అమ్మకానికి ఎయిరిండియా
ఇప్పటికే ప్రభుత్వ కంపెనీలను అమ్మకానికి పెట్టిన మోదీ సర్కార్ తాజాగా ఎయిరిండియాపై కన్నేసింది. భారత్ సంచార నిగమ్ లిమిటెడ్ లో ఉద్యోగులను ఇంటికి పంపించే పనిలో పడ్డది. దాదాపు 70 వేల మందికి పైగా ఉద్యోగులు స్వచ్చంద పదవీ విరమణ కోసం దరఖాస్తు చేసుకున్నారు. నష్టాల నెపం పేరుతో లాకవుట్ ప్రకటించడంతో లేదా మూసి వేయడమే లేదా ఇతర కంపెనీలకు దారాదత్తం చేయడమో చేస్తూ వస్తోంది. నోట్ల రద్దు తర్వాత భారత ఆర్థిక పరిస్థితి మరింతగా దిగజారింది. దేశీయ విమానయాన రంగంలో విశిష్ట సేవలు అందించిన ఎయిరిండియా సంస్థ ప్రమాదంలో చిక్కుకుంది. మోయలేని భారంగా మారడంతో ఇక అమ్మడానికి రెడీ అవుతోంది కమల ప్రభుత్వం.
అందరూ ఊహించినట్లుగానే చావు కబురు చల్లగా చెప్పారు మంత్రివర్యలు. నష్టాలు, రుణాల భారంతో కుదేలవుతున్న ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియాలో 100 శాతం వాటాలు విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు హర్‌దీప్ సింగ్ పురి స్పష్టం చేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఎయిరిండియాలో డిజిన్వెస్ట్‌మెంట్ కోసం ప్రత్యేక యంత్రాంగాన్ని పునరుద్ధరించినట్లు, వ్యూహాత్మకంగా వాటాల విక్రయ ప్రతిపాదనకు ఆమోద ముద్ర వేసినట్లు ఆయన లోక్‌సభకు రాత పూర్వక సమాధానం ద్వారా తెలిపారు. దాదాపు 50,000 కోట్ల రుణ భారం ఉన్న ఎయిరిండియా 2018–19లో 8,556 కోట్ల నష్టాలు నమోదు చేసింది.
మరోవైపు, ఏవియేషన్ రంగంలో పరిస్థితులను మెరుగు పర్చే దిశగా.. జెట్ ఎయిర్‌వేస్ విమానాలను ఇతర ఎయిర్‌లైన్స్‌కు బదలాయించేందుకు సత్వర చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. వచ్చే అయిదేళ్లలో వివిధ విమానాశ్రయాలను అభివృద్ధి చేసేందుకు ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా 25,000 కోట్లు వెచ్చించనున్నట్లు వివరించారు. నిధుల సంక్షోభంతో జెట్ ఎయిర్‌వేస్ ఇప్పటికే మూతబడిన సంగతి తెలిసిందే. దేశీ విమాయాన రంగంలో పోటీతత్వం మెరుగుపడే విధంగా, ఎయిరిండియాలో డిజిన్వెస్ట్‌మెంట్ సక్రమంగా, పారదర్శక విధానంలో జరగాలని విమానయాన సంస్థల అంతర్జాతీయ సమాఖ్య ఐఏటీఏ డైరెక్టర్ జనరల్ అలెగ్జాండర్ జునియాక్ అభిప్రాయ పడ్డారు.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి