పదవే వద్దన్న పృథ్వీ


మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ - మా హైదరాబాద్ లో  ఏర్పాటు చేసిన సమావేశం రసాభాసగా మారింది. మీటింగ్ మధ్యలోనే సభ్యులు  అర్థాంతరంగా వెళ్లిపోయారు.  మా అధ్యక్షుడు నరేష్‌కు తెలియ కుండానే ‘మా’ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా ఉన్న జీవితా రాజశేఖర్..ఫిలిం ఛాంబర్‌లో ఈ సమావేశం నిర్వహించారు. ఈ మీటింగ్‌కు నరేష్ తప్ప మిగిలిన సభ్యులంతా హాజరయ్యారు. నరేష్ వర్గం.. జీవితా రాజశేఖర్ వర్గం మధ్య మాటల యుద్ధం కొనసాగింది. అధ్యక్షుడు లేకుండా సమావేశం ఎలా నిర్వహిస్తారని నరేష్‌ తరపు న్యాయవాది ప్రశ్నించారు.

ఇది జనరల్‌ బాడీ మీటింగ్‌ కాదని, కేవలం ఫ్రెండ్లీ సమావేశం మాత్రమేనని జీవితా రాజశేఖర్‌ తెలిపారు. కాగా మా లో ఎక్జిక్యూటివ్ కమిటీ మెంబర్‌గా ఉన్న శ్రీ వెంకటేశ్వర భక్తి చానెల్‌ చైర్మన్‌ పృథ్వీ రాజ్ మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌పై నిప్పులు చెరిగారు. తనకు ఈసీ మెంబర్‌ పదవి అక్కర్లేదని, సభ్యుల తీరు మారకుంటే రాజీనామా చేస్తానని హెచ్చరించారు. గెలిచినందుకు ఆనంద పడాలో.. బాధ పడాలో తెలియడం లేదన్నారు. మా లో ఎవరి గ్రూపులు వారు పెట్టుకున్నారని, మెంబర్స్‌ కూడా ఎవరికి వారే ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఎన్నో సినిమాలకు కథలు రాసిన పరుచూరి గోపాలకృష్ణని ఘోరంగా అవమానించారని పృథ్వీ మండిపడ్డారు. కాగా నరేష్ వర్సెస్, జీవిత రాజశేఖర్ ల మధ్య కొంత గ్యాప్ ఏర్పడింది. గతంలో కూడా ఎవరికి వారే ఆరోపణలు చేసుకున్నారు. కొందరు పెద్దలు జోక్యం చేసుకుని సమస్యలు ఏవైనా ఉంటే కూర్చుని, సామరస్య వాతావరణంలో చర్చలు జరిపి పరిష్కారించు కోవాలని సినీ రంగానికి చెందిన పెద్దలు సూచించారు. అయినా ఎలాంటి మార్పు రాలేదు. మరో వైపు సమావేశం నుండి గోపాలకృష్ణ మధ్యలోనే వెళ్లి పోవడం సినీ రంగంలో చర్చనీయాంశ మైంది. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!