పెళ్లి కళ వచ్చేసిందే బాల


ఇండియాలో క్రికెటర్లు, సినిమా స్టార్స్ కు ఎక్కడ లేనంత క్రేజ్. వీరికి ఉన్న ఫాలోయింగ్ పొలిటికల్ లీడర్లకు కూడా ఉండదు. తాజాగా తెలుగు, తమిళ్, హిందీ లో నటిస్తున్న ప్రముఖ నటి కాజల్ అగర్వాల్ ఉన్నట్టుండి వైరల్ అయ్యారు. ఈ ముద్దుగుమ్మకు అప్పుడే పెళ్లి కళ వచ్చేసిందంటూ నెటిజన్లు సామాజిక మాధ్యమాల్లో టెహ్గా వాకబు చేస్తున్నారు. దీంతో ఇప్పుడు కాజల్ చర్చనీయాంశంగా మారారు. ఉత్తరాదికి చెందిన ఈ బ్యూటీ దక్షిణాదిలో ముఖ్యంగా కోలీవుడ్, టాలీవుడ్‌లో ప్రముఖ కథానాయకిగా వెలుగొందుతోంది.  ప్రస్తుతం ఈ అమ్మడికి అవకాశాలు తగ్గాయి అనే కంటే టాలీవుడ్‌లో ఒక్క అవకాశం కూడా లేదు.

ఇక కోలీవుడ్‌లో శంకర్‌ దర్శకత్వంలో కమలహాసన్‌కు జంటగా నటిస్తున్న ఒకే ఒక్క చిత్రం ఇండియన్‌–2 చేతిలో ఉంది. ఈ చిత్రాన్ని కూడా పూర్తి చేసి కాజల్‌ సంసార జీవితంలోకి అడుగు పెట్టాలని భావిస్తున్నట్లు సమాచారం. నిజానికి కాజల్‌ అగర్వాల్‌కు చాలాకాలం నుంచే ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు. ఈ విషయాన్ని తనే ఆ మధ్య స్వయంగా చెప్పింది. ఇంకా చెప్పాలంటే కాజల్‌ చెల్లెలు నిషా అగర్వాల్‌కు పెళ్లి అయ్యి ఒక బిడ్డకు కూడా జన్మనిచ్చింది. అయితే అప్పట్లో కెరీర్‌ హైప్‌లో ఉండడంతో కాజల్‌ అగర్వాల్‌ పెళ్లి జోలికి వెళ్లలేదు.

ప్రస్తుతం సినిమాల కంటే లైఫ్ లో సెటిల్ కావడమే బెటర్ అనుకుంటోంది ఈ భామ. తెలుగులో టాప్ హీరోల సరసన నటించింది కాజల్. అంతే కాకుండా సహజ సిద్ధంగా నటించేందుకు తెగ ఇస్తా పడుతోంది. అయినా సినిమా ఛాన్సెస్ రాక పోవడంతో కెరీర్ ఆఖరు దశలో ఉన్నప్పుడు వేచి చూడడం కంటే ఫుల్ స్టాప్ పెట్టడమే బెటర్ అని భావిస్తోంది. దీంతో సినిమాలకు వెంటనే గుడ్ బై చెప్పేసి ఎంచక్కా పెళ్లి చేసుకుని, హాయిగా ఎంజాయ్ చేస్తే బావుంటుందని కాజల్ అనుకుంటుందోట. మొత్తం మీద ఈ అమ్మడికి ఇప్పటికైనా రియలైజ్ అయ్యిందన్న మాట. డైరెక్టర్ తేజ తీసిన సినిమాలో కాజల్ అగర్వాల్ అద్భుతంగా నటించింది. ఆమెకే ఎక్కువ మార్కులు పడ్డాయి. మొత్తం మీద ఈ అమ్మడు త్వరలో టాటా చెప్పేస్తుందన్నమాట.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!