దాయాదుల మధ్య పోరు షురూ

నిన్నటి దాకా మిన్నకుండి పోయిన పాకిస్థాన్ అదును చూసి ఇండియాను టార్గెట్ చేసింది. గత కొన్ని రోజులుగా ఇరు దేశాల మధ్య సంబంధాలు పూర్తిగా తెగి పోయాయి. అంతర్జాతీయ సమాజంలో పాకిస్తాన్ ఒంటరిగా మారింది. నిన్నటి దాకా సపోర్ట్ గా ఉన్న చైనా సైతం పాకిస్తాన్ కు గుడ్ బై చెప్పేసింది. దీంతో పాకిస్తాన్ పగతో రగిలి పోతున్నది. భారత స్థావరాలపై దాడులకు పాల్పడింది. దీంతో కేంద్ర హోమ్ శాఖా మంత్రి రాజ్ నాథ్ సింగ్ సమావేశమయ్యారు. అనంతరం భారత ఆర్మీ రంగంలోకి దిగింది. ఇండియన్ బలగాలు భారీగా కాల్పులతో విరుచుకు పడటంతో పాక్‌ ఆర్మీ పోస్టులు ధ్వంసమయ్యాయి. పీఓకేలోని ఉగ్ర స్థావరాలపై భారత్‌ ప్రతీకార కాల్పులకు దిగింది. బాలాకోట్‌ ఉగ్ర స్థావరాలపై వైమానిక దాడుల అనంతరం.. ఆ స్థాయిలో పాక్‌ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్ర స్థావరాలపై విరుచుకు పడింది.

భారత్‌లోకి చొరబడి విధ్వంసం సృష్టించేందుకు పీఓకేలోని నీలం లోయలో ఉన్న నాలుగు ఉగ్ర స్థావరాల్లో సిద్ధంగా ఉన్న ఉగ్రవాదులపై బుల్లెట్ల వర్షం కురిపించింది. పక్కా ప్రణాళికతో, స్పష్టమైన లక్ష్యాలను దృష్టిలో పెట్టుకుని భారత జవాన్లు కాల్పులు జరిపారు. మూడు స్థావరాలను పూర్తిగా నేలమట్టం చేసి, మరో స్థావరాన్ని భారీగా నష్టపరిచిన భారత జవాన్లు.. ఆ స్థావరాల్లో భారీ సంఖ్యలో ఉన్న ఉగ్రవాదులను మట్టుపెట్టారు. పీఓకేలోని ఉగ్ర స్థావరాల నెట్‌వర్క్‌ చాలా వరకు ధ్వంసమైందన్నారు ఆర్మీ చీఫ్ రావత్‌. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌కు ఆర్మీ చీఫ్‌ పీఓకేలోని ఉగ్ర స్థావరాలపై భారత్‌ దాడులు, తదనంతర పరిస్థితులను వివరించారు. మరోవైపు, దాడుల్లో ఉగ్రవాదులు, పాక్‌ జవాన్లు చనిపోయారన్న భారత్‌ వాదనను పాకిస్తాన్‌ తోసిపుచ్చింది.

భారత్‌ అబద్ధాలను ప్రచారం చేస్తోందని పేర్కొంది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి లోని 5 శాశ్వత సభ్య దేశాల ప్రతినిధులను ఉగ్ర స్థావరాలున్నాయని భారత్‌ చెబుతున్న నీలం లోయ ప్రాంతానికి తీసుకు వెళ్లేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, వారే నిజా నిజాలను నిర్ధారిస్తారని పాక్‌ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మొహమ్మద్‌ ఫైజల్‌ సవాలు చేశారు. పాకిస్తాన్‌లో భారత రాయబారి గౌరవ్‌ అహ్లూవాలియాను పాక్‌ ప్రభుత్వం పిలిపించి భారత్‌ కాల్పులకు నిరసన తెలిపింది. కాగా ఇరు దేశాల మధ్య మరింత ఆధిపత్య పోరు ప్రారంభమైంది. ఇది మరో యుద్దానికి ఆరంభమైనా ఆక్షర్య పోవాల్సిన పనిలేదు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!