రోహిత్..బ్రాండ్ అంబాసిడర్

అవకాశాలు ఎప్పుడు ఎవరిని తలుపు తడుతాయో చెప్పలేం. ఇలాంటి అరుదైన సన్నివేశాలు ఎక్కువగా ఆటల్లో, పాలిటిక్స్ ల్లో , సినిమా రంగాల్లో చోటు చేసుకుంటాయి. తాజాగా ఇండియన్ క్రికెట్ లో ఓపెనర్ గా రాణిస్తున్న రోహిత్ శర్మ ఇప్పుడు మోస్ట్ పాపులర్ క్రికెటర్. ప్రస్తుత జట్టులో కీలకమైన ఆటగాడిగా కొనసాగుతున్నాడు. అంతే కాకుండా భారత క్రికెట్ చరిత్రలో అరుదైన రికార్డు నమోదు చేశాడు. అదేమిటంటే ఏకంగా 400 సిక్సర్లు కొట్టిన ఘనతను సాధించాడు. ఎలాంటి బంతి అయినా, లేదా ఎంతటి దిగ్గజ బౌలర్ అయినా సరే ఈ క్రికెటర్ ముందు తల వంచాల్సిందే. ఒక్కసారి మైదానంలో ఉన్నాడంటే చాలు సిక్సర్ల మోత మోగుతుంది. అలవోకగా బంతుల్ని స్టేడియంలో పడేలా కొట్టడంలో ఇతనికి ఇతడే సాటి.

ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు స్టార్లుగా మారి పోయారు. వీరి కోసం దిగ్గజ, కార్పొరేట్ కంపెనీలు క్యూ కడుతున్నాయి. ఒక్కో ఆటగాడు కోట్లల్లో సంపాదిస్తున్నారు. దీపం ఉండగానే ఇల్లు చక్క దిద్దు కోవాలనే ఆలోచనతో తమ బ్రాండ్ , ఇమేజ్  పెంచుకునే పనిలో పడ్డారు. దీంతో వద్దంటే కంపెనీలు ఆఫర్ల మీద ఆఫర్లు ఇస్తున్నాయి. తాజాగా ఈ క్రికెట్ స్టార్ కు అరుదైన ఆఫర్ లభించింది. రోహిత్‌ శర్మ ‘ల లీగా’ భారత ప్రచారకర్తగా వ్యవహరిస్తాడు. క్రికెట్‌ క్రేజ్‌ ఉన్న ఇండియాలో ఫుట్‌బాల్‌ను అనుసరించే వాళ్ల సంఖ్య పెంచేందుకు ‘ల లీగా’ కంపెనీ స్టార్‌ బ్యాట్స్‌మన్‌ను తమ బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమించింది. ఈ సందర్భంగా ‘హిట్‌మ్యాన్‌’ మీడియాతో మాట్లాడాడు.

టీమిండియాలో ఫుట్‌బాల్‌ అభిమానులు చాలా మందే ఉన్నారని హార్దిక్‌ పాండ్యా, లోకేశ్‌ రాహుల్, శ్రేయస్‌ అయ్యర్‌లైతే సాకర్‌ స్టార్లను బాగా అనుసరిస్తారని చెప్పాడు. ధోని తమ జట్టులో నంబర్‌వన్‌ ఫుట్‌బాల్‌ ప్లేయర్‌ అని చెప్పాడు. మా జట్టులో జ్లాటన్‌ రూపంలో ఇషాంత్‌ ఉన్నాడుగా అని చమత్కరించాడు. ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ పుణ్యమా అని ఫుట్‌బాల్‌కు ఆదరణ అంతకంతకూ పెరుగుతోందని, ఫ్రాన్స్‌ సాకర్‌ స్టార్‌ జిదాన్‌ అభిమాని అయిన రోహిత్‌ చెప్పాడు. సాకర్‌లో సత్తాగల కుర్రాళ్లకు ఐఎస్‌ఎల్‌ మంచి వేదికని అన్నాడు. స్పెయిన్‌లో ప్రముఖ ఫుట్‌బాల్‌ లీగ్‌ అయిన ‘ల లీగా’కు ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ ఉంది. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!