పట్టు బిగిస్తున్న టీమిండియా
టీమిండియా రాంచీలో సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టులో పట్టు బిగిస్తోంది. అటు బౌలింగ్ లోను..ఇటు బ్యాటింగ్ లోను రాణించింది. మరో వైపు టీమిండియా పేసర్ ఉమేశ్ యాదవ్ రాణించాడు. తొలి ఇన్నింగ్స్‌లో 10 బంతుల్లో 31 పరుగులు సాధించాడు. ఇందులో ఐదు సిక్సర్లు ఉండగా, ఉమేశ్‌కు టెస్టుల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు. వచ్చీ రావడంతోనే జార్జ్ లిండే వేసిన ఓవర్‌లో చివరి రెండు బంతుల్ని సిక్సర్లుగా కొట్టాడు. ఆపై మరొకసారి లిండే వేసిన ఓవర్‌లో మూడు సిక్సర్లు కొట్టాడు. సిక్సర్ల రూపంలోనే 30 పరుగులు సాధించాడు.
వేగంగా పరుగులు సాధించిన జాబితాలో మనోడు చోటు దక్కించుకున్నాడు. తొమ్మిది బంతుల్లోనే ఉమేశ్ యాదవ్ ఈ పరుగులు చేశాడు. గతంలో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఆటగాడు స్టీఫెన్ ఫ్లెమింగ్ 30 పరుగుల్ని 10 బంతుల్లో సాధిస్తే దాన్ని ఉమేశ్ బ్రేక్ చేశాడు. ఉమేశ్, ఫ్లెమింగ్‌ల తర్వాత వెస్టిండీస్ ఆటగాడు నామ్ మెక్లీన్స్, అబ్దుల్ రజాక్‌లు వరుస స్థానాల్లో ఉన్నారు. ఇక టెస్టు ఫార్మాట్ చరిత్రలో 10 బంతులు, ఆపై ఆడిన అత్యధిక స్ట్రైక్‌రేట్ కల్గిన ఆటగాళ్లలో ఉమేశ్ అగ్ర స్థానంలో నిలిచాడు.
ఇక్కడ ఉమేశ్ యాదవ్ 310 స్టైక్‌రేట్‌తో టాప్‌కు చేరుకున్నాడు. ఆ తర్వాత ఫ్లెమింగ్ 281.81 స్టైక్‌రేట్‌తో రెండో స్థానంలో నిలిచాడు. ఈ మ్యాచ్‌లో భారత్ 497/9 పరుగుల వద్ద తన తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్డ్ చేయగా, ఇన్నింగ్స్ మొదలు పెట్టిన సఫారీలు 8 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయారు. డీన్ ఎల్గర్‌ను షమీ ఔట్ చేస్తే, డీకాక్‌ను ఉమేశ్ యాదవ్ పెవిలియన్‌కు పంపించాడు. రోహిత్ డబుల్ సెంచరీ చేయగా, అజింక్యా రెహానే సెంచరీ తో దుమ్ము రేపగా, జడేజా ప్రతిభ చూపారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి