాల్లో లేదా దేశంలో ఆయా పార్టీలకు చెందిన నేతలు ఒక్కోసారి మాట్లాడుకోరు. కొందరైతే చూసీ చూడనట్లు వ్యవహరిస్తారు. కానీ కర్ణాటకలో మాత్రం రాజకీయాలు చాలా విచిత్రంగా ఉంటాయి. పాలిటిక్స్ కంటే స్నేహానికి ఇక్కడ ఎక్కువ విలువ ఇస్తారు. ఇది శుభ పరిణామం కూడా. రాజకీయాలు వేరు. ఫ్రెండ్ షిప్ వేరు. ప్రస్తుతం కర్ణాటక సీఎం గా బీజేపీకి చెందిన యెడ్యూరప్ప కొనసాగుతున్నారు.
అంతకు ముందు ఇదే రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ తరపున సిద్దిరామయ్య ముఖ్యమంత్రిగా పని చేశారు. వీరిద్దరూ బయట ఎంతగా మాటలతో యుద్ధం చేసినా, సవాళ్లు విసురుకున్నా వ్యక్తిగతంగా మాత్రం గొప్ప స్నేహితులు. అంతే కాకుండా కాంగ్రెస్ పార్టీలో అత్యంత విలువైన లీడర్ గా, ట్రబుల్ షూటర్ గా పేరొందిన డీకే శివకుమార్ అంటే సీఎం యడ్యూరప్పకు అభిమానం. ఇది వినేందుకు విచిత్రంగా అనిపించినా, నిజానికి వీరి మధ్య గట్టి బంధమే ఉన్నది. ఇటీవల మనీ లాండరింగ్ కేసులో డీకే శివకుమార్ ను అరెస్ట్ చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ కంటే ముందే యెడ్యూరప్ప స్పందించారు. దీంతో విస్తు పోవడం బీజేపీ నేతల వంతైంది. ఇలా అరెస్ట్ కావడం తనను ఎంతో బాధ కలిగించండన్నారు ఎడ్డీ. తాజాగా నిత్యం కత్తులు దూసుకునే దిగ్గజ నేతలు ఒకే చోట కలుసు కోవడంతో ఇరు పార్టీల అభిమానులు విస్తు పోయారు.
మాజీ సీఎం సిద్ధరామయ్య అనారోగ్యం కారణంగా ఆస్పత్రిలో చేరారు. విషయం తెలుసుకున్న సీఎం యెడ్యూరప్ప ఆలశ్యం చేయకుండా వెంటనే పరామర్శించారు. ఆరోగ్య వివరాలు తెలుసుకున్నారు. హృదయ సంబంధిత సమస్యతో బాధపడుతూ యాంజియోప్లాస్టీ ఆపరేషన్ చేయించుకున్న సిద్ధరామయ్య ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. యడియూరప్ప తో పాటు గ్రామీణాభివృద్ధి మంత్రి కేఎస్ ఈశ్వరప్ప, హోం మంత్రి బసవరాజు బొమ్మాయి తదితరులు సిద్ధరామయ్యను పరామర్శించారు. ఎడ్డీ, సిద్ది రామయ్యలు కొద్దీ సేపు మాట్లాడు కోవడం వైరల్ గా మారింది. మొత్తం మీద రాజకీయం కంటే స్నేహమే గొప్పదని చాటారు వీరిద్దరూ.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి