ప్రమాదంలో ప్రజాస్వామ్యం

దేశంలోనే అత్యుత్తమైన రాజకీయ వ్యూహకర్తగా పేరు తెచ్చుకున్న ప్రశాంత్ కిషోర్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఏ మేరకు సిటిజన్షిప్ సవరణ బిల్లుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో ఇది మరింత వేడిని రాజేసింది. దేశమంతటా వైరల్ గా మారింది. ఇదే అంశంపై దేశ వ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు, ర్యాలీలు కొనసాగుతున్నాయి. ఇదే సమయంలో ప్రశాంత్ కిషోర్ వెలిబుచ్చిన అభిప్రాయాలు మరింత ప్రాధాన్యత చేసుకున్నాయి. పీకేకు మేధావిగా, వ్యూహకర్తగా ఎంతో పేరుంది. ఆయన ఎవరికైతే సపోర్ట్ చేస్తారో వారు అధికారంలోకి రావడం ఖాయంగా మారింది. దీంతో ఇండియాలో విస్మరించలేని నాయకుడిగా, పొలిటికల్ స్ట్రాటజిస్ట్ గా పేరు తెచ్చుకున్నారు. ఆయన కోసం దేశాన్ని ప్రభివితం చేస్తున్న నాయకులూ, ఆయా పార్టీల నేతలు ప్రశాంత్ కిషోర్ ను ఎంచుకున్నారు.

కాగా ఇటీవల ఆయన నితీష్ కుమార్ నేతృత్వంలో చేరారు. తాజాగా తమిళనాడులో రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి రావాలని ప్రయత్నాలు చేస్తున్న డీఎంకే అధినేత స్టాలిన్ కు పీకే సపోర్ట్ చేయనున్నట్టు సమాచారం. ఎన్ని ఆందోళనలు జరిగినా, అభ్యంతరాలు చోటు చేసుకున్నా పార్లమెంట్ లో పౌరసత్వ సవరణ బిల్లు నెగ్గింది. భారత రాష్ట్రపతి సంతకం కూడా చేశారు. ఈ బిల్లు అమలుపై బీజేపీయేతర ముఖ్యమంత్రులు తమ వైఖరిని స్పష్టం చేయాలని ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త, జేడీయూ ఉపాధ్యక్షుడు ప్రశాంత్‌ కిషోర్‌ వ్యాఖ్యానించారు. మత ప్రాతిపదికన పౌరసత్వం ఇచ్చే ఈ బిల్లు వల్ల భారతదేశ ఆత్మ దెబ్బతింటుందని ఆయన ట్విటర్‌లో పేర్కొన్నారు.

పంజాబ్‌, కేరళ, పశ్చిమబెంగాల్‌ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇప్పటికే ఈ చట్టంతోపాటు ఎన్నార్సీని తమ రాష్ట్రంలో అమలు చేయబోమని ప్రకటించారని, మిగతా 16 రాష్ట్రాల బీజేపీయేతర ముఖ్యమంత్రులు తమ వైఖరి స్పష్టం చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. కాగా, ఈ బిల్లుకు జేడీయూ పార్టీ లోక్‌సభలో మద్దతు తెలపడంపై పీకే అసంతృప్తి వ్యక్తం చేశారు. అయినా జేడీయూ రాజ్యసభలోనూ ఈ బిల్లుకు మద్దతు తెలపడం గమనార్హం. మరోవైపు ఈ బిల్లును ఈశాన్య రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇదిలా ఉండగా, దేశంలో ఉన్న శరణార్థులు ఈ బిల్లుపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!