వేలానికి వేళాయెరా
క్రికెట్ అభిమానులకు తీపి కబురు. అసలైన క్రికెట్ యుద్దానికి రంగం సిద్ధమవుతోంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2020 వేలానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కోట్లాది రూపాయల కానక వర్షం కురవబోతోంది. అంతే కాకా క్రికెటర్లపై కోట్లు కురిపించేందుకు ఫ్రాంచైజీలు రెడీగా ఉన్నాయి. మ్యాక్స్‌వెల్, క్రిస్ మోరిస్ లతో పాటు పేసర్ కమిన్స్ ఈ వేలంలో హాట్ కేక్‌లు కావొచ్చని ఐపీఎల్ వర్గాలు భావిస్తున్నాయి. కోల్‌కతాలో అందుబాటులో ఉన్న 73 బెర్త్‌ల కోసం జరిగే ఆటగాళ్ల వేలంలో బ్యాట్స్‌మెన్ ఫించ్, క్రిస్ లిన్, జాసన్ రాయ్, మోర్గాన్, రాబిన్ ఉతప్పలను తొలి రౌండ్‌లోనే చేజిక్కించు కునేందుకు ఫ్రాంచైజీలు దృష్టి పెట్టాయి.
వేలానికి అందుబాటులో ఉన్న ఆటగాళ్ల తుది జాబితాను ఐపీఎల్ పాలక మండలి ఫ్రాంచైజీలకు అంద జేసింది. మొదటి దశలో 971 మంది వున్న జాబితాను 332 మందికి కుదించింది. ఈ తుది జాబితాలో 19 మంది భారత ఆటగాళ్లతో పాటు ఫ్రాంచైజీలు కోరిన 24 మంది క్రికెటర్లున్నారు. ఇందులో విండీస్ పేసర్ విలియమ్స్, ఆల్‌రౌండర్ క్రిస్టియన్, లెగ్ స్పిన్నర్ జంపా, బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ ముషిఫికర్ ఉండగా సర్రే యువ బ్యాట్స్‌మన్ విల్ జాక్స్ కొత్త కుర్రాడు. యూఏఈలో జరిగిన టి10 మ్యాచ్‌లో 25 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. లాంక్‌షైర్‌తో జరిగిన మ్యాచ్ లో జాక్స్ 30 బంతుల్లో 11 సిక్సర్లు, 8 బౌండరీలతో 105 పరుగులు చేశాడు.
ప్యారీ వేసిన ఓవర్లో అయితే 6 బంతుల్లో 6 సిక్సర్లు బాదేశాడు. దీంతో ఈ ఆటగాడి కోసం ఫ్రాంచైజీలు పోటీపడే ఛాన్సెస్ ఉన్నాయి. కాగా వేలంపాటలో మొదటగా బ్యాట్స్ మేన్స్ , ఆల్‌రౌండర్లు, కీపర్లు, పేసర్లు, స్పిన్నర్లు వస్తారు. తాజా జాబితాలోహెవీ డిమాండు ఉన్న క్రికెట్య్రాలు ఏడుగురు వున్నారు. మ్యాక్స్‌వెల్, కమిన్స్, హాజల్‌వుడ్, మార్ష్, స్టెయిన్, మాథ్యూస్, మోరిస్‌ల ప్రాథమిక ధర2 కోట్లు కాగా... రాబిన్ ఉతప్ప కోటిన్నరతో తర్వాతి స్థానంలో ఉన్నాడు. మొత్తం మీద ఐపీఎల్ టోర్నీ లో ఈసారి మరింత మెరుపులు కురిపించే ఆటగాళ్ల కోసం క్రికెట్ ప్రేమికులు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి