వైరల్ గా మారిన ఉపాసన ట్వీట్

మెగాస్టార్ చిరంజీవి కోడలు, రామ్ చరణ్ భార్య ఉపాసన భారత ప్రధానమంత్రి నరేంద్ర దామోదర దాస్ పై చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది. మహాత్మా గాంధీ 150 జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఛేంజ్ వితిన్ పేరుతో సెలబ్రెటీలు, నిర్మాతలు, బిగ్ పర్సనాలిటీస్ తో ప్రధాన మంత్రి మోదీ సమావేశమవుతున్నారు. వారి సపోర్ట్ కావాలని అడుగుతున్నారు. అందులో భాగంగా ఢిల్లీ లోని కళ్యాణ్ మార్గ్ లో బాలీవుడ్ స్టార్స్ పీఎం తో భేటీ అయ్యారు. ఈ కార్యక్రమానికి షారుఖ్‌ ఖాన్‌, అమీర్‌ ఖాన్‌, కంగనా రనౌత్‌, జాక్వలిన్‌ ఫెర్నాండెజ్‌ సహా పలువురు సినీ, టెలివిజన్‌ ప్రముఖలు హాజరయ్యారు.

ఈ విషయాన్ని మోదీ ట్విటర్‌లో సైతం పంచుకున్నారు. అయితే మోదీ హిందీ ప్రముఖలను మాత్రమే కలవడంపై ఉపాసన అసహనం వ్యక్తం చేశారు. సౌత్ ఇండియా చిత్ర పరిశ్రమ నుంచి ఒక్క కళాకారుడికి కూడా ఆహ్వానం అందక పోవటంపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. దక్షిణాది చిత్ర పరిశ్రమను పట్టించుకోవడం లేదని అభిప్రాయ పడ్డారు. ఈ విషయంపై ఆమె ప్రధానిని సూటిగా ప్రశ్నించడం..అంతటా చర్చనీయాంశంగా మారింది. ప్రధాని నరేంద్ర మోదీ.. మీరు ప్రధాని అయినందుకు దక్షిణాది ప్రజలు గర్విస్తున్నారు.

కానీ మీరు దక్షిణాది కళాకారులను ఖాతరు చేయక పోవటం మాత్రం నన్ను ప్రత్యేకంగా బాధించింది. దీన్ని మీరు అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను అంటూ ఉపాసన కామినేని ట్వీట్‌ చేసింది. కాగా ఇక్కడి చిత్ర పరిశ్రమను చిన్న చూపు చూడటం అనాది నుంచి వస్తోంది. అయితే ఈ విషయంపై ప్రధానిని ధైర్యంగా గొంతెత్తి ప్రశ్నించిన ఉపాసనకు అన్ని వర్గాల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. ప్రస్తుతం ఆమె చేసిన పోస్ట్‌ వైరల్ గా మారింది. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!