వాల్ మార్ట్ తో ఒప్పందం ఉపాధికి ఊతం
ప్రపంచంలోనే వ్యాపార పరంగా టాప్ రేంజ్ లో ఉన్న అమెరికా దిగ్గజ కంపెనీ వాల్ మార్ట్ హైదరాబాద్ పై కన్నేసింది. ఆ మేరకు ఇక్కడ కూడా బిజినెస్ స్టార్ట్ చేసింది. తన వ్యాపారాన్ని విస్తరించే పనిలో పెద్దది. ఇందు కోసం వచ్చిన ప్రతి అవకాశాన్ని అంది పుచ్చుకుంటోంది. తమ కాన్సెప్ట్ కు దగ్గరగా ఉండే కంపెనీలతో టై అప్ చేసుకునేందుకు ఉవ్విల్లూరుతోంది. అయితే గతంలో వాల్ మార్ట్ లో అమెరికాలో ఉద్యోగులు రోడ్డెక్కారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఇదే సమయంలో పరిస్థితి అదుపులోకి వచ్చినా, ఈ కంపెనీ ఇండియాలో అత్యధికంగా కొనుగోలుదారులు ఉన్నారు. ఇక్కడైతే వ్యాపారం వర్కవుట్ అవుతుందనే ఆలోచనతో ఈ కామర్స్ రంగంలోకి అడుగు పెట్టింది.
ఇప్పటికే ఇదే రంగంలో కుదురుకున్న ఫ్లిప్ కార్ట్ కంపెనీని టేకోవర్ చేసుకుంది. తాజాగా తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా కంపెనీలకు రెడ్ కార్పెట్ పరుస్తోంది. దేశంలో ఎక్కడా లేని విధంగా ఇండస్ట్రియల్ పాలసీని తీసుకు వచ్చింది. ఏ దేశానికి చెందిన వారైనా లేదా ఇండియాకు చెందిన వారైనా సరే పెట్టుబడులు పెట్టేందుకు వస్తే వారికి అన్ని సౌకర్యాలు కల్పించేలా చేసింది. దీంతో పెట్టుబడులు పెట్టేందుకు వ్యాపారాలు క్యూ కట్టారు. చాలా కంపెనీలు ఏర్పాటు చేసే పనిలో పడ్డాయి కూడా. ప్రస్తుతం తెలంగాణలో తయారీ రంగంలోని ఖాయిలా పరిశ్రమలను పునరుద్ద రించేందుకు ఏర్పాటు చేసిన తెలంగాణ ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ రిటైల్ బహుళ జాతి కంపెనీ వాల్‌మార్ట్‌తో ఒప్పందం చేసుకోనుంది. టీఐహెచ్‌సీలోని ఎంఎస్‌ఈలకు ఆన్‌లైన్ వేదికను అందించడంతో పాటు మార్కెటింగ్ అవకాశాలను కల్పించడమే దీని ప్రధాన ఉద్దేశం.
100 కోట్ల సోషల్ ఈక్విటీ ఇన్వెస్ట్‌మెంట్స్ కోసం పలు విదేశీ ఇన్వెస్టర్లతో చర్చలు జరుపుతోంది. రెండేళ్ల లాకిన్ పీరియడ్‌తో 7 శాతం డివిడెండ్‌ను కేటాయిస్తోంది. వచ్చే 3 నెలల్లో డీల్ క్లోజ్ చేసేందుకు పావులు కదుపుతోంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఖాయిలా పడ్డ 43 ఎంఎస్‌ఎంఈలను పునరుద్ధరించారు. వీటి ద్వారా సుమారు 1,100 మందికి ఉద్యోగ అవకాశాలు దొరికాయి. ప్రస్తుతం మరొక 12 ఎంటర్‌ప్రైజ్‌లు పునరుద్ధ్దరణ జాబితాలో ఉన్నాయి. మహిళా ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల కోసం ప్రత్యేకంగా నారీ పథకాన్ని ఏర్పాటు చేశారు. వార్షిక వడ్డీ రేటు 9 శాతంగా ఉంటుంది. గరిష్ట రుణం 25 లక్షలు ఉండగా ఎన్ని కోట్లు అయినా తీసుకునే వెసలుబాటు కల్పించారు. మొత్తం మీద వాల్ మార్ట్ తో ఒప్పందం వల్ల కొందరికి మేలు చేకూరనుంది.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి