ఊపిరి పీల్చుకున్న ముద్దుగుమ్మ
నటి శ్రియ శరన్ లండన్ పోలీసుల చేతిలో చిక్కి షాక్‌కు గురైంది. ఈ బ్యూటీ కథానాయకిగా బిజీగా నటిస్తూనే గత ఏడాది చాలా గోప్యంగా రష్యాకు చెందిన తన బ్యాయ్ ఫ్రెండ్ ఆండ్రి కోస్కిన్‌ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ తరువాత నటనకు కొద్ది కాలం దూరంగా ఉంది. ఉన్నట్టుండి ప్రస్తుతం తమిళంలో సండైక్కారి అనే చిత్రంలో నటిస్తోంది. వివాహానంతరం ఈ బ్యూటీ నటిస్తున్న దక్షిణాది చిత్రం ఇదొక్కటేనన్నది గమనార్హం. నటుడు విమల్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని బాస్ ప్రొడక్షన్స్ కార్పొరేషన్ అండ్ మెట్రో నెట్ మల్టీ మీడియా సంస్థల సమర్పణలో జయకుమార్ నిర్మిస్తున్నారు. మాదేశ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నటి శ్రియ సాఫ్ట్‌వేర్ కంపెనీ నిర్వాహకురాలుగా నటిస్తోంది.
విమల్ ఆమె కంపెనీలో పనిచేసే ఇంజినీర్‌గా నటిస్తున్నాడు. కాగా సండైక్కారి చిత్ర షూటింగ్ ఇటీవల లండన్‌లో నిర్వహించారు. ఈ సందర్భాంగా డైరెక్టర్ సినిమా విశేషాలు తెలిపారు. లండన్‌లోని అతి పెద్ద విమానాశ్రయం స్టెన్ పోర్టులో విమల్, శ్రియ, సత్యన్ నటించిన సన్నివేశాలను చిత్రీకరించినట్లు చెప్పారు. అప్పుడు అనుకోకుండా ఒక సంఘటన జరిగిందన్నారు. నటి శ్రియ తెలియ కుండా విమానాశ్రయంలోని భద్రతా ప్రాంత సరిహద్దులను దాటి వెళ్లిందన్నారు. దీంతో లండన్ భద్రతాధికారులు ఆమెను చుట్టి ముట్టి అనధికారికంగా ఈ ప్రాంతంలోకి ఎలా వస్తావు, అంటూ ప్రశ్నల వర్షం కురిపించారన్నారు.
దీంతో బిత్తర పోవడం శ్రియ వంతైందన్నారు. దీంతో సమస్య జఠిలం అవుతుందని గ్రహించిన ఆ ప్రాంతానికి కాస్త దూరంగా ఉన్న నటుడు విమల్ వెంటనే అక్కడికి వెళ్లి తగిన ఆధారాలు చూపి పరిస్థితిని వివరించారన్నారు. దీంతో పోలీసులు శ్రియను చిరునవ్వుతో వదిలి పెట్టినట్లు చెప్పారు. కాగా ఇందులో నటుడు ప్రభు, కేఆర్.విజయ, రేఖ, ఉమా పధ్మనాభన్ ముఖ్య పాత్రలో నటిస్తుండగా మగధీర చిత్రం ఫేమ్ దేవేందర్ సింగ్ గిల్ ప్రతి నాయకుడిగా నటిస్తున్నట్లు తెలిపారు. దీనికి గురుదేవ్ ఛాయాగ్రహణం, అమ్రీష్ సంగీతాన్ని అందిస్తున్నారు. మొత్తం మీద కథ సుఖాంతం కావడంతో శ్రియ శరన్ ఊపిరి పీల్చుకున్నారు.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి