వినోద రంగంలో విప్లవం
ఇండియన్ వినోద రంగంలో ఇదో కీలక పరిణామం. ఒక రకంగా ఈ వార్త సెన్సేషన్ అనే చెప్పక తప్పదు. దేశ టీవీ ప్రసార పంపిణీ విభాగంలో అతిపెద్ద కంపెనీ ఆవిర్భావానికి అడుగులు పడుతున్నాయి. ఎయిర్‌టెల్ డిజిటల్ టీవీ, డిష్ టీవీ విలీనానికి ఇరు కంపెనీల మధ్య కొన్ని నెలలుగా జరుగుతున్న చర్చలు ముగింపు దశకు చేరాయి. ఇరు కంపెనీల ప్రమోటర్లతోపాటు, ప్రైవేటు ఈక్విటీ సంస్థ వార్‌బర్గ్‌పింకస్ డీల్ విషయమై ఒక అంగీకారానికి వచ్చినట్టు సమాచారం. ముందుగా డిష్ టీవీ తన డీటీహెచ్ వ్యాపారాన్ని వేరు చేస్తుంది. ఆ తర్వాత భారతీ టెలీ మీడియాతో విలీనం చేస్తుంది. ఎయిర్‌టెల్ డిజిటల్ టీవీకి భారతీ టెలీమీడియా మాతృ సంస్థగా ఉంది. ఇరు కంపెనీలు కలిస్తే 4 కోట్ల మంది టీవీ సబ్ర్‌స్కయిబర్లతో ప్రపంచంలో అతిపెద్ద టీవీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీగా అవతరిస్తుంది.
ఈ మేరకు విలీన పథకానికి సంబంధించి తుది అంశాలపై కసరత్తు చేసే పనిలో నిమగ్నమయ్యాయి. ఎయిర్‌టెల్ డిజిటల్ టీవీ, డిష్ టీవీలు కలవడం వల్ల డైరెక్ట్ టు హోమ్ టీవీ ప్రసారాల పంపిణీ మార్కెట్లో ఆధిపత్యానికి అవకాశం ఏర్పడుతుంది. 87 శాతం మార్కెట్ కేవలం రెండు సంస్థల చేతుల్లోనే ఉంటుంది. ఎయిర్‌టెల్ డిజిటల్, డిష్ టీవీ విలీన కంపెనీకి 4 కోట్ల కస్టమర్లు ఉంటారు. తద్వారా 62 శాతం మార్కెట్ వాటా ఈ సంస్థ చేతుల్లోనే ఉంటుంది. డిష్ టీవీకి 23.94 మిలియన్ చందాదారులు, ఎయిర్‌టెల్ డిజిటల్‌కు 16.21 మిలియన్ చందాదారులు ఉన్నారు.
టాటా స్కై 25 శాతం మార్కెట్ వాటా కలిగి ఉంది. మిగిలిన వాటా సన్ టీవీకి చెందిన సన్ డైరెక్ట్ సొంతం. టెలికం మార్కెట్ మాదిరే డీటీహెచ్ మార్కెట్లోనూ ఒకప్పుడు ఆరుగురు ప్లేయర్లు ఉండేవారు. ఎస్సెల్ గ్రూపునకు చెందిన డిష్ టీవీ, కొంత కాలం క్రితం వీడియోకాన్ డీటీహెచ్‌ను కొనుగోలు చేసింది. రిలయన్స్ డిజిటల్ టీవీని వేరొక సంస్థ కొనుగోలు చేసింది. కానీ, ఈ సంస్థ సేవలు చాలా నామ మాత్రంగానే ఉన్నాయి. భారతీ టెలీమీడియాలో 20 శాతం వాటాను వార్‌బర్గ్ పింకస్ 2017 డిసెంబర్‌లో కొనుగోలు చేసింది.
ఇందుకు 350 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టింది. తాజా విలీనం తర్వాత కూడా వార్‌బర్గ్‌పింకస్ తన పెట్టుబడులను కొనసాగించనుంది. డీల్ అనంతరం భారతీ టెలీమీడియాను స్టాక్ మార్కెట్లలో లిస్ట్ కూడా చేయనున్నారు. డిష్ టీవీ డీటీహెచ్ వ్యాపారాన్ని భారతీ టెలీమీడియాలో విలీనం తర్వాత.. నాన్ డీటీహెచ్ సేవలతో కొనసాగుతుంది. ఇందులో డిష్ ఇన్‌ఫ్రా సేవలు ఉంటాయి. అలాగే, సీఅండ్‌ఎస్ మీడియానెట్‌లో 51 శాతం వాటా కలిగి ఉంటుంది. ఈ రెండూ దిగ్గజ కంపెనీలు కలవడం వల్ల వినోద రంగంలో పెను మార్పు చోటు చేసుకోవడం ఖాయం.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి